»   »  బాలయ్య....ఈ వయస్సులోనూ నో డూప్

బాలయ్య....ఈ వయస్సులోనూ నో డూప్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్టంట్స్ తీసేటప్పుడు రిస్క్ ఫాక్టర్ తగ్గించటం కోసం డూప్ లను వినియోగిస్తూంటారు. అయితే బాలకృష్ణ వీటికి మొదటి నుంచి వ్యతిరేకం. ఎలాంటి ఫైట్ నైనా, జంప్ అయినా మరొకటి అయినా తనే చేసేస్తూంటారు. అయితే వయస్సు వచ్చింది కదా అని ఇప్పుడు డూప్ ని పెట్టబోతే ఆయన సున్నితంగా తిరస్కరించి డూప్ లేకుండానే ఫైట్స్ ఇరగతీసాడని సమాచారం.

పూర్తి వివరాల్లోకి వెళితే... 55 సంవత్సరాల నటసింహం ఇంకా తన పంజాతో వేట కొనసాగిస్తోంది. బాలకృష్ణ నటిస్తున్న సినిమా 'డిక్టేటర్‌'. బాలకృష్ణ ఉన్న కొన్ని కీలక సన్నివేశాలు తో పాటు, ఫైట్ మాస్టర్ రవివర్మ నేతృత్వంలో క్లయిమాక్స్ ఫైట్ ను హైదరాబాద్ లోని యుసఫ్ గూడాలో షూట్ చేస్తున్నారు. బాలకృష్ణ ఇది చేయాడానికి రిస్క్ తీసుకున్నారని, సుమారు 150 మంది జునియర్ అర్టిస్టులతో ఈ సీన్స్ ని తీస్తున్నారని సమాచారం. ఇది ఈ సినిమాకే హైలెట్ అవుతుందని యునిట్ వర్గాలు అంటున్నాయి.

నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంత కంటే ముందుగా పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు, అభిమానులు సమక్షంలో ఆడియో వేడుకను ఈ నెల 20న అమారవతిలో నిర్వహిస్తున్నారన్న సంగతి తెలిసిందే.

Balayya doing a stunt without any dupe

నిర్మాణ రంగంలో అతిపెద్ద నిర్మాణ సంస్థగా పేరున్న ఈరోస్‌ ఇంటర్నేషనల్‌,వేదాశ్వ క్రియేషన్స్‌ సంయుక్తంగా రూపొందిస్తోన్న బారీ బడ్జెట్‌ మూవీ ‘డిక్టేటర్‌'. అంజలి, సోనాల్‌ చౌహాన్‌, అక్ష హీరోయిన్స్‌.‘లౌక్యం'వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ మూవీ అందించిన శ్రీవాస్‌ ఈ చిత్రానికి దర్శకుడు. యంగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌.థమన్‌ సంగీత సారథ్యం వహించారు.

సుమన్‌, పవిత్రాలోకేష్‌, నాజర్‌, వెన్నెల కిషోర్‌, పృథ్వీ, కాశీ విశ్వనాథ్‌, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, హేమ, కబీర్‌, విక్రమ్‌ జీత్‌,అజయ్‌ తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి ఫైట్స్‌: రవివర్మ, ఆర్ట్‌: బ్రహ్మకడలి, ఎడిటర్‌: గౌతంరాజు, మ్యూజిక్‌: ఎస్‌.ఎస్‌.థమన్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు, రచన: శ్రీధర్‌ సీపాన, మాటు: ఎం.రత్నం, కథ, స్క్రీన్‌ప్లే: కోనవెంకట్‌,గోపిమోహన్‌, నిర్మాత: ఈరోస్‌ ఇంరట్నేషనల్‌, కో ప్రొడ్యూసర్‌, దర్శకత్వం: శ్రీవాస్‌.

English summary
At 55-year-old, Balakrishna doing a stunt without any dupe. Currently, the film's shoot is going on at brisk pace in Yusufguda of Hyderabad.
Please Wait while comments are loading...