»   » బాలయ్య సంస్కారం: మెగాస్టార్ కి పాదాభివందనం చేసాడు ....

బాలయ్య సంస్కారం: మెగాస్టార్ కి పాదాభివందనం చేసాడు ....

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలకృష్ణ నలభయ్యేళ్ల ప్రయాణం . ఒక స్టార్ కథానాయకుడిగా గొప్ప విజయాలెన్నో సొంతం చేసుకొన్నారు. కానీ ఆ గర్వం మాత్రం తలకెక్కించుకోలేదు. ఇప్పటికీ ఆయన జనం మధ్య షూటింగ్ చేయడానికే ఇష్టపడుతుంటాడు. సెట్లోనూ అందరితో కలివిడిగా మెలుగుతుంటారు. తనకో రూలు ఇతరా టీమ్ కి ఓ రూలంటూ వుండకూడదు అని చెబుతుంటారు. అంత సింప్లిసిటీ ఆయనది. తాజాగా ఆ విషయాన్ని మరోసారి చాటుకున్నారు. తండ్రి నటననే కాదు సంస్కరాన్నీ వారసత్వంగా తీసుకున్నారనే సంగతి తెలిసిందే.

Balayya touched the feet of Megastar Amitab bacchan

తెలుగు తెరపై బాలయ్యకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. సినిమాలో ప్రత్యర్ధులపై ఏస్థాయిలో మాటలతోనూ చేతలతోనూ విరుచుకుపడతారో తెర బయట అంత సౌమ్యంగా కనిపిస్తారు బాలయ్య. అంతే కాదు తాను నటించిన ఏ సినిమా షూటింగ్ లోనూ అనవసరంగా ఏ నిర్మాతనీ, దర్శకున్నీ ఇబ్బంది పెట్టినట్టు ఇప్పటివరకూ లేదు.

తన 110 వ స్నిమా షూటింగ్ మొరాకోలో జరుగుతున్నప్పుడు కూడా బాలయ్య వ్యవహరించిన తీరుకి అంతా ముగ్దులయ్యారు. మొరాకోలో ప్రస్తుతం బాలకృష్ణ వందో చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ యూనిట్ తోపాటే కలిసి ఉన్న బాలకృష్ణ. తనకోసం స్పెషల్ అరేంజ్ మెంట్లు అంటూ ఏవీ వద్దంన్నడట. ఆఖరికి భోజనం కూడా అందరిమధ్యే కలిసి చేయటమే కాదు తన భోజనాన్ని తానే వడ్డించుకుంటు యూనిట్ తోపాటు క్యూలో నిలుచుని ఆహార పదార్థాలు స్వయంగా వడ్డించుకొని తింటు తానెంత సింపుల్గా ఉండగలడో మరొసారి అందరికీ అర్థమయ్యే చేసాడూ. తెలుగు సినిమా సెట్లో అలాంటి వాతావరణాన్ని ఎప్పుడో కానీ చూడం మరి ఇంత పెద్ద హీరో అలా ఉండటం మామూలేం కాదు...

Balayya touched the feet of Megastar Amitab bacchan

అయితే తాజాగా నందమూరి బాలకృష్ణ సంస్కారానికి మరో ఉదాహరణగా తాజాగా వెలుగులోకి వచ్చింది ఒక ఫోటో. ఈ ఫోటో ప్రస్తుతం ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తోంది.బిగ్ బీ అమితాబ్ ప్రస్తుతం తన తాజా చిత్రం "సర్కార్ - 3" షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ముంబై ఫిలిం సిటీలో ఈ బాలీవుడ్ మెగాస్టార్ ప్రధాన పాత్ర పోషిస్తున్న రామ్ గోపాల్ వర్మ చిత్రం "సర్కార్-3" షూటింగ్ జరుగుతోంది.

ఈ షూటింగ్ సమయంలో నందమూరి బాలకృష్ణ "సర్కార్ - 3" సెట్లో సందడి చేశారు. అక్కడికి వెళ్లి అందరినీ తనదైన ఆప్యాయతతో పలకరించిన బాలయ్య.. అమితాబ్ బచ్చన్ కు మాత్రం వినమ్రంగా ఒంగి పాదాభివందనం చేశారు. లెజెండరీ నందమూరి తారకరామారావు కుమారుడు - ఎమ్మెల్యే - స్టార్ హీరో అయిన బాలకృష్ణ ఇలా తనకు పాదాభివందనం చేయడం పట్ల అమితాబ్ ఉద్వేగానికి లోనయ్యారు. అనంతరం బాలయ్యతో సరదాగా ముచ్చటించారు.

Balayya touched the feet of Megastar Amitab bacchan

అయితే ఇది కేవలం మర్యాదపూర్వకంగా - అమితాబ్ పై తనకున్న అభిమానం కొద్దీ బాలయ్య కలిశారనే చెబుతుండగా... ఈ కలయికపై కూడా చిన్న చిన్న గాసిప్స్ వచ్చేస్తున్నాయి. బాలకృష్ణ 100వ సినిమా గౌతమి పుత్రశాతకర్ణి తర్వాత కృష్ణవంశీ డైరెక్షన్లో రైతు సినిమా చేయబోతున్న బాలయ్య... ఆ సినిమా కోసం అమితాబ్ ను ఒక పాత్ర చేయమని ఒప్పించడానికి వెళ్లారని గాసిప్స్ వస్తున్నాయి. అయితే వీటిపై అధికారికంగా ఎవరూ స్పందించలేదు!!

English summary
The other day, Balayya met Amitabh Bachchan on the sets of 'Sarkar 3' in Mumbai. He even touched the feet of Megastar as a mark of respect towards him.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu