»   » ‘జ్యో అచ్యుతానంద’పై బాలయ్య , అలాగే 'గ్యారేజ్' గురించి కూడా...

‘జ్యో అచ్యుతానంద’పై బాలయ్య , అలాగే 'గ్యారేజ్' గురించి కూడా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: హీరో నందమూరి బాలకృష్ణ వారాహి చలన చిత్రం స్థాపకుడు సాయి కొర్రపాటికి అభినందనలు తెలిపారు. 'జ్యో అచ్యుతానందతో మరో విజయం అందుకున్న సాయి కొర్రపాటికి అభినందనలు' అంటూ బాలకృష్ణ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.


ఈ సందర్భంగా చిత్రం పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. చిత్రానికి మంచి స్పందన వస్తోందని హీరో నారా రోహిత్‌ సోషల్‌మీడియా ద్వారా ఆనందం వ్యక్తం చేశారు. అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అయితే ఆయన ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ టీమ్ కు కూడా విషెష్ చెప్తే బాగుంటుందని కొందరు అబిమానులు సోషల్ మీడియాలో తెలియచేస్తున్నారు.


నారా రోహిత్‌, నాగశౌర్య, రెజీనా ప్రధాన పాత్రల్లో శ్రీనివాస్‌ అవసరాల దర్శకత్వం వహించిన 'జ్యో అచ్యుతానంద' చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.


ప్రస్తుతం బాలకృష్ణ 'గౌతమిపుత్ర శాతకర్ణి' షూటింగ్‌ నిమిత్తం మధ్యప్రదేశ్‌లో ఉన్నారు. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హేమమాలిని, శ్రియ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.


లేటెస్ట్ గా ఎన్టీఆర్ నటించిన 'జనతాగ్యారేజ్' చూసి పొగడ్తల్లో ముంచెత్తిన రాజమౌళి మరోసారి తన దైన శైలిలో మరో చిత్రంపై రివ్యూ రాసేసారు. తాజాగా 'జ్యో అచ్యుతానంద' సినిమా చాలా బాగుందని రాజమౌళి ట్వీట్‌ చేశాడు. దాని గురించి రివ్వ్యూ కూడా రాశాడు.శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని చూసిన రాజమౌళి ట్విట్టర్‌ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. వారాహి చలన చిత్రం, అవసరాల శ్రీనివాస్‌, కల్యాణ్‌ రమణ కాంబినేషన్‌ మరో చక్కటి ఫ్యామిలీ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ 'జ్యో అచ్యుతానంద'ని ఇచ్చిందన్నారు.


చిత్రం చక్కటి వినోదాన్ని పండించిందని, క్లైమాక్స్‌ 10 నిమిషాలు హృదయాలను తాకుతుందని తెలిపారు. నారా రోహిత్‌, నాగశౌర్య అన్నదమ్ములుగా చాలా బావున్నారని, రెజీనాను తొలిసారి తెరపై చూశానని, ఆమె నటన నచ్చిందని పేర్కొన్నారు.


Balayya on Jyo Achyutananda Movie

వెంకట్‌ ఫొటోగ్రఫీ చిత్రానికి ప్లస్‌పాయింటని, ఆర్ట్‌ డైరెక్టర్‌ రామ పనితనం బావుందన్నారు. 'చివరకు మిగిలేది' నవల ప్రస్తావన అందుకు చిన్న ఉదాహరణ అంటూ రాజమౌళి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.


'సినిమా చూస్తున్నంతసేపూ హాయిగా ఉంది. నారా రోహిత్‌, నాగశౌర్య చాలా చక్కగా నటించారు. ఇక, రెజీనా యాక్టింగ్‌ను ఫస్ట్‌టైమ్‌ చూస్తున్నా. అద్భుతంగా నటించింది. నిర్మాత సాయి కొర్రపాటి, డైరెక్టర్‌ అవసరాల శ్రీనివాస్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ కల్యాణ్‌ రమణ కాంబినేషన్‌ అద్భుతం అని మరోసారి ప్రూవ్‌ చేశార'ని రాజమౌళి ప్రశంసించాడు.

English summary
Balakrishna has watched his good friend Sai Korrapati's latest production venture "Jyo Achyutananda". Praising the combination of Varahi, director Srinivas Avasarala and his brother, composer Kalyana Ramana, the actor gave impressive review. Congratulations on yet another hit, Sai Korrapati!!! Jyo Achyutananda
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X