Just In
- 17 min ago
అది కంట్రోల్ చేయడమే నా పేరుకు అర్థం.. ఎద అందాలతో చిచ్చుపెట్టిన ఊర్వశీ
- 1 hr ago
ఇదెక్కడి వింతరా బాబు.. సుత్తితో కొట్టేసుకుంటోన్న హీరో.. వీడియో వైరల్
- 1 hr ago
నాగ చైతన్య, సాయి పల్లవి లవ్ స్టోరీ: ముహూర్తం ఫిక్స్ చేసిన చిత్ర యూనిట్
- 1 hr ago
సమంత ఖాతాలో ఊహించని రికార్డు: ఇండియాలో ఏ హీరోయిన్‌కూ దక్కని ఘనత సొంతం
Don't Miss!
- Lifestyle
సెక్స్ సమయంలో మీరు ఈ పని చేస్తే ఏమి జరుగుతుంది?
- News
పంచాయితీ వార్ : జగన్ రెడ్డి శిష్యుడు కాకర్ల ఎవర్ని చంపుతారు ? సంఘం అధ్యక్షుడి వ్యాఖ్యలపై టీడీపీ ఫైర్
- Sports
ఆరుగురు అరంగేట్ర ఆటగాళ్లకు కొత్త కార్లు.. సర్ప్రైజ్ ఇచ్చింది ఎవరో తెలుసా?
- Automobiles
భారత్‌లో స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ డిస్కంటిన్యూ; హ్యార్లీ కథ ముగిసినట్లేనా?
- Finance
Union Budget 2021: ఈ సారి బడ్జెట్ ఎలా ఉండాలి.. ఎలాంటి సవాళ్లున్నాయి..?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఎంత చెప్పినా ఎవ్వరూ వినడం లేదు.. వదలిపెట్టని రూమర్లు.. దండం పెట్టిన బండ్ల గణేష్!!
బడా ప్రొడ్యూసర్, బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్‌గా బండ్ల గణేష్ మంచి పీక్స్‌లో ఉన్న సమయంలో రాంగ్ స్టెప్ వేశాడు. రాజకీయాల్లోకి వచ్చి అతి పెద్ద తప్పు చేశాడు. ఇక పాలిటిక్స్‌లోకి వచ్చాక బురద అంట కుండా ఉంటుందా? రాజకీయాల్లో నుంచి తప్పుకున్నాను నన్ను వదిలేయండి అని మొరపెట్టుకున్నా నీడలా వెంటాడుతూనే ఉంటుంది ఆ గతం. ఇప్పుడు బండ్ల గణేష్ చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. కొందరు పనిగట్టుకుని బండ్లన్నపై బురద జల్లే ప్రయత్నం చేస్తోన్నట్టు కనిపిస్తోంది.

గతం వెంటాడుతోంది..
బండ్ల గణేష్ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చేరి వాగిన వాగుడంతా ఓ రేంజ్‌లో వైరల్ అయింది. అయితే ఆ ఎన్నికల్లో బండ్ల గణేష్‌కు కనువిప్పు కలిగింది. రాజకీయాల వల్ల కొందరికి దూరం కావాల్సి వస్తోంది.. అసలు ఈ రాజకీయాలే వద్దని స్వస్తిపలికాడు. మళ్లీ సినిమానే జీవితమని చెప్పాడు. సినిమాలతోనే బిజీగా గడపాలని ఫిక్స్ అయ్యాడు.

భారీ ప్రాజెక్ట్‌లు..
సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించడంతో బండ్ల గణేష్ పరువుపోయినట్టైంది. అలాంటి పాత్రలు ఎందుకు చేశావ్ అని తన పిల్లలే నిలదీశారట. అందుకే ఇకపై నటించడం కంటే సినిమాలను నిర్మించడమే మంచిదని ఫిక్స్ అయ్యాడట. అందుకు భారీ సినిమాలను నిర్మించే క్రమంలో పవన్ కళ్యాణ్‌తో ఓ ప్రాజెక్ట్‌కు కర్చీప్ వేసుకున్నాడు.

ఈలోపు అలాంటి రూమర్లు..
అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా గత కొన్ని రోజులుగా బండ్లన్న రాజకీయ ఎంట్రీపై పలు రకాల రూమర్లు వస్తున్నాయి. బీజేపీలో చేరబోతోన్నాడని గుసగులసు వినిపించాయి. ఈ రూమర్లను ఖండిస్తూ రెండ్రోజుల క్రితం ఓ పోస్ట్ చేశాడు.

నా అభ్యర్థన..
నాకు ఏ రాజకీయ పార్టీలతో ఏ రాజకీయాలతో సంబంధం లేదు .నేను రాజకీయాలకు దూరం .దయచేసి గతంలో మాట్లాడిన మాటల్ని ఇప్పుడు పోస్ట్ చేయొద్దు. ఇది నా అభ్యర్థన మీ బండ్ల గణేష్ అంటూ అందరినీ వేడుకున్నాడు. అయినా సరే రూమర్లు ఆగడం లేదు. అవి అంతకంతకూ పెరుగుతూ ఉండటంతో మరో సారి స్పందించాడు.

రాజకీయాలకు దూరం..
మళ్లీ రాజకీయాల్లో బండ్ల్ గణేష్ రాబోతోన్నాడని అందరూ గుసగుసలు పెడుతూ రూమర్లను వ్యాప్తి చేస్తున్నారని మరోసారి క్లారిటీ ఇచ్చాడు. బండ్ల గణేష్ ఈసారి ఏకంగా దండం పెట్టేశాడు. నాకు ఏ రాజకీయ పార్టీలతో ఏ రాజకీయాలతో సంబంధం లేదు నేను రాజకీయాలకు దూరం. అంటూ దండం పెట్టేశాడు. మరి ఇప్పటికైనా ఈ రూమర్లకు పుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి.