»   » ఇంటర్వెల్ ఫైట్ : బాలయ్య , విలన్ కబీర్ తో ఇలా... (ఫొటో)

ఇంటర్వెల్ ఫైట్ : బాలయ్య , విలన్ కబీర్ తో ఇలా... (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం 'డిక్టేటర్‌'. అంజలి, సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్స్. శ్రీవాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఎరోస్‌ ఇంటర్నేషనల్‌, వేదాశ్వ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

 Balakrishna with Villan Kabir Duhan Singh

ప్రస్తుతం హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో రవివర్మ నేతృత్వంలో ఓ భారీ పోరాట దృశ్యాన్ని తెరకెక్కిస్తున్నారు. బాలకృష్ణ, అజయ్‌, కబీర్‌ మరో వంద మంది ఫైటర్లు ఈ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. విశ్రాంతి సన్నివేశాలకు ముందొచ్చే పోరాట దృశ్యమిది. అందుకే మరింత పకడ్బందీగా ఈ ఫైట్‌ని రూపొందిస్తున్నారు. ఈ సందర్బంగా కబీర్ ...బాలయ్యతో దిగిన ఓ ఫొటోని షేర్ చేసారు. ఆ ఫొటోని ఇక్కడ చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

దర్శుడు మాట్లాడుతూ...వందమందిని..ఒంటిచేత్తో..అసలే ఆయన డిక్టేటర్‌! బద్దలవ్వడానికి సిద్ధంగా ఉన్న అణు రియాక్టర్‌. అక్కడ యాక్షన్లే తప్ప, రియాక్షన్లు చూసేంత సమయం ఉండదు. తుపాను వచ్చేముందైనా వాతావరణం కాస్త ప్రశాంతంగా ఉంటుంది. డిక్టేటర్‌ ఆ అవకాశం కూడా ఇవ్వడు. బరిలో దిగితే బంతాటే! ఇక్కడ కూడా అంతే. ఒంటిచేత్తో వంద మందికి సమాధానం చెప్పాడు. బుల్లెట్లు దూసుకొస్తున్న వేళ.. నరకాసుర వధ చేశాడు. అదెలాగో తెలియాలంటే 'డిక్టేటర్‌' వచ్చేంత వరకూ ఆగాల్సిందే అన్నారు.

 Balakrishna with Villan Kabir Duhan Singh

దర్శకుడు శ్రీవాస్‌ కంటిన్యూ చేస్తూ.... ‘‘బాలకృష్ణగారి పాత్ర, ఆ పాత్రలో ఆయన నటన సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. టైటిల్‌ని బట్టే ఆయన కేరక్టర్‌ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో ఊహించుకోవచ్చు. యాక్షన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ అంశాలను సమపాళ్లలో మేళవించాం. అభిమానుల అంచనాలకు తగ్గట్లే సినిమా ఉంటుంది. యూరప్‌లో ఇప్పటివరకూ ఏ తెలుగు సినిమానీ తీయని లొకేషన్లలో పాటలు, టాకీ, యాక్షన్‌ సన్నివేశాల్ని ప్లాన్‌ చేశాం'' అని చెప్పారు.

 Balakrishna with Villan Kabir Duhan Singh

ఇటీవల వినాయక చవితి సందర్భంగా 'గం...గం... గణేశా' అనే గీతాన్ని విడుదల చేశారు. ఆ పాటకు మంచి స్పందన వస్తోంది. నాజర్‌, బ్రహ్మానందం, రవికిషన్‌, కబీర్‌, వెన్నెల కిశోర్‌, పృథ్వీ, కాశీ విశ్వనాథ్‌, సుప్రీత్‌, అమిత్‌ తారాగణమైన ఈ చిత్రానికి కథ, స్ర్కీన్‌ప్లే: కోన వెంకట్‌, గోపీమోహన్‌, రచన: శ్రీధర్‌ సీపాన, మాటలు: ఎం. రత్నం, సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: శ్యామ్‌ కె. నాయుడు, కూర్పు: గౌతంరాజు, ఫైట్స్‌: రవివర్మ.

English summary
Kabir Duhan Singh ‏ tweeted:With #balakrishna sir totally paisa wasool action. .very humble, caring and always smiles. Thanks for the care sir. "
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu