»   » అల్లరి ‘బందిపోటు’: 15 నిమిషాలు ట్రిమ్ చేసారు

అల్లరి ‘బందిపోటు’: 15 నిమిషాలు ట్రిమ్ చేసారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లరి నరేష్ ‘బందిపోటు' చిత్రం నిన్న విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. సినిమా ఆశించిన స్థాయిలో లేక పోవడంతో పాటు సాగదీసినట్లు ఉందనే టాక్ రావడంతో వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు దర్శక నిర్మాతలు. కొన్ని అనవసర సీన్లను తీసేయాలని నిర్ణయించారు. ఒరిజినల్ రన్ టైం నుండి మొత్తం 15 నిమిషాలు కోత పెట్టినట్లు సమాచారం.

Bandipotu

సాధారణంగా అల్లరి నరేష్ సినిమాలు అంటేనే...ఫుల్ లెంగ్త్ కామెడీ ఆశించి వెళతారు ప్రేక్షకులు. అయితే ‘బందిపోటు' మాత్రం అల్లరి నరేష్ గత చిత్రాలకు భిన్నంగా కామెడీ తగ్గించి రివేంజి స్టోరీతో ప్లాన్ చేసారు. ప్రేక్షకులు ఊహించిన స్థాయిలో సినిమా లేక పోవడంతో తొలిరోజే బాక్సాఫీసు వద్ద దెబ్బపడింది.

అల్లరి నరేష్, ఈషా హీరో హీరోయిన్లుగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నరేష్ సోదరుడు రాజేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సెన్సార్ బోర్డు నుండి 'యు/ఎ' సర్టిఫికేట్ పొందిన ఈ చిత్రం ఈ ఫిబ్రవరి 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది. అల్లరి నరేష్ తన సొంత బేనర్లో చేసిన తొలి చిత్రం ఇది.

అనవసర సీన్లను ట్రిమ్ చేసిన తర్వాత బాక్సాఫీసు వద్ద సినిమా పరిస్థితి మెరుగు పడుతుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. మినిమం గ్యారంటీగా పేరున్ననరేష్ కు ఈ సినిమా ఎలాంటి పేరు తెస్తుందో ఓ రెండు వారాలు గడిస్తేగానీ చెప్పలేం...

English summary
Makers of ‘Bandipotu’ have decided to trim 15 minutes of the film from the original runtime.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu