షారుక్ పై దేశద్రోహం కేసు.. రయీస్ పై నిషేధం..
పాకిస్థాన్ నటి మహిరాఖాన్ నటించిన చిత్రాన్ని రాష్ట్రంలో నిషేధించాలని శుక్రవారం పలు థియేటర్ల సేన, వీహెచ్ పీ కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు.
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ నటించిన తాజా చిత్రం రయీస్ కు విశ్వహిందూ పరిషత్, శివసేన కార్యకర్తల నుంచి నిరసన సెగ తగిలింది.
పాకిస్థాన్ నటి మహిరాఖాన్ నటించిన చిత్రాన్ని రాష్ట్రంలో నిషేధించాలని శుక్రవారం పలు థియేటర్ల సేన, వీహెచ్ పీ కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వ్యవహారం షారుక్ కు కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. రయీస్ చిత్రంలో పాకిస్థాన్ సంతతికి చెందిన నటి, వీజే మహీరాఖాన్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.

గుజరాత్ కు చెందిన మాఫియా డాన్ అబ్దుల్ లతీఫ్ జీవిథ కథను తెరకెక్కించినట్టు ఆరోపణలు వెల్లువెత్తున్ననేపథ్యంలో ఈ ఆందోళనలు వివాదాస్పదంగా మారాయి. అంతేకాకుండా రయీస్ చిత్రంలో నటించిన షారుక్ పై దేశద్రోహం కేసు పెట్టాలని, ఈ చిత్రంలో హింస మితీమిరి ఉందనే కార్యకర్తలు ఆరోపించారు. గుజరాత్ లోని వల్సాద్ పట్టణంలో భారీగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.


Click it and Unblock the Notifications











