»   » బోయపాటికి బాలకృష్ణ వార్నింగా..!? హెచ్చరిక వెనుక థ్రిల్లింగ్ స్టోరీ ఇదే

బోయపాటికి బాలకృష్ణ వార్నింగా..!? హెచ్చరిక వెనుక థ్రిల్లింగ్ స్టోరీ ఇదే

Posted By:
Subscribe to Filmibeat Telugu

బోయపాటికి బాలకృష్న కీ ఉన్న చనువు అందరికీ తెలిసిందే. అలాంటిది బోయపాటికి బాలయ్య వార్నింగ్ ఇచ్చారు అన్న వార్తలకి టలీవుడ్ ఒక్క సారి షాక్ తింది. అయితే తర్వాత అసలు సంగతి తెలిసి ఊపిరి పీల్చుకున్నారంతా... నిజానికి వార్నిగ్ అంటే కోపంగా ఇవ్వటం కాదు. ఫ్రెండ్లీగానే బెదిరించాడట బాలయ్య. అయితే దీనివెనుక కూడా ఒక థ్రిల్లింగ్ విషయం ఉంది. కృష్ణ వంశి తో చేయాల్సిన రైతు ఇక ఆగిపోయినట్టే అని అర్థమైపోయింది. మరి ఆ స్థానం లో రావాల్సిన సినిమా ఇప్పుడు బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో అట మరి బాలకృష్ణ అభిమానులకి ఇది థ్రిల్లింగ్ విషయమే కదా

టాలీవుడ్‌లో ఇప్పుడు ఇదే టాక్. ఇంతకీ బోయపాటికి బాలయ్య చెప్పిన పనేంటో తెలుసా? ప్రస్తుతం బాలయ్య గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలో నటిస్తున్నాడు. వాస్తవానికి బాలయ్య తన వందో చిత్రాన్ని బోయపాటితో చేస్తాడు అనుకున్నారు. కానీ, క్రిష్ 'గౌతమిపుత్ర' వంటి చారిత్రక కథతో రావడంతో అటువైపు మొగ్గు చూపాడు బాలయ్య. దీంతో 101వ సినిమా అన్న బోయపాటితో చేస్తాడు అనుకుంటే.. కృష్ణవంశీ ఆ సినిమాను బుక్ చేసుకున్నాడు. అయితే, ప్రస్తుతం కృష్ణవంశీ చేస్తున్న నక్షత్రం పూర్తవడానికి చాలా ఆలస్యం అవుతుందట. అప్పటివరకు ఆగలేని బాలయ్య.. బోయపాటికి ఫోన్ చేసి.. తన తరువాతి సినిమాకు కథను సిద్ధం చేయమన్నాడట. ఇంకేముంది బోయపాటి ఆనందానికి అవధుల్లేవట. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా చేస్తున్న బోయపాటి.. త్వరత్వరగా పూర్తి చేసి బాలయ్య కోసం కథ సిద్ధం చేసే పనిలో పడ్డాడట.

తదుపరి సినిమా:

తదుపరి సినిమా:

బాలకృష్ణ 101వ సినిమాగా కృష్ణవంశీ దర్శకత్వంలో 'రైతు' తెరకెక్కవలసి వుంది. రేపో మాపో ఈ సినిమా పట్టాలెక్కడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఈ సినిమా పట్టాలెక్కే పరిస్థితులు కనిపించడం లేదు. దాంతో తన తదుపరి సినిమాను బోయపాటి దర్శకత్వంలో చేయాలని బాలకృష్ణ భావిస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'సింహా' .. ' లెజెండ్' చిత్రాలు ఘన విజయాలను అందుకున్న సంగతి తెలిసిందే.

బాలయ్యతో 100వ సినిమా :

బాలయ్యతో 100వ సినిమా :

నందమూరి బాలకృష్ణ తన 100వ చిత్రాన్ని బోయపాటి శ్రీనుతోనే చేయాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాలతో, ఆ ఛాన్స్‌ని విలక్షణ దర్శకుడు క్రిష్‌ చేతిలో పెట్టాడు. 'గౌతమీ పుత్ర శాతకర్ణి' పేరుతో చారిత్రక కథాంశాన్ని సినిమాగా తెరకెక్కిస్తున్నాడు క్రిష్‌. . అంగరంగ వైభవంగా ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలయ్యతో 100వ సినిమా చేసే ఛాన్స్‌ దక్కించుకోలేకపోయారు కదా? అని బోయపాటిని ప్రశ్నించినప్పుడు,

పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌:

పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌:

అప్పట్లో అదే అనుకున్నాంగానీ కుదరలేదని ఆయన సమాధానం చెప్పాడు. అయితే 101వ సినిమా మాత్రం బోయపాటితోనేనని బాలకృష్ణ ఫిక్సయ్యాడని సమాచారమ్‌. ఇది కూడా పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లోనే ఉంటుందట. 'సింహ', 'లెజెండ్‌' చిత్రాల్లో పొలిటికల్‌ టచ్‌ ఉంటుంది. 'సింహ'తో పోల్చితే 'లెజెండ్‌'లో పొలిటికల్‌ టచ్‌ చాలా ఎక్కువ. ఈ రెండిటికీ మించినంత పొలిటికల్‌ టచ్‌ బాలయ్య - బోయపాటి కాంబినేషన్‌లో రాబోయే కొత్త సినిమాకి ఉండబోతుందట.

