»   » రవితేజ ‘బలుపు’ 50 రోజులు పూర్తి

రవితేజ ‘బలుపు’ 50 రోజులు పూర్తి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రవితేజ, శృతి హాసన్, అంజలి హీరో హీరోయిన్లుగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో పివిపి సినిమా బేనర్‌పై రూపొందిన 'బలుపు' చిత్రం ఈ రోజుతో 50 రోజులు పూర్తి చేసుకుంది. జూన్ 28న విడుదలైన ఈ మూవీ విడుదల రోజే పాజిటివ్ టాక్ చేసుకుకుంది. దీంతో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది.

రవితేజ పవర్ ఫుల్ యాక్షన్‌కు తోడు శృతి హాసన్ అందచందాలు, ఆకట్టుకునే స్క్రీన్ ప్లే, స్టోరీలో ట్విస్ట్ వెరస నినిమాను ప్రేక్షక రంజకంగా మార్చాయి. దర్శకుడు గోపీచంద్ మలినేని తనదైన మార్కు దర్శకత్వంలో సినిమాను పూర్తి వినోదాత్మకంగా రూపొందించారు.

రవితేజ అభిమానులు కూడా చాలా కాలం తర్వాత తాము కోరుకుంటున్నట్లుగా రవితేజను తెరపై చూసి హ్యాపీగా ఫీలయ్యారు. గతంలో వరుస పరాజయాలతో సతమతమయ్యాడురవితేజ. ఈ నేపథ్యంలో కాస్త భయపడుతూనే సినిమాను కొన్న బయ్యర్లు సినిమా సాధించిన ఫలితాలతో ఆనందంగా ఉన్నారు.

ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, రావు రమేష్, అలీ, అశుతోష్ రాణా, అడవి శేషు, సుప్రీత్, ఆదిత్య మీనన్, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, శేఖర్, అజయ్, షఫీ, శ్రీనివాస్ రెడ్డి, సన, రాజశ్రీ నాయర్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. ఈచిత్రానికి కథ, మాటలు: కోన వెంకట్, కె. ఎస్. రవీంద్ర, పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, భాస్కర భట్ల, ఫైట్స్: స్టన్ శివ, కొరియోగ్రఫీ: రాజు సుందరం, బృందం, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్: గౌతం రాజు, సినిమాటోగ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: థమన్, సమర్పణ : ప్రసాద్ వి. పొట్లూరి, నిర్మాత: పరమ్ వి. పొట్లూరి, దర్శకత్వం : గోపీచంద్ మలినేని.

English summary
Mass Maharaj Ravi Teja's mass entertainer 'balupu' was released on 28th June and generated super hit talk on day one of its release itself. The movie is completing its 50 days run on 16th August.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu