»   » ఆ గ్రూఫులో నేను లేను: బండ్ల గణేష్ వ్యాఖ్యలు దిల్‌రాజు పైనే?

ఆ గ్రూఫులో నేను లేను: బండ్ల గణేష్ వ్యాఖ్యలు దిల్‌రాజు పైనే?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కొన్ని రోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో ఓ విషయం హాట్ టాపిక్ అయింది. తెలుగు నిర్మాతల మండలికి చెందిన 16 మంది పెద్ద నిర్మాతల గ్రూఫు ఓ రెండు న్యూస్ ఛానళ్లకు మినహా...మిగతా న్యూస్ ఛానళ్లను పక్కన పెట్టినట్టిన సంగతి తెలిసిందే. రెండు ఛానళ్లకు తప్ప మిగతా న్యూస్ ఛానళ్లకు ఎలాంటి ప్రకటనలు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దిల్ రాజు నేతృత్వంలోనే ఇదంతా జరుగుతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.

దిల్ రాజు నేతృత్వంలోని ఆ 16 మంది నిర్మాతల గ్రూఫులో బండ్ల గణేష్ కూడా ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఈ వార్తల నేపథ్యంలో బండ్ల గణేష్ వివరణ ఇచ్చారు. సదరు 16 మంది నిర్మాతల గ్రూఫులో నేను లేనని, మీడియా ఛానళ్లపై తాను ఎలాంటి వివక్ష చూపడం లేదని, మీడియా మిత్రులంతా నా ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వారు అని స్పష్టం చారు. ఈ మేరకు ఓ పబ్లిక్ స్టేట్మెంటు కూడా విడుదల చేసారు. అందులో క్రింది విధంగా పేర్కొన్నాడు.

Bandla Ganesh public statement bout media

‘గుడ్ ఈవినింగ్ సర్. నేను బండ్ల గణేష్. మీడియావారంతా నా ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వారు. మీడియాకు వ్యతిరేకంగా నేను కొన్ని చర్యలకు పాల్పడుతున్నట్లు వార్తల్లో విన్నాను. అందులో ఏ మాత్రం నిజం లేదు. మీడియాకు వ్యతిరేకంగా ఉన్న 16 మంది గ్రూఫులో నేను ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో నిజం లేదు. ఆ గ్రూఫులో నేను లేను. మీడియా సహకారం వల్లనే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను. నటుడిగా, నిర్మాతగా మీడియా వారు నాకు ఎంతో సహకరించారు. అలాంటి వారికి నేను ఎప్పుడు వ్యతిరేకంగా పని చేయను' అని వివరణ ఇచ్చారు.

English summary
"Good evening sir. This is Bandla Ganesh. I would like to emphasise my relationship with all the media members whom I consider as a part of my family. My all due respect to them. Behind my all success as an artist and a producer you have played a very major role and I m really very thankful to you for that." Bandla Ganesh said.
Please Wait while comments are loading...