twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగు తెర 'హాట్ పెయిర్'...ఇప్పుడు అసెంబ్లీలోకి

    By Srikanya
    |

    హైదరాబాద్ : సినిమాల్లో అసెంబ్లీ సీన్ ల్లో జీవించిన వారు ఇప్పుడు నిజ జీవితంలోనూ అసెంబ్లీని ఫేస్ చేయనున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వెండి తెరపై హాట్ పెయిర్ గా వెలిగిన బాలకృష్ణ, రోజా ఇద్దరూ తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెడుతున్నారు. బాలకృష్ణ...హిందూపూర్ నియోజక వర్గం నుంచి ఎన్నికైతే, రోజా ..నగరి నియోజక వర్గం నుంచి ఎన్నికయ్యారు.

    అయితే వీరిద్దరూ ఒకే పార్టీనుంచి ఎన్నిక కాకపోవటం విశేషం. బాలకృష్ణ...తెలుగుదేశం నుంచి కాగా, రోజా...వైయస్సార్పీ పార్టీ నుంచి గెలిచారు. వీరిద్దరూ గాండీవి, భైరవ ద్వీపం, బొబ్బిలి సింహం, సుల్తాన్, పెద్దన్నయ్య, శ్రీ కృష్ణ విజయం తదితర చిత్రాల్లో కలిసి నటించారు. వీరి కాంబినేషన్ కు మంచి గుర్తింపు వచ్చింది. బాలకృష్ణ ఇంకా హీరోగా కొనసాగుతూండగా, రోజా మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ, గేమ్ షో జడ్జి గానూ కనిపిస్తున్నారు.

    Balayya and Roja Entering Assembly

    నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ సినిమా సిద్ధమవుతోంది. ఇప్పటికే కథ, దర్శకుడు ఎంపిక పూర్తికాగా ఇప్పుడు హీరోయిన్ కోసం దర్శక,నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. త్రిష లేదా శ్రియలలో ఒకరిని హీరోయిన్ గా ఎంపిక చేస్తారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. తొలుత ఈ పాత్రలో అంజలిని అనుకున్నా తర్వాత నిర్ణయం మారింది. సత్యదేవ దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్నారు. బాలకృష్ణ జన్మదినం సందర్భంగా జూన్‌ 10న సినిమాను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

    గతంలో మణిశర్మ,బాలకృష్ణ కాంబినేషన్ లో నరసింహనాయుడు, సమరసింహా రెడ్డి, లక్ష్మీ నరసింహా వంటి చిత్రాలు వచ్చి మ్యూజికల్ గానూ విజయవంతమయ్యాయి. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ తో ఈ చిత్రం రెడీ అవుతోందని సమాచారం. ''బాలకృష్ణ శైలికి తగ్గ కథ ఇది. కుటుంబ అనుబంధాలతోపాటు అభిమానుల్ని అలరించే అన్ని అంశాలూ ఇందులో ఉంటాయి. సాంకేతిక విలువలకు ప్రాధాన్యమిస్తూ భారీ వ్యయంతో రూపొందించబోతున్నాం. ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వివరాలు త్వరలోనే తెలియజేస్తాము''అని నిర్మాతలు తెలిపారు.

    English summary
    Balayya and Roja are now entering 'Assembly' together. Contesting for the first time as MLA from Hindupur constituency, Roja won from Nagari constituency as YSR Congress MLA after facing defeat for two times earlier.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X