Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
పూరీ జగన్నాథ్‌పై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు: ఆకాశ్ నీ కొడుకు కాదా.. చాలా మంది ఉన్నారంటూ!
టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుని.. బడా డైరెక్టర్‌గా వెలుగొందుతున్నారు పూరీ జగన్నాథ్. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరొందిన ఆయన.. వరుస సినిమాలతో దూసుకుపోతోన్నారు. అదే సమయంలో తన కుమారుడు ఆకాశ్‌ను చాలా రోజుల క్రితమే హీరోగా పరిచయం చేశారు. అయితే, అతడికి మాత్రం ఇప్పటి వరకూ భారీ సక్సెస్ మాత్రం రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ యంగ్ హీరో ప్రస్తుతం 'చోర్ బజార్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దీనికి గెస్టుగా వచ్చిన నిర్మాత బండ్ల గణేష్.. పూరీ జగన్నాథ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అసలేం జరిగిందో మీరే చూడండి!

‘చోర్ బజార్’ అంటోన్న ఆకాశ్ పూరీ
ఆకాశ్ పూరి హీరోగా జార్జ్ రెడ్డి దర్శకుడు జీవన్ రెడ్డి తెరకెక్కించిన చిత్రమే ‘చోర్ బజార్'. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను ఐవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వీఎస్ రాజు నిర్మించారు. సురేష్ బొబ్బిలి ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. ఇందులో సుబ్బరాజు, సునీల్, సంపూర్ణేష్ బాబు సహా ఎంతో మంది నటులు కీలక పాత్రలను పోషించారు.
ఇన్నర్స్ లేకుండా షాకిచ్చిన పాయల్: వామ్మో ఆరబోతలో హద్దు దాటేసిందిగా!

అంచనాలు.. బిజినెస్.. రిలీజ్ భారీగా
స్టార్ కిడ్ ఆకాశ్ పూరీ నటించిన ‘చోర్ బజార్' సినిమా విభిన్నమైన కథతో రూపొందింది. ఇప్పటికే దీని నుంచి విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీని బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. అంతేకాదు, ఈ సినిమాను అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

ప్రమోషన్ షురూ.. ప్రీ రిలీజ్ ఈవెంట్
‘చోర్
బజార్'
మూవీ
జూన్
24న
విడుదల
కాబోతుంది.
ఈ
నేపథ్యంలో
చిత్ర
యూనిట్
ప్రమోషన్
కార్యక్రమాలను
వేగవంతం
చేసేసింది.
ఇప్పటికే
ఆకాశ్,
గెహనా
సహా
యూనిట్
సభ్యులు
పలు
షోలలో
సందడి
చేశారు.
అలాగే,
వరుసగా
ఇంటర్వ్యూలు
ఇస్తున్నారు.
ఈ
క్రమంలోనే
బుధవారం
హైదరాబాద్‌లో
ఈ
మూవీ
ప్రీ
రిలీజ్
ఈవెంట్‌ను
అంగరంగ
వైభవంగా
నిర్వహించారు.
యాంకర్ ప్రదీప్ క్యారెక్టర్ బయట పెట్టిన ఢీ డ్యాన్సర్.. ఫోన్ చేస్తే అలా అన్నాడంటూ ఎమోషనల్

బండ్ల గణేష్ స్పీచ్ స్పెషల్ అట్రాక్షన్
ఆకాశ్ పూరీ నటించిన ‘చోర్ బజార్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిత్ర యూనిట్‌తో పాటు చాలా మంది ప్రముఖులు గెస్టులుగా వచ్చారు. అందులో ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కూడా ఉన్నారు. పూరీ జగన్నాథ్ భార్య తనకు వదిన అని, ఆమె వల్ల ఇక్కడకు వచ్చానని చెప్పిన ఆయన.. అదిరిపోయే స్పీచ్‌తో ఆకట్టుకున్నారు. ఇందులో ఆయన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

పూరీ జగన్నాథ్‌పై సంచలన వ్యాఖ్యలు
‘చోర్ బజార్' ఈవెంట్‌లో బండ్ల గణేష్ ‘ఏదో సామెత ఉంటుంది.. దేశం మొత్తం కల్లాపు చల్లాడు కానీ.. ఇంటి ముందు చల్లడానికి టైం లేదని. పూరీని చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది. ఎంత మందినో స్టార్లను చేశాడు. సూపర్ స్టార్లను చేశాడు. డైలాగ్‌లు చెప్పడం రాని వాళ్లకి డైలాగ్‌లు నేర్పాడు. డాన్స్‌లు రాని వాళ్లకి డాన్స్‌లు నేర్పాడు. మామూలు వాళ్లను స్టార్లను చేశాడు. సూపర్ స్టార్లు చేశాడు. కానీ కన్న కొడుకు సినిమా ఫంక్షన్‌కు మాత్రం రాలేదు' అంటూ పూరీపై విమర్శలు చేశాడు.
Bigg Boss 6: బిగ్ బాస్‌లోకి టాలీవుడ్ వారసుడు.. అందుకోసమే ఒప్పుకున్న యంగ్ హీరో

తలకొరివి పెట్టేది వాళ్లు.. అలా చేయకు
బండ్ల గణేష్ కంటిన్యూ చేస్తూ.. ‘నేనైతే లండన్‌లో ఉన్నా స్పెషల్ ఫ్లైట్ వేసుకుని నా పిల్లాడి ఈవెంట్‌కు వచ్చేవాడిని. ఎందుకంటే నేను ఉన్నదే నా కొడుకు కోసం.. నా పెళ్లం కోసం.. నా పిల్లల కోసం.. మా అన్న ఎక్కడ ఉన్నాడో.. ఏం బిజీగా ఉన్నాడో.. ఈ సారికి అయిపోయింది కానీ ఇంకోసారి ఇలాంటి పని మాత్రం చేయకు. ఎందుకంటే మనం ఏం చేసినా వాళ్ల కోసమే. మనం చస్తే తలకొరివి పెట్టాల్సిందే వాళ్లే. మనం సంపాదిస్తే ఆస్తులు వాళ్లకే.. అప్పులు చేస్తే తీర్చేదీ వాళ్లే' అంటూ చెప్పుకొచ్చాడు.

అలా రాస్తే రాజ్యాంగం ఒప్పుకోదు కదా
ఈ ఈవెంట్‌లో బండ్ల ‘ఆకాష్ అంటే సన్నాఫ్ పూరీ జగన్నాథ్. ఇంకొకడి పేరు రాస్తే రాజ్యాంగా ఒప్పుకోదు కదా. బండ్ల గణేష్ సన్నాఫ్ బండ్ల నాగేశ్వరరావు అని కాకుండా వేరే వాడి పేరు రాస్తే వచ్చి అక్కడ తంతారు. నువ్వు కన్నావ్ కాబట్టి.. అది నీ బాధ్యత. నువ్వు వదిన మెడలో తాళి కట్టావు.. ఆకాశ్‌ను కన్నావు.. పవిత్రని కన్నావు.. వాళ్ల బాధ్యత తీసుకోవాల్సిందే' అని అన్నాడు.
న్యూడ్ ఫొటో షేర్ చేసిన శ్రీయ: బట్టలు లేని పిక్ వదలడంపై విమర్శలు

ఆకాశ్ డేట్లు నీకు రాకుండా చేస్తానంటూ
బండ్ల గణేష్ కొనసాగిస్తూ.. ‘ఆకాష్‌ను స్టార్‌ను చేయాల్సిందే.. వాడు అవుతాడు.. ఎందుకంటే వాడికి టాలెంట్ ఉంది. ఎవర్నెవర్నో స్టార్లని చేశావ్.. నీ కొడుకు వచ్చేసరికి వెళ్లి ముంబాయిలో ఉన్నావు.. ఇదెక్కడి న్యాయం అన్నా.. చోర్ బజార్ పెద్ద హిట్ అవుతుంది. నువ్వు కూడా నీ కొడుకు డేట్స్ కోసం క్యూలో ఉండే రోజు వస్తుంది గుర్తుపెట్టుకో. నేను ఈరోజు చెప్తున్నా రాస్కో.. నువ్వు బ్యాంకాంగ్ పోయి కథ రాసుకుని.. ఆకాష్ కథ చెప్తా వినరా అని ఎదురుచూసే రోజు వస్తుంది. అలా జరగకపోతే నా పేరు బండ్ల గణేష్ కాదు. ఆరోజు ఆకాష్ నువ్ డేట్‌లు ఇవ్వొద్దని చెప్తా' అన్నాడు.
Recommended Video


వదిన తర్వాత చాలా మంది వచ్చారు
ఈ ఈవెంట్‌లో బండ్ల గణేష్.. పూరీ జగన్నాథ్ పర్సనల్ లైఫ్ మీద కామెంట్లు చేశాడు. ‘మా వదిన పూరీ స్టార్ అయ్యాక పెళ్లి చేసుకోలేదు. జేబులో వందో రెండొందలో ఉన్నప్పుడే చేసుకుంది. ఆ తర్వాత చాలా మంది వచ్చారులే.. అది వేరే విషయం. ఎన్నో కష్టాలను అనుభవించిన దేవత. సీతాదేవికి ఉన్నంత ఓర్పు ఉంది' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.