»   » రవితేజ ‘బలుపు’ సక్సెస్ మీట్ (ఫోటోలతో...)

రవితేజ ‘బలుపు’ సక్సెస్ మీట్ (ఫోటోలతో...)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మాస్ మహారాజ్ రవితేజ చాలా కాలం తర్వాత 'బలుపు' చిత్రంతో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. 'బలుపు' చిత్రంతో తెలుగు సినీ నిర్మాణ రంగంలో తొలి అడుగు వేసిన పివిపి సినిమా సంస్థకు మొదటి ప్రయత్నంలోనే విజయం దక్కడం మరో విశేషం. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో 'బలుపు' సక్సెస్ మీట్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో హీరో హీరోయిన్లు రవితేజ, అంజలి, దర్శకుడు గోపీచంద్ మలినేని, నిర్మాత నిర్మాత పీవీపీ, తమన్, బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా దర్శకుడు గోపీచంద్ మాట్లడుతూ...'సినిమా కథ అనుకున్నప్పుడే సక్సెస్ అవుతుందనే నమ్మకం ఏర్పడింది. ఒళ్లు దగ్గరపెట్టుకుని పని చేసాం. నాతో పాటు చాలా మంది కొత్త దర్శకులకు రవితేజ లైఫ్ ఇచ్చారు. అంతా కష్టపడి పని చేయడం వల్లనే హిట్టయింది' అన్నారు.

రవితేజ మాట్లాడుతూ...'చాలా మంచి హిట్ ఇచ్చారు. ఎంతో సంతోషంగా ఉంది. పివీపిగారి తొలి సినిమా హిట్టయినందుకు హ్యాపీ. బాబీ, కోన వెంకట్, వెలిగొండ శ్రీనివాస్, చక్రి అందరికీ థాంక్స్. గోపీచంద్ మరిన్ని హిట్ సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను' అన్నారు. మిగతా వివరాలు స్లైడ్ షోలో...

హీరోయిన్ అంజలి మాట్లాడుతూ సెట్లో ఎప్పుడూ అంతా చాలా ఎంజాయ్ చేస్తూ పని చేసాం, సినిమా సక్సెస్ అయినందుకు చాలా సతోషంగా ఉంది అన్నారు.

రవితేజ, నేను 20 ఏళ్లకు ముందు విజయవాడ నుంచి బయల్దేరాం. ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాం. తొలి సినిమానే రవితేజతో చేయడం ఆనందంగా ఉంది. అందరూ కష్టపడి పని చేసారు అని నిర్మాత పివిపి అన్నారు.

సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ...రవితేజకు హిట్ వస్తే ఇండస్ట్రీ ఎనర్జిటిక్‌గా ఉంటుంది. గోపీచంద్‌తో పని చేసిన రెండో సినిమా ఇది. టీం మొత్తానికి కంగ్రాట్స్' అన్నారు.

ఇక హీరో రవితేజ కెరీర్‌కు ‘బలుపు' చిత్రం బూస్ట్ ఇచ్చిందని చెప్పుచ్చు. వరుసు ప్లాపులతో ప్రేక్షకులను నిరాశపరుస్తూ వచ్చిన రవితేజ ‘బలుపు'తో వారి మనసు గెలిచాడని చెప్పొచ్చు. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ చిత్రంతో మరో మెట్టు పైకెక్కారు. గోపీచంద్ డైరెక్షన్ స్టైల్ బాగుందని, అతనికి మంచి భవిష్యత్ ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

ప్రకాష్‌రాజ్, నాజర్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, రావూ రమేష్, అలీ, అశుతోష్ రాణా, అడవి శేషు, సుప్రీత్, ఆదిత్య మీనన్, రఘుబాబు, జైప్రకాష్‌రెడ్డి, శేఖర్, అజయ్, షఫి, శ్రీనివాసరెడ్డి, సన, రాజశ్రీ నాయర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు:కోన వెంకట్, పాటలు:సిరివెనె్నల, భాస్కరభట్ల, ఎడిటింగ్:గౌతంరాజు, కెమెరా:జయనన్ విన్సెంట్, సంగీతం:తమన్.ఎస్.ఎస్. నిర్మాత:పరమ్ వి.పొట్లూరి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:గోపీచంద్ మలినేని.

English summary
Balupu Success Meet held at Radisson BLU Hotel in Hyderabad. Ravi Teja, Anajli, Director Gopichand Malineni, Producer Prasad Vara Potluri, Music Director S.Thaman, Brahmaji, Srinivasa Reddy, Lyricist Bhaskarabhatla, Editor Gautham Raju, Dil Raju, BA Raju graced the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu