»   » పవన్ ముగ్గురు భార్యలను ప్రస్తావించిన వర్మ... బూతులు తిట్టిన బండ్ల గణేష్!

పవన్ ముగ్గురు భార్యలను ప్రస్తావించిన వర్మ... బూతులు తిట్టిన బండ్ల గణేష్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను రామ్ గోపాల్ వర్మ మరోసారి టార్గెట్ చేసారు. 'కాటమరాయుడు' సినిమా రిలీజ్ సందర్భంగా ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ మీద విమర్శల వర్షం కురిపించాడు. వర్మ చేసిన ట్విట్లపై ట్విట్టర్లో పెద్దగొడవే జరుగుతోంది.

ప్రముఖ నిర్మాత, పవన్ కళ్యాణ్ వీరాభిమాని, భక్తుడు బండ్ల గణేష్.... వర్మ ట్వీట్లకు ప్రతిదాడి చేస్తూ ట్విట్లతో విరుచుకుపడ్డారు. వర్మను బండ బూతులు తిట్టాడు. బండ్ల గణేష్ ఇంతలా రియాక్ట్ కావడానికి కారణం..... వర్మ చేసిన ట్వీట్లు చాలా దారుణంగా ఉండటమే.

పవన్ ముగ్గురు భార్యలు కూడా చూడరు

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలు కూడా ‘కాటమరాయుడు' సినిమా చూడరు... అంటూ వర్మ వ్యంగంగా ట్వీట్ చేసారు.

పవన్ కాలి చెప్పుతో సరితూగవు

అంతటితో ఆగని వర్మ... పవన్ కళ్యాణ్ అభిమానులను గేదెలతో పోల్చాడు. దీంతో చిర్రెత్తిన బండ్ల గణేష్.... ‘నువ్వు కనీసం పవన్ చెప్పు విలువ చెయ్యవు, నోరు దగ్గరపెట్టుకో, నువ్వు రోడ్డు మీద అరిచే కుక్కవు అంటూ ఘాటుగానే రిప్లై ఇచ్చారు.

అసలైన స్టార్ పవర్ స్టార్ ఆయనే

నిజమైన అల్టిమేట్ పవర్ స్టార్ రజనీకాంత్ మాత్రమే. ఆయన సినిమా నిర్మాతలు, ఎగ్జిబిటర్లు నష్టపోతే తిరిగి డబ్బులు ఇప్పిస్తారని వర్మ ట్వీట్ చేసారు.

ఘాటుగా వర్మ ట్వీట్

పవన్ కళ్యాణ్ అభిమానులు, అతడి కుటుంబ సభ్యులు జేబులో నుండి ఒక్కరూపాయి కూడా తీయరు... కానీ కోట్లు నష్టపోయిన ఇతరుల గురించి మాత్రం చాలా మాట్లాడతారు అంటూ వర్మ ఘాటుగా ట్వీట్ చేసారు.

సిగ్గు పడుతున్నాం అంటూ బండ్ల

నువ్బు బ్లాక్ షీప్ లాంటోడివి... నీలాంటోడు ఇండియన్ అయినందుకు మేమంతా సిగ్గు పడుతున్నాం. నువ్వు కాలం చెల్లిన టాబ్లెట్ లాంటోడివి అంటూ తనదైన రీతిలో వర్మను టిట్టుకుంటూ వచ్చాడు బండ్ల గణేష్.

లఫూట్ ఫ్యాన్స్ వల్లే

పవన్ కళ్యాణ్ అభిమానులను కూడా వర్మ ఈ సందర్బంగా తప్పు బట్టాడు. లపూట్ ఫ్యాన్స్ వల్లనే పవన్ కళ్యాణ్ అతడి నిజమైన స్ట్రెంత్ ఏమిటో తెలుసుకోలేక పోతున్నాడు అంటూ వర్మ ట్వీట్ చేసాడు.

30 కోట్లతో సినిమా 100 కోట్లకు అమ్ముతారు

30 కోట్లతో సినిమా తీస్తారు. 100 కోట్లకు అమ్ముతారు. 70 కోట్లు పాకెట్లో వేసుకుని...కూతుర్ల బర్త్ డేలు చేస్తూ ఎంజాయ్ చేస్తాడు. రోమ్ నగరం తగలబడిపోతుంటే పిడేలు వేయించే నీరో చక్కవర్తికి పవన్ కళ్యాణ్ తక్కువేమీ కాదు అంటూ వర్మ ట్వీట్ చేసాడు.

టెర్రరిస్టుతో పోల్చిన బండ్ల

ఈ సందర్బంగా రామ్ గోపాల్ వర్మను బండ్ల గణేష్ టెర్రరిస్టుతో పోల్చాడు.

అభిమానులపై కూడా

పవన్ అభిమానులపై కూడా వర్మ తీవ్రంగానే విరుచుకుపడ్డాడు. శనివారం రాత్రి నుండి ఈ ట్విట్టర్ వార్ జరుగుతూనే ఉంది.

గట్టిగానే రిప్లై ఇచ్చిన బండ్ల

వర్మ చేసే ట్విట్లకు బండ్ల గణేష్ గట్టిగానే రిప్లై ఇచ్చాడు.

English summary
Actor-producer Bandla Ganesh has lashed out at controversial director Ram Gopal Varma over his series of tweets against actor Pawan Kalyan and his latest offering Katamarayudu. While RGV was oblivion to Bandla Ganesh's sharp replies, Bandla continued it and went onto call RGV as "black sheep" and "ashamed" to call him as Indian.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X