»   » రేష్మి సినిమాకి బాలయ్య అండ

రేష్మి సినిమాకి బాలయ్య అండ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బాలకృష్ణ ఎమ్.ఎల్.ఏ గా గెలిచిన హిందూపురం, దాని చుట్టుపక్కల నిర్మాణం జరుపుకున్న సినిమా గుంటూర్ టాకీస్. ఈ సినిమాకు సంబందించి ధియోటర్ ట్రైలర్, ఈ నెల 3వ తారీఖున బాలకృష్ణ చేతుల మీదుగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే సుమారు 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబందించి ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స వేగంగా సాగుతున్నాయి. గుంటూర్ టాకీస్ సినిమా కన్ ప్యూజింగ్ కామెడీ అని, ఈ సినిమా అంతా సింగీతం శ్రీనివాసరావ్ డైరక్షన్ వహించి, కమల్ హాసన్ హీరోగా నటించిన మైకిల్ మదన కామరాజు వలె , సినిమా లైన్ వుంటుందని అనుకుంటున్నారు.

ఇంకా ఈ చిత్రానికి సంబందించి ఇష్కియా, డీల్లి బెల్లీ తరహాలో మాదిరి రెండు క్యారక్టర్స్ అయిన హరి మరియు 25 సంవత్సరాలున్న కేసనోవా పాత్రల్లో సిద్దు మరియు గిరి నటిస్తున్నారు.

Balayya launch Guntur Talkies trailer

శ్రధ్దా దాస్ రాడికల్ రోల్ నటిస్తుండగా, మహేష్ మజ్రేకర్ కూడా బ్యాడీగా కనిపించనున్నారు. వాళ్ళూ ఈ సినిమాలో సోంత వాయిస్ ను వుపయోగించనున్నారని టాక్. ఆర్‌కె స్టూడియో ఆధ్వర్యంలో ఈ సినిమాను రాజ్‌కుమార్ నిర్మిస్తున్నారు. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

రేష్మి చిత్రంలో హీరోయిన్ గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. చందమామకథలు చిత్రంతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలతో పాటు జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు ప్రవీణ్‌సత్తారు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. విలక్షణ కథాంశాలకు సున్నితమైన భావోద్వేగాల్ని జోడించి సినిమాల్ని తెరకెక్కించే ఈ దర్శకుడు ఈ సినిమాలో కూడా తనదైన మార్కు చూపించబోతున్నానని చెప్తున్నాడు.

‘గుంటూరు టాకీస్' సినిమా పేరుతో ఆర్‌కె స్టూడియో ఆధ్వర్యంలో ఈ సినిమాను రాజ్‌కుమార్ నిర్మిస్తున్నారు. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సిద్దూ, నరేష్ ప్రముఖ పాత్రల్లో నటిస్తుండగా హీరోయిన్‌లుగా శ్రద్ధాదాస్, జబర్దస్త్ యాంకర్ రశ్మీ నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో మహేష్ మంజ్రేకర్, రఘుబాబు, వెంకట్, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్న ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాగా రూపొందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

దర్శకుడు మాట్లాడుతూ ''చందమామ కథలు తరవాత చేస్తున్న చిత్రమిది. ఆ చిత్రానికి జాతీయ అవార్డు దక్కింది. అందుకే నాపై మరింత బాధ్యత పెరిగింది. ఓ సామాజిక స్పృహతో తెరకెక్కుతున్న చిత్రమిది. సందేశంతో పాటు వినోదమూ ఉంటుంద''న్నారు. ''ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''న్నారు.

లక్ష్మీ మంచు, రఘుబాబు, తాగుబోతు రమేష్‌, అపూర్వ తదితరులు నటిస్తున్నారు.ఛాయాగ్రహణం: రామిరెడ్డి.పి, కూర్పు: ధర్మేంద్ర కాకరాల

English summary
Balakrishna will launch the theatrical trailer of ‘Guntur Talkies’ on 3rd, February.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu