For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అలాంటి సంఘటనతో ఇండస్ట్రీలో ఉండకూడదనుకున్నా.. సినిమా కష్టాలను చెప్పిన బండ్లన్న

  |

  టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను మొదలుపెట్టిన బండ్ల గణేష్.. బడా ప్రొడ్యూసర్ స్థాయికి ఎదిగాడు. వరుసగా స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్‌ను తీసి అందర్నీ మెప్పించాడు. అయితే మధ్యలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి చేతులు కాల్చుకున్నాడు. అయితే ప్రస్తుతం తన పూర్తి దృష్టిని సినిమాలపైనే కేంద్రీకరించినట్టు చెప్పుకొచ్చాడు. తాజాగా బండ్ల గణేష్ అలీతో సరదాగా షోలో పాల్గొన్నాడు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎదురైన అనుభవాల గురించి చెప్పుకొచ్చాడు.

  ఇంటర్ ఫెయిల్..

  ఇంటర్ ఫెయిల్..

  చిన్నతనం నుంచి చదువు అంతగా ఎక్కలేదు. పదోతరగతి ఎలాగోలా పాస్ అయ్యాక.. నన్ను ఇంటర్‌లో జాయిన్ చేశారు.కానీ ఏనాడూ కాలేజ్‌కి వెళ్లలేదు. కాలేజ్ అని చెప్పి దీపక్ థియేటర్లో సినిమాలు చూసి సాయంత్రం ఇంటికి వెళ్లేవాడిని. ఇంట్లో వాళ్లేమో చదివి తెగ కష్టపడుతున్నానని అనుకునేవారు. తీరా ఇంటర్‌లో అన్నీ సబ్జెక్ట్స్ పోయాక.. సినిమా రంగంలోకి వచ్చాను అని బండ్ల గణేష్ తెలిపాడు.

  ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్..

  ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్..

  ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యాను. అక్కడ పూరి జగన్నాద్ నాకు జూనియర్. అలా అక్కడి నుంచి అవకాశాల కోసం ప్రయత్నించాను. ఈవీవీ గారి ప్రేమఖైదీ సినిమా షూటింగ్ సమయంలో జూనియర్ ఆర్టిస్ట్‌లు కావాలంటే వెళ్లాను. అక్కడే నువ్ (అలీ) పరిచయం అయ్యావు. నిన్ను రిక్వెస్ట్ చేయడంతోనే ఈవీవీ గారికి చెప్పి ఓ క్లోజప్ షాట్ కూడా పెట్టించావు అని బండ్ల గణేష్ గుర్తుకు చేసుకున్నాడు.

  అలా వెళ్తూ వచ్చేవాడిని..

  అలా వెళ్తూ వచ్చేవాడిని..

  మాది షాద్ నగర్ అవ్వడం, సిటీకి దగ్గరగా ఉండటంతో రోజూ అప్ అండ్ డౌన్ చేసేవాడిని. అలా షూటింగ్‌లు ప్యాక్ అప్ అయ్యాక బస్ పట్టుకుని ఇంటికి వెళ్లేవాడిని. అయితే ఓ సారి మాత్రం షూటింగ్ బాగా ఆలస్యమైంది. దాంతో నాకు ఇంటికి వెళ్లేందుకు బస్సులు కూడా లేవు. ఎక్కడ ఉండాలో కూడా అర్థం కాలేదు అని బండ్ల గణేష్ వివరించాడు.

  నరకం చూశాను..

  నరకం చూశాను..

  అక్కడే ఉందామని ప్రొడక్షన్ మేనేజర్‌ను అడిగినా ఒప్పుకోలేదు. మళ్లీ తెల్లారి ఉదయమే సీన్ ఉందని చెప్పినా వినిపించుకోలేదు. ఆ సినిమా కో డైరెక్టర్ వాళ్ల రూం దగ్గర్లో ఉంటే వస్తానని చెప్పాను. కానీ పడుకోవడానికి బెడ్ లేదు అని అన్నాడు. ఓ మూలకు అలా పడుకుంటాను అని చెప్పాను. తీరా అక్కడికి వెళ్లాక.. వాళ్ల ఫ్రెండ్స్ అందరూ మందు పార్టీ చేసుకున్నారు. నేనేమో ఎప్పుడు పడుకోవాలా? అని ఎదురుచూశాను అని బండ్ల గణేష్ పేర్కొన్నాడు.

  ఇండస్ట్రీని వదిలేద్దామనుకున్నా..

  ఇండస్ట్రీని వదిలేద్దామనుకున్నా..

  అందులో ఓ వ్యక్తి బాగా తాగి.. నేను పడుకోవాల్సిన చోట వాంతులు చేసుకున్నాడు. ఇక రాత్రంతా నేను నిద్రపోకుండా అలాగే ఉండిపోయాను. అలా జరిగాక ఇండస్ట్రీలో ఉండకూడదని ఇంటికి వెళ్లిపోయాను. కానీ మా నాన్న నాకు ధైర్యం చెప్పి పంపించాడు. ఆయనే లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు అని బండ్ల గణేష్ వివరించాడు.

  English summary
  Bandla Ganesh About His Struggling In Film Industry. he says that he wants to leave this industry in early stage, but his father motivated him.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X