For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  టైం ఫిక్స్ : ఆ రోజు బాలయ్య ఫ్యాన్స్ ని పట్టలేం, అలా ఉంటుంది రచ్చ

  By Srikanya
  |

  హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రెండవ శతాబ్ధానికి చెందిన రాజు గౌతమి పుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రం కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారికో లేటెస్ట్ అప్ డేట్ ఇస్తున్నాం.

  అదేమిటంటే... అభిమానులకు కానుకగా దసరా రోజున ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేయనున్నారు. ఈ చిత్రం రెండవ శతాబ్దపు రాజు గౌతమీపుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా తెరకెక్కతోంది.ఇందులో బాలకృష్ణ తల్లిగా హేమ మాలిని నటిస్తుండగా, శ్రియ విశిష్టి దేవి పాత్రలో బాలకృష్ణకు భార్యగా నటించనుంది. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని 2017 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.

  మరో ప్రక్క మధ్య ప్రదేశ్‌లో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోండగా కొన్ని సన్నివేశాలకు సంబంధించిన ఫోటోలు నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫొటోలు ఇప్పుడు అభిమానులను తెగ అలరిస్తున్నాయి. సోషల్ మీడియాలో వీటిని షేర్ చేస్తున్నారు. ఆ ఫొటోలను మీకు అందిస్తున్నాం.

   చిన్నారిని ఎత్తుకుని శ్రియ, తల్లిగా హేమ మాలిని

  చిన్నారిని ఎత్తుకుని శ్రియ, తల్లిగా హేమ మాలిని

  ఈ చిత్రంలో బాలయ్య శాతకర్ణిగా నటిస్తోండగా ఆయన తల్లి గౌతమిగా హేమమాలిని నటిస్తోంది. ఇక శాతకర్ణి భార్య వాశిష్టదేవిగా శ్రేయశరన్ నటిస్తోంది. తాజాగా విడుదలైన ఫోటోలో శ్రేయ చిన్నారిని ఎత్తుకున్నట్టు కనిపిస్తోండగా ఆమెలో రాజసం ఉట్టిపడుతోంది. ఇక హేమమాలిని చాలా హుందాతనంతో కనిపిస్తోంది.

   జేజేలు కొడుతూ బాలయ్యకు..

  జేజేలు కొడుతూ బాలయ్యకు..

  రాజు గెటప్‌లో ఉన్న బాలయ్యకు ఆ రాజ్య ప్రజలు జేజేలు పలుకుతున్నట్టుగా ఉంది. బాలయ్య హందాగా ఈ ఫొటోలో నడుచుకుంటూ రావటం మనం గమనించవచ్చు. ఓ ప్రక్కన వేద మంత్రాలు చదివే బ్రాహ్మణులు, మరో ప్రక్క జనం నిలబడి ఉండగా వారి మధ్య నుంచి బాలయ్య నడుచుకుంటూ రావటం సినిమాలోని ఓ కీలకమైన సీన్ కు చెందినదే అయ్యి ఉంటుంది.

  శ్రియ, హేమమాలిని ని ఇక్కడ

  శ్రియ, హేమమాలిని ని ఇక్కడ

  ఈ ఫొటోలో బిడ్డను ఎత్తుకున్న శ్రియను స్పష్టంగా చూడవచ్చు. ఆమె ఈ చిత్రంలో వాశిష్టదేవిగా నటిస్తోంది. ఆమె శాతకర్ణి భార్య. రాజమాతైన అత్తగారు ఓ ప్రక్కన నిలబడి ఉండగా, మరోప్రక్క భార్య నిలబడి ఇంతకీ ఏం చూస్తున్నారో మరి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫోటోలు చూసిన అభిమానులు బాలయ్య సినిమాపై మరిన్ని అంచనాలు పెంచుకున్నారు.

  అదరకొట్టిందికదూ..

  అదరకొట్టిందికదూ..

  ఈ సినిమాలో హీరోయిన్ అయిన శ్రియ పుట్టినరోజును పురస్కరించుకొని దర్శకుడు క్రిష్ శ్రియ సినిమాలో ఎలా ఉంటారో పరిచయం చేస్తూ ఫస్ట్‌లుక్ విడుదల చేశారు.

  గౌతమి పుత్ర శాతకర్ణిలో శ్రియ శాతకర్ణి భార్య అయిన వశిష్టి దేవిగా కనిపించనున్నారు. ఈ లుక్‌లో శ్రియ వశిష్టి దేవి పాత్రకు వన్నె తెచ్చే రీతిలో కనిపిస్తూ మెప్పిస్తున్నారు.

   ఈ ఒక్కటి చాలు...ఈ సినిమాకు

  ఈ ఒక్కటి చాలు...ఈ సినిమాకు

  బాలయ్యం ఎంతో ప్రతిష్టాత్మకంగా బావించి చేస్తున్న ఈ వందో చిత్రం చారిత్రికం కావటంతో అందరి దృష్టీ దానిపైనే ఉంది. క్రిష్ ఈ విషయాన్ని అర్దం చేసుకుని అత్యంత జాగ్రత్తగా ప్రతీ విషయం అద్బుతంగా ఉండేలా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ 'గౌతమిపుత్ర...' ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ చాలా బాగుందంటూ అన్ని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చి యూనిట్ ని ఆనందపరిచింది.

  స్టార్ హీరో అనే విషయం వదిలేసి

  స్టార్ హీరో అనే విషయం వదిలేసి

  అయితే దీనికి భిన్నంగా బాలకృష్ణ 'గౌతమీపుత్ర శాతకర్ణి' షూటింగ్ బ్రేక్ లో తాను ఒక స్టార్ హీరోని అన్న విషయం మరిచిపోయి అక్కడ చేస్తున్న సందడి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. యూనిట్ తోపాటే కలిసి భోజనం చేయడమే కాకుండా తనకు ఎటువంటి స్పెషల్ అరేంజ్ మెంట్లు వద్దు అంటూ ఆఖరికి భోజనం దగ్గర కూడా అందరి మధ్య కలిసి తిరుగుతూ భోజనం చేయడమే కాకుండా తన భోజనాన్ని తానే వడ్డించు కుంటూ సామాన్య యూనిట్ సభ్యులతో పాటు క్యూలో నిలుచుని స్వయంగా వడ్డించుకొని తింటూ అందరికీ షాక్ ఇస్తున్నాడట.

   యుద్దానికే భారి ఖర్చు

  యుద్దానికే భారి ఖర్చు

  ఈ చిత్రంలో కేవలం యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ కోసం రూ. 8 కోట్లు వ్యయం చేసారని సమాచారం. అప్పట్లో ఇక్కడి శాత కర్ణి రాజరికం చేసిన టైంలో కోటలూ గట్రా ఎలా ఉండేవో. మొరాకో దేశంలో కొన్ని ప్రాంతాలు అలాగే ఉన్నాయట.. అందుకే సెట్‌ వేయకుండా యాక్షన్‌ సన్నివేశాలను అక్కడ చిత్రీకరించి .. వాటికి విజువల్‌ ఎఫెక్ట్స్‌ టచప్‌ చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

   ఓ రేంజిలో జూనియర్ ఆర్టిస్ట్ లు

  ఓ రేంజిలో జూనియర్ ఆర్టిస్ట్ లు

  ఈ చిత్రం ప్రొడ్యూసర్ రాజీవ్ రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్ భూపతి ముందే ఆ దేశానికి చేరుకున్నారని, వార్ సీన్ కోసం సుమారు 800 మంది లోకల్ జూనియర్ ఆర్టిస్టులను ఎంపిక చేసి షూటింగ్ ని పూర్తి చేసారని అంటున్నారు. తెరమీద ఆ సీన్స్ ఓ రేంజిలో మనకు కనివిందు చేస్తాయని చెప్తున్నారు. ఈ సీన్స్ సినిమాని ఎక్కడికో తీసుకువెళ్తాయని అంటున్నారు.

   అక్కడవాళ్లు కూడా మనోళ్లు లాగే

  అక్కడవాళ్లు కూడా మనోళ్లు లాగే

  మొరాకోలో చాలామంది భారతీయుల తరహాలోనే ఉంటారని, అందువల్ల ఈ సెలెక్షన్ పెద్ద ప్రాబ్లం కాలేదని యూనిట్ వర్గాలు తెలిపాయి. సినిమాలో ఆ సీన్స్ చూసేటప్పుడు అసలు తేడా కనిపెట్టలేరని చెప్తున్నారు. అందుకే అంత ధైర్యంగా క్రిష్ అక్కడ షూటింగ్ పెట్టుకుని సినిమాని పూర్తి చేస్తున్నట్లు చెప్తున్నాడు.

   యుద్దం సీన్స్ తీసేటప్పుడు

  యుద్దం సీన్స్ తీసేటప్పుడు

  మొరాకో చేరుకుని షూటింగ్ మొదలుపెట్టిన బాలయ్య ..దాదాపు నెల నుంచి 40 రోజులపాటు అక్కడే ఉండి పూర్తి చేసుకుని వచ్చారు. అక్కడే దాదాపు యాక్షన్‌ సన్నివేశాలు.. అలాగే కొన్ని డైలాగ్‌ బేస్డ్‌ సీన్లు కూడ చిత్రీకరించారని తెలుస్తోంది. వారు వేసుకున్న యాక్షన్ ప్లాన్ ప్రకారం చాలా స్పీడుగా సీన్స్ లాగిస్తున్నారు.

   ఓ పెళ్లి సంబరంలా

  ఓ పెళ్లి సంబరంలా

  మొరాకో లో మన తెలుగు వంటలు దొరకవు కాబట్టి ఇక్కడ నుండి మొరాకోకు ప్రత్యేకంగా వంట వాళ్ళను కూడ తీసుకు వెళ్ళి ఒక పెళ్ళి సంబరంలా 'గౌతమీపుత్ర శాతకర్ణి' షూటింగ్ జరుగుతోందని టాక్. ప్రస్తుతం వెబ్ మీడియాలో బాలయ్య ఈ షూటింగ్ స్పాట్ లో స్వయంగా వడ్డించుకుని తింటున్న ఫోటోలు బాలకృష్ణ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి..

   ప్రస్తుతం మద్యప్రదేశ్ లో కంటిన్యూగా

  ప్రస్తుతం మద్యప్రదేశ్ లో కంటిన్యూగా

  ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్లో ముఖ్య తారాగణం బాలకృష్ణ, హేమ మాలిని, శ్రియ శరన్ లపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది. అలాగే కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లను కూడా ఇక్కడే చిత్రీకరిస్తున్నారు. బాలయ్య 100వ సినిమా కావడంతో దీనిపై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.దర్శకుడు క్రిష్ కూడా ఈ అంచనాలను అందుకునేలా చిత్రాన్ని గొప్పగా రూపొందిస్తున్నారు.

  English summary
  Teaser of Nandamuri Balakrishna starrer 'Gautamiputra Satakarni'will be released at Dussera festival time.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X