»   » ట్రైలర్ కే ట్రైలర్ వదిలితే ఎలా బాసూ?

ట్రైలర్ కే ట్రైలర్ వదిలితే ఎలా బాసూ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా ఎలా ఉండబోతోందో ముందుగా కొద్ది రుచి చూపించేది ట్రైలర్. ఆ ట్రైలర్ కే ట్రైలర్ వదలితే ఎలా ఉంటుంది అంటే బండ్ల గణేష్ మాటల్లా ఉంటుంది. ఇప్పుడే ట్రైలర్ చూసాను...అదిరిపోయింది...ఫెంటాస్టిక్ అంటూ బండ్ల గణేష్ తన తాజా చిత్రం గోవిందుడు అందరి వాడేలే గురించి ట్వీట్ చేసారు. ఆయన ఈ చిత్రం ఫస్ట్ లుక్ ట్రైలర్ చూసానని, రంగులు,హంగులతో పండుగ చేసుకునేలా ఉందని అంటున్నారు. అయితే ట్రైలర్ చూపించి, తర్వాత ఎలా ఉందో రివ్యూ చెప్తే బాగుండేది కానీ ఇలా ఊరిస్తూ...ట్రైలర్ కే ట్రైలర్ వదలటం ఏంటి అంటున్నారు అభిమానులు.

బండ్ల గణేష్ ట్వీట్ చేస్తూ..." ఇప్పుడే గోవిందుడు అందరి వాడేలా ట్రైలర్ చూసాను. సూపర్బ్... మా గోవిందుడు ఇన్ని రంగుల మధ్య అన్ని హంగులతో చూస్తూంటే దసరా కే దసరా పండుగ " అన్నారు. ఈ ట్రైలర్ దసరా కి విడుదల చేయటానికి ముస్తాబు చేస్తున్నారన్నమాట. రామ్‌చరణ్‌, కాజల్‌ జంటగా నటిస్తున్న చిత్రం 'గోవిందుడు అందరివాడేలే'. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్నారు.

Bandla Ganesh about GAV Trailer

బండ్ల గణేష్ మాట్లాడుతూ... ''గోవిందుడు అందరివాడేలే' విషయంలో ఇటీవల అనేక వదంతులు వినవస్తున్నాయి. ఇది నాకు ఎంతో ప్రతిష్ఠాత్మకమైన సినిమా. కుటుంబ విలువలతో తెరకెక్కుతున్న అచ్చ తెలుగు చిత్రం. పది తరాల వారు గుర్తుంచుకునేలా ఉంటుంది. అందుకే ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగేస్తున్నాం. ఈ క్రమంలో సినిమాలో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. అందులో భాగంగానే రామ్‌చరణ్‌ తాత పాత్ర పోషించిన రాజ్‌కిరణ్‌ను మార్చాల్సి వచ్చింది '' అన్నారు.

అలాగే రాజ్ కిరణ్ తమిళ నటుడు కావడంతో నేటివిటీ సమస్య రాకుండా ఆయన స్థానంలో ప్రకాష్‌రాజ్‌ను ఎంపిక చేసుకున్నాం. దీని కోసం రాజ్‌కిరణ్‌గారికి క్షమాపణలు చెప్తున్నాను. ఇటీవల రామ్‌చరణ్‌ జ్వరంతో బాధపడటం, మండుటెండల్లో కళాకారుల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకపోవడం.. వంటి కారణాలతో కొద్ది రోజులు చిత్రీకరణ నిలిపేశాం. ఇప్పుడు మళ్లీ చిత్రీకరణ మొదలైంది.ఈ నెల 31 వరకు హైదరాబాద్‌లోనే చిత్రీకరణ ఉంటుంది '' అన్నారు.

ఇక ఆగస్టు 1-15 మధ్య లండన్‌లో చిత్రీకరణ జరు పుతాం. దీంతో షూటింగ్‌ పూర్తవుతుంది. అక్టోబర్‌ 1న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యాం'' అన్నారు. శ్రీకాంత్, కమిలినీ ముఖర్జీ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటినటులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, నిర్మాత: బండ్ల గణేష్, సమర్పణ: శివబాబు గండ్ల, దర్శకత్వం: కృష్ణవంశీ.

English summary
Bandla Ganesh tweeted: "Just watched the trailer of G A V - Superrrrrrb! Can't wait for the fans to see it. Maa Govindudini inni rangula madhya anni hangulatho choosthuntey Dussehra ke Dussehra pandaga"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu