twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వార్డ్ మెంబర్‌గా గెలిచే సత్తా ఉందా? నీ స్థాయి నిరూపించుకో.. ఎంపీ సాయిరెడ్డికి బండ్ల గణేష్ సవాల్

    |

    సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌కు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మధ్య సోషల్ మీడియా వార్ తీవ్రంగా కొనసాగుతున్నది. కమ్మ కులాన్ని టార్గెట్ చేస్తూ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలపై బండ్ల గణేష్ భగ్గుమన్నాడు. అయితే అంతే మొత్తంలో బండ్లకు విజయసాయిరెడ్డి కౌంటర్ ఇస్తూ సోషల్ మీడియాను వేడెక్కించారు. అయితే ఈ వివాదం హాట్ హాట్‌గా కొనసాగడం వెనుక అసలు విషయంలోకి వెళితే..

    కమ్మకులంపై వివాదాస్పద వ్యాఖ్యలతో

    కమ్మకులంపై వివాదాస్పద వ్యాఖ్యలతో

    తెలుగుదేశం పార్టీ కమ్మకులం పార్టీ.. కమ్మ కులం వారు ద్రోహులు అనే విధంగా విజయసాయిరెడ్డి కొద్దికాలంగా ట్విట్టర్ వేదికగా ట్వీట్ల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. అయితే కమ్మకులం వారిని ద్వేషించడం సరికాదు.. మీకు రాజకీయపరమైన విభేదాలు ఉంటే చంద్రబాబు, లోకేష్‌ను టార్గెట్ చేయండి.. వారిని జైల్లో పెట్టించండి అంటూ బండ్ల గణేష్ ఘాటుగా స్పందించాడు.

    కమ్మకులం చరిత్ర ఇదే అంటూ

    కమ్మకులం చరిత్ర ఇదే అంటూ

    కమ్మకులం వారు అభివృద్ది కారకులు. ఈ రాష్ట్ర, దేశ అభివృద్దిలో పాలుపంచుకొన్న గొప్ప నాయకులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. నీళ్లు ఎక్కడుంటే అక్కడికి వెళ్తారు. వ్యవసాయమే వారి ప్రధానవృత్తి. కష్టించి పనిచేయడమే వారి నైజం. ఎన్టీఆర్ పార్టీ పెట్టక ముందే.. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో 40 మంది ఎమ్మెల్యేలు ఉన్న చరిత్ర. అంతేకానీ.. తెలుగు దేశం పార్టీకి కమ్మకులాన్ని అట్టగట్టడం సరికాదు అని బండ్ల గణేష్ ఆవేశంగా మాట్లాడారు.

    బండ్ల గణేష్ ఎంపీ విమర్శలు

    బండ్ల గణేష్ ఎంపీ విమర్శలు

    అయితే బండ్ల గణేష్ ట్విట్టర్‌లో ఘాటుగా కౌంటర్ ఇవ్వడంపై అంతే స్థాయిలో విజయ్ సాయిరెడ్డి స్పందించాడు. వక్కలు.. పక్కలు.. చరణ్, ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్‌ను చీట్ చేశావు.. హీరో సచిన్‌తో గొడవ అలాగే చెప్పు తెగేలా తన్నులు తిన్నావంటూ బండ్ల గణేష్‌‌పై సాయిరెడ్డి తీవ్ర ఆరోపణలలు చేశాడు. అయితే తాను ప్రభుత్వ ఆస్తులను దోచుకోలేదు.. అలాగే జైలుకు వెళ్లి రాలేదు దొంగసాయి అంటూ బండ్ల గణేష్ తన స్వరాన్ని పెంచాడు.

    పవన్ కల్యాణ్ భక్తుడిని..

    పవన్ కల్యాణ్ భక్తుడిని..

    విజయ్ సాయిరెడ్డితో ట్విట్టర్ వార్ కొనసాగుతుండగా.. బండ్ల గణేష్ ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌కు లైవ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. చంద్రబాబు, తెలుగుదేశం పార్టీతో సంబంధం లేదు. నాకు జీవితాన్ని ఇచ్చింది.. నన్ను నిర్మాతగా చేసింది పవన్ కల్యాణ్. నేను ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను. నాకు కులపిచ్చి లేదు. నా కులం వాళ్లు నాకు ఎన్నడూ సపోర్ట్ చేయలేదు. కానీ వ్యక్తులపై ఏదైనా ద్వేషం ఉంటే.. వారిని తిట్టండి.. కొట్టండి.. జైల్లో పెట్టండి.. కానీ కమ్మకులం వారిని తిట్టడం సరికాదు అని బండ్ల గణేష్ అన్నాడు.

    వార్డ్ మెంబర్‌గా గెలుస్తాడా?

    వార్డ్ మెంబర్‌గా గెలుస్తాడా?

    విజయ్ సాయి రెడ్డి నా స్థాయి గురించి మాట్లాడుతున్నాడు. ముందు ఆయన స్థాయి ఏమిటో తెలుసుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి, సోనియాగాంధీకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి విజయసాయిరెడ్డి. వైఎస్ జగన్ పక్కన చేరి.. అధికారాన్ని, రాజ్యసభ పదవిని ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన రాజ్యసభ పదవి కాలం కూడా ముగిసింది. ఇక ఆయన వైజాగ్‌లో ఎవరైనా వార్డ్ మెంబర్‌ను గానీ.. లేదా ఎమ్మెల్యేను గానీ రాజీనామా చేయించి.. గెలవమని చెప్పండి. అప్పుడు ఆయన స్థాయి ఏంటో తెలుస్తుంది అంటూ బండ్ల గణేష్ సవాల్ విసిరాడు.

    జైలుకు వెళ్లలేదు అంటూ

    జైలుకు వెళ్లలేదు అంటూ

    నా స్థాయిని విజయ సాయిరెడ్డి ప్రశ్నించడం సరికాదు. నేను కింది స్థాయి నుంచి కష్టపడుతూ నిర్మాత స్థాయికి ఎదిగాను. నేను వ్యాపారపరంగా నేను ఎవరిని చీట్ చేయలేదు. వ్యాపారంలో కొన్ని వివాదాల కారణంగా నాపై కేసులు ఉన్నాయి. అంతేకాని ప్రభుత్వ, ప్రజల సొమ్మును లూటీ చేసి జైలు జీవితాన్ని అనుభవించలేదు. నా సొంత కష్టంపైన ఎదిగాను. నాకు రాజకీయాలతో సంబంధం లేదు. నేను కాంగ్రెస్ పార్టీ అభిమానిని. నేను కాంగ్రెస్ పార్టీకే ఓటు వేశాను. ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం మంచి పనులు చేస్తున్నది. ఇప్పుడు నేను కేసీఆర్‌కు అభిమానిని అని బండ్ల గణేష్ అన్నారు.

    English summary
    Producer Bandla Ganesh verbal war continues with YSRCP MP Vijaya Sai Reddy in Twitter. Both celebrities exchanges words on Social media with Highly Serious note. Bandla Ganesh challenges YSRCP MP Vijay Saireddy
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X