»   » ‘బలుపు’ ఆడియో పంక్షన్ హైలెట్స్ (ఫోటోలు)

‘బలుపు’ ఆడియో పంక్షన్ హైలెట్స్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రవితేజ, శృతి హాసన్, అంజలి హీరో హీరోయిన్లుగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బలుపు'. పివిపి సినిమా బేనర్‌పై ప్రసాద్ వి.పొట్లూరి నిర్మిస్తున్న ఈచిత్రం ఆడియో విడుదల శనివారం సాయింత్రం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.

జూన్ చివరి వారంలో చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. అంజలి సెకండ్ హీరోయిన్ గా నటిస్తుండగా, లక్ష్మి రాయ్ ప్రత్యేక గీతంలో కనిపించనుంది.

పెరల్ వి.పొట్లూరి సమర్పణలో, పివీపీ సినిమా పతాకంపై పరమ్ వి.పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ స్వరాలందించిన ఈ చిత్రం ఆడియో మంచి విజయం సాధిస్తుందని గెస్ట్ లుగా వచ్చిన వారు అభిలషించారు.

ఈ చిత్రం ఆడియో హైలెట్స్ ..స్లైడ్ షోలో...

ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ శనివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.

ఈ ఆడియో పంక్షన్ ను ఘనంగా నిర్వహించటంతో తమ స్టామినా ఏమిటో పివిపి లు చూపించారు.

రవితేజ ఫ్యాన్స్ ఈ పంక్షన్ కి హాజరయ్యి...ఎంజాయ్ చేసారు.

దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ పంక్షన్ లో స్టార్ ఆఫ్ ఎట్రాక్షన్ నిలిచారు.

ఆట పాటలతో స్టేజ్ హోరిత్తింది.

సుమ,శ్రీనివాస రెడ్డి యాంకరింగ్ చేసారు.

బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు ప్రత్యేక అతిధులుగా వచ్చారు.

తమన్ ,షఫీ ఇలా రిలాక్స్ అవుతూ..

శ్రుతి హాసన్ ఇలా హాట్ గా తయారై వచ్చింది..

దాసరి,రవితేజ, శ్రుతి హాసన్

ఈ చిత్రం ప్రచార చిత్రాలను దాసరి ఆవిష్కరించారు. ‘నాకంటే బలుపు ఉన్నవాళ్లు పరిశ్రమలో ఎవరూ లేరు. వాపుకీ బలుపుకీ చాలా తేడా ఉంటుంది. కానీ పరిశ్రమలో చాలామంది వాపే బలుపు అనుకుంటున్నారు'' అని దాసరి నారాయణరావు అన్నారు.

బ్రహ్మానందం మాట్లాడుతూ..సినిమా పూర్తి వినోదాత్మకంగా సాగుతుందని అన్నారు.

రవితేజ బంధువు రఘురామరాజు ఆడియోసీడీని ఆవిష్కరించి తొలి ప్రతిని రవితేజకి అందించారు.

తమన్ చాలా ఉత్సాహంగా ఎజాయ్ చేస్తున్నారు.

‘‘సినిమా బాగా వచ్చింది. చాలామంది నాతో పాడించాలనుకున్నారు. కానీ కుదర్లేదు. తమన్ పాడించగలిగాడు. ఇక మీద కూడా మేం ఇలానే కంటిన్యూ అవుతాం. ప్రసాద్ వి.పొట్లూరి నాకు మంచి మిత్రుడు. నా సినిమా ద్వారా వారు తెలుగులోకి ఎంటరవ్వడం ఆనందంగా ఉంది'' అని రవితేజ చెప్పారు.

రవితేజ తొలిసారిగా స్టేజ్ పై డాన్స్ చేసారు.

శ్రుతిహాసన్ ఇలా డాన్స్ చేసి తన ఫ్యాన్స్ కు పండుగ చేసింది

సిడీ ఆవిష్కరణ...

ఆడియో ఆవిష్కరణ ఫోజ్...

దర్శకుడు మాట్లాడుతూ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పారు.

English summary
The audio of Ravi Teja’s upcoming film Balupu was launched a little while ago in Hyderabad. Directed by Gopichand Malineni, the film also has Shruti Haasan and Anjali in lead roles. Potluri V Prasad is producing the film under PVP Cinemas banner and it’s his first direct Telugu film as a producer in Telugu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu