»   »  అల్లరి నరేష్ ‘బందిపోటు’ మొదలైంది (ఫోటోలు)

అల్లరి నరేష్ ‘బందిపోటు’ మొదలైంది (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లరి నరేష్, ఇషా జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఇ.వి.వి. సినిమా పతాకంపై ఆర్యన్ రాజేష్ నిర్మిస్తున్న చిత్రం 'బందిపోటు'. ఈచిత్రం ప్రారంభోత్సవం తాజాగా హైదరాబాద్ లో జరిగింది. తొలి సన్నివేశానికి డి.రామానాయుడు క్లాప్‌నివ్వగా, సురేష్‌బాబు కెమెరా స్విచ్చాన్ చేశారు. తనికెళ్ల భరణి గౌరవ దర్శకత్వం వహించారు.

అనంతం ఏర్పాటుచేసిన సమావేశంలో ఇ.వి.వి. సంస్థలో పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉందని, ఏ సినిమాకు ఈ చిత్రం వ్యంగాత్మక రూపకం కాదని, కేవలం అందరిని కామెడీతో అలరించాలన్న కోరికతో చేస్తున్న చిత్రమని చిత్ర దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెలిపారు.

మరిన్ని వివరాలు, ఫోటోలు స్లైడ్ షోలో...

అల్లరి నరేష్ మాట్లాడుతూ..

అల్లరి నరేష్ మాట్లాడుతూ..


దొంగల్ని దోచుకునే బందిపోటు కథను ఎంతో వినోదంగా రూపొందిస్తున్నామని, ఓ మంచి కథ దొరకడంతో మోహన్‌కృష్ణతో ఈ చిత్రం చేస్తున్నామని, ప్రయోగాత్మక చిత్రం మాత్రం కాదని, నవ్వించడమే ప్రత్యేక ప్రయోగమని అల్లరి నరేష్ తెలిపారు.

రాజేష్

రాజేష్

రాజేష్ మాట్లాడుతూనాన్న పేరు నిలబెట్టేలా ఈ సంస్థలో చిత్రాలను నిర్మిస్తాం, తామనుకున్న స్థాయిలో కథ దొరకడంతో ఈ సినిమా ప్రారంభించామని నిర్మాత రాజేష్ తెలిపారు.

రెగ్యులూర్ షూటింగ్

రెగ్యులూర్ షూటింగ్


జూలై మొదటివారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, నవంబర్‌లో సినిమా విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

నటీనటులు

నటీనటులు


పోసాని కృష్ణమురళి, చంద్రమోహన్, తనికెళ్ల భరణి, రావూ రమేష్, రఘుబాబు, శ్రీనివాస్ అవసరాల, పృధ్వీ తదితరులు నటిస్తున్నారు.

సాంకేతిక విభాగం

సాంకేతిక విభాగం


ఈ చిత్రానికి సంగీతం: కళ్యాణ్ కోడూరు, కెమెరా: పి.జి.విందా, ఎడిటింగ్:శ్రవణ్, నిర్మాత: ఆర్యన్ రాజేష్, దర్శకత్వం: ఇంద్రగంటి మోహనకృష్ణ.

English summary
Bandipotu movie launch event held at Hyderabad. Actor Allari Naresh, Actress Eesha, Mohan Krishna Indraganti, D.Ramanaidu, Tanikella Bharani, Chalapathi Rao, Gemini Kiran, Aryan Rajesh, Kalyani Koduri, D.Suresh Babu, PG Vinda, KL Damodar Prasad, Posani Krishna Murali graced the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu