twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గోవిందుడు అందరి వాడేలే....బండ్ల గణేష్ సొంతగా రిలీజ్!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘గోవిందుడు అందరి వాడేలే' చిత్రం అక్టోబర్ 1న గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని నైజాం, కృష్ణ ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లకు అప్పగించకుండా నిర్మాత బండ్ల గణేష్ సొంతగా రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. తెలుగు సినిమాలకు కలెక్షన్ల పరంగా నెం.1 స్థానంలో ఉండే నైజాం ఏరియాలో నిర్మాతే సొంతగా రిలీజ్ చేసుకుంటుండటం చర్చనీయాంశం అయింది.

    సినిమా వివరాల్లోకి వెళితే ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈచిత్రం U/A సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. రామ్ చరణ్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, కమిలీనీ ముఖర్జీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దర్శకుడు కృష్ణ వంశీ ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

    Bandla Ganesh to release GAV himself

    కథ ఇదే అంటూ ప్రచారం జరుగుతోంది...
    ఈ చిత్రంలో ప్రకాష్ రాజు పెద్ద మోతుబరి రైతు. ఆయనకు ఇద్దరు కొడుకులు ఒకడు రహమాన్. రెండవ వాడు శ్రీకాంత్. మొదటి నుంచి శ్రీకాంత్ ...తండ్రి మాట వినకుండా..తిరుగుతూంటే అతన్ని ప్రక్కన పెడతాడు. ఇక పెద్ద కొడుకు రహమాన్ చదువులో ఫస్ట్. అతన్ని డాక్టర్ చదివిస్తాడు. డాక్టర్ చదివి తన చుట్టు ప్రక్కల ప్రాంతాల వారికి ఉచిత వైద్యం చేస్తాడని భావిస్తాడు.

    అయితే డాక్టర్ చదివిన రహమాన్ తను ఇష్టపడ్డ అమ్మాయిని ప్రేమించి లండన్ వెళ్లి అక్కడ డాక్టర్ ప్రాక్టీస్ పెడతాడు. వారి కుమారుడే రామ్ చరణ్. అతను లండన్ లో పెరిగి పెద్దయిన తర్వాత తన తాత గురించి తెలుసుకుని ఇండియా వస్తాడు. అయితే తనే ఆయన మనవడిని అని చెప్తే ఒప్పుకోడని తన ఐడింటెటీ దాచి ఆయనకు దగ్గర అవుతాడు. అంతేకాకుండా తన బాబాయ్ ని సైతం తన తాతకు దగ్గరయ్యేలా చేస్తాడు.

    తన బాబాయ్ శ్రీకాంత్ ప్రేమించిన కమలిని ముఖర్జీ ని దగ్గర చేసి మార్కులు కొట్టేస్తాడు. తర్వాత తన తాతను, తన తండ్రిని, బాబాయ్ ని కలుపుతాడు. ఈ లోగా లోకల్ గా కొందరు తన తాతకు శత్రువులు ఉంటే పనిలో పనిగా వారి పనీ పడతాడు. అక్కడ తన మేనమామ కూతురు కాజల్ తో డ్యూయిట్స్ పాడతాడు. ఇలా తన కుటుంబానికి ఓ ఎన్నారై ఎలా దగ్గరయ్యాడనే విషయం చుట్టూ సినిమా తిరుగుతుంది.

    English summary
    Film Nagar source said, Bandla Ganesh is all set to release his film Govindudu Andari Vadele in Nizam and Krishna areas by himself.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X