»   »  బాలయ్య ఒప్పుకోకపోతే....!?!?

బాలయ్య ఒప్పుకోకపోతే....!?!?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Y V S Chowdary & Balakrishna
సీతయ్య చిత్రంలో ఒక పాటకు ట్యూన్లు కట్టే సమయంలో ఒక్క మగాడు టైటిల్ పుట్టిందని దర్శకుడు వైవియస్ చౌదరి చెబుతున్నారు. ట్యూన్లు కట్టే సమయంలో సంగీత దర్శకుడు కీరవాణి ఉపయోగించిన పదమే ఒక్కమగాడని ఆయన చెబుతున్నాడు. ఈ సంఘటన తిరుపతిలో జరిగిందన్న వైవియస్ హైదరాబాద్ కు రాగానే టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించామని అన్నాడు. భావ వ్యక్తీకరణ, అభినయం పరంగా చూస్తే ఈ సినిమాకు బాలకృష్ణే సరైన వ్యక్తి అని అన్న వైవియస్ బాలకృష్ణ ఈ చిత్రం కోసం రెండొందల శాతం న్యాయం చేశాడన్నారు. అందుకే ఈ చిత్రానికి ఒన్ అండ్ ఓన్లీ అన్న ట్యాగ్ బాలకృష్ణ ఒక్కరికే ఈ సినిమా సరిపోతుందన్న అర్థం వస్తుందని తెలిపారు. బాలయ్యబాబు కనుక ఈ సినిమా చేయడానికి ఒప్పుకోకపోతే ఈ సినిమా తీసేవాణ్ణి కాదని వైవియస్ స్పష్టం చేశారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X