పొలిటికల్‌ కెరీర్‌కి :

పొలిటికల్‌ కెరీర్‌కి :

బాలకృష్ణ పొలిటికల్‌ కెరీర్‌కి ఊతమిచ్చేలా పవర్‌ఫుల్‌ సబ్జెక్ట్‌ని బోయపాటి ఇప్పటికే రెడీ చేయగా, వందో సినిమా చారిత్రక చిత్రం చేయాలనే ఉద్దేశ్యంతోనే బోయపాటిని తన 101వ చిత్రానికి దర్శకుడిగా ఎంపిక చేసి, 100వ చిత్రాన్ని క్రిష్‌కి బాలయ్య ఇచ్చాడని అనుకుంటున్నారు సినీ పరిశ్రమలో.

ఆ ఛాన్స్ బోయపాటి కి:

ఆ ఛాన్స్ బోయపాటి కి:

బాలకృష్ణ 101వ సినిమాగా కృష్ణవంశీ దర్శకత్వంలో 'రైతు' తెరకెక్కవలసి వుంది. కానీ ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయిందని టాలీవుడ్ జనాలు అంటున్నారు.అయితే ఇప్పుడు ఆ ఛాన్స్ బోయపాటి కి ఇస్తున్నాడంట బాలయ్య . గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'సింహా' .. ' లెజెండ్' చిత్రాలు ఘన విజయాలను అందుకున్న సంగతి తెలిసిందే. అయితే మరో వైపున గీతా ఆర్ట్స్ బ్యానర్లో రూపొందనున్న చిరంజీవి 151వ సినిమాకి దర్శకుడిగా బోయపాటి పేరు వినిపిస్తోంది. ఇద్దరు సీనియర్ హీరోలకు బోయపాటి పేరే వినిపిస్తుంది మరి బోయపాటి నోటా ఏ పేరు వినిపిస్తుందో చూడాలి ....

మాస్ హిట్స్ ఇచ్చిన బోయపాటితో:

మాస్ హిట్స్ ఇచ్చిన బోయపాటితో:

ఇంతకుముందు బాలకృష్ణ 101 సినిమాగా కృష్ణ వంశీతో ‘ రైతు' చేయాలనుకున్నాడు. కానీ శాతకర్ణి లాంటి సినిమా చేసిన తరువాత మళ్ళీ వెంటనే ‘ రైతు' లాంటి సినిమా కాకుండా ఓ మాస్ మూవీ చేస్తే బాగుంటుందని బాలయ్య ఫీల్ అయ్యాడట. అందుకే తనకు ‘ సింహా లెజెండ్ ‘ లాంటి మాస్ హిట్స్ ఇచ్చిన బోయపాటితో చేయాలని చూస్తున్నాడట బాలయ్య.

ఎవరితో రంగంలోకి దిగుతాడో:

ఎవరితో రంగంలోకి దిగుతాడో:

బాలకృష్ణ ఇద్దరిలో ఎవరితో బోయపాటి శ్రీనివాస్ సినిమా వుంటుందో చూడాలి. అయితే, ఖైదీ, గౌతమి పుత్ర సినిమాల వెంటనే చిరు, బాలయ్య ఇద్దరూ ఒకే సారి బోయపాటిమీద పడితే పరిస్థితి ఏంటన్నది ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో జరుగుతోన్న చర్చ. గీతా ఆర్ట్స్ బ్యానర్లో రూపొందనున్న చిరంజీవి 151వ సినిమాకి దర్శకుడిగా బోయపాటి పేరు వినిపిస్తోంది. ఇద్దరు సీనియర్ హీరోల తదుపరి సినిమాకి దర్శకుడిగా బోయపాటి పేరు వినిపిస్తుండటం విశేషం. మరి ఆయన ఎవరితో రంగంలోకి దిగుతాడో చూడాలి.

English summary
Nandamuri Balakrishna is doing his 100th film Gauthamiputra Sathakarni. It is planned that he will do Rythu in Krishna Vamsy direction. However, the project is delayed. So, Balakrishna is planning to do his 101 film in Boyapati Srinu direction.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu