Don't Miss!
- News
జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2023 విడుదల: డౌన్లోడ్ చేసుకోండిలా!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Lifestyle
సెక్స్ సమయాన్ని మరికొంత ఎక్కువ సమయం కేటాయించడానికి ఈ విషయాలు చాలు...!
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Bandla Ganesh కుమారుడి ఫోటో వైరల్.. తండ్రికి జిరాక్స్ కాపీలా.. అందంతా దేవుడే డిసైడ్ చేస్తాడు అంటూ..
టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ ఏం చేసినా సెన్సేషన్‌గానే ఉంటుంది. వేదిక మీద ఏం మాట్లాడినా అది సంచలనంగా మారడమే కాకుండా య్యూట్యూబ్, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ మధ్యకాలంలో తన పిల్లలను మీడియాకు పరిచయం చేస్తూ బండ్ల గణేష్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో తన పిల్లలను సినిమా, ఎంటర్‌టైనింగ్ ఇండస్ట్రీలోకి తీసుకు రావాలనే ప్రయత్నం చేస్తున్నారనే మాట వినిపిస్తున్నది. తాజాగా తన కుమారుడు హితేష్ నాగన్ బండ్లను పరిచయం చేస్తూ ట్విట్టర్‌లో షేర్ చేసిన ఫోటో గురించి వివరాల్లోకి వెళితే..

పవన్ నామస్మరణతో
తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ నిర్మాత బండ్ల గణేష్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు వీర భక్తుడు అనే విషయం తెలిసిందే. వేదిక ఏదైనా పవన్ నామస్మరణ చేయడం తెలిసిందే. పవన్ మదిలోకి వస్తేనే శివాలెత్తి పోవడం తెలిసిందే. ఇటీవల వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బండ్ల గణేష్ చేసిన హంగామా ఇంకా అభిమానులు మరిచిపోలేదనే విషయం తెలిసిందే.

కొడుకు కలిగిన సందేహంపై బండ్ల గణేష్
ఇక గతంలో పవన్ కల్యాణ్‌కు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా తన కుమారుడు హితేష్ గురించి ప్రస్తావిస్తూ.. తన కుమారుడు హితేష్.. వినాయక్ కుమారుడి మధ్య నిజాయితీ అనే విషయంపై సందేహాలు వచ్చాయి. అయితే నా కుమారుడు వచ్చి నిజాయితీ అంటే ఏమిటి నాన్న అని అడిగితే ఇంట్లోకి తీసుకెళ్లి పవన్ కల్యాణ్ ఫోటో చూపించి.. నిజాయితీ అంటే ఇదేరా అని చూపించానని బండ్ల గణేష్ చెప్పడం అప్పట్లో వైరల్ అయింది.

కూతురు జననిని మీడియాకు పరిచయం
బండ్ల గణేష్ కొద్ది రోజుల క్రితం యాంకర్, డైరెక్టర్ ఓంకార్ నిర్వహించే సిక్త్‌సెన్స్ సీజన్ 4 షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన కుమార్తె జనని బండ్లను మీడియాకు పరిచయం చేశారు. తన కుమార్తెకు తనను రెండే కోరికలు కోరిందని, ఒకటి పవన్ కల్యాణ్‌తో బ్లాక్ బస్టర్ సినిమా తీయమని, రెండోది ఓంకార్ అన్నయ్యను పరిచయం చేయమని బండ్ల గణేస్ చెప్పారు.
Shilpa Shetty నా పిల్నల్ని శిక్షించొద్దు.. ఫ్యామిలిని వదిలేయండి.. శిల్పాశెట్టి భావోద్వేగంతో లేఖ

హితేష్ నాగన్ బండ్ల ఫోటోను షేర్ చేసి..
తాజాగా బండ్ల గణేష్ తన కుమారుడు హితేస్ నాగన్ బండ్ల ఫోటోను తన అభిమానులు, సోషల్ మీడియా నెటిజన్లతో పంచుకొన్నారు. బండ్ల షేర్ చేసిన కుమారుడి ఫోటోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అచ్చం తండ్రికి జిరాక్స్ కాపీలా... జూనియర్ బండ్ల గణేష్‌లో కనిపించాడు. బాడీ లాంగ్వేజ్ కూడా బండ్ల గణేష్ మాదిరిగానే ఉంది అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

అన్నా నీ చిన్నప్పటి ఫోటో అనుకొన్నా..
బండ్ల గణేష్ షేర్ చేసిన కుమారుడు హితేష్ ఫోటోపై నెటిజన్లు స్పందిస్తూ.. అన్నా.. నీ చిన్నప్పుడు ఫోటో అనుకొన్నా.. కానీ తీరా చూస్తే జూనియర్ బండ్ల అని తెలిసింది అంటూ పవన్ కల్యాణ్ ఫ్యాన్ కామెంట్ చేశారు. మరో నెటిజన్ కామెంట్ చేస్తూ.. ఎక్కడికి పొద్దన్నా.. మీ బ్లాక్ బస్టర్ బండ్ల రాజసం.. తగ్గేదే లే.. బ్లాక్ బస్టర్ బండ్ల హితేష్ నాగన్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

హీరోను చేస్తున్నావా అంటూ..
ఇక బండ్ల గణేష్ షేర్ చేసిన హితేష్ ఫోటోను చూసి అభిమానుల చేస్తున్న కామెంట్లు వైరల్ అవుతున్నాయి. హితేష్‌ను హీరోను చేస్తారా? నిర్మాతను చేస్తారా అని అడుగుతున్నారు. అభిమానుల కామెంట్లకు బదులిస్తూ.. అదంతా దేవుడి నిర్ణయం అంటూ ఓ ట్వీట్‌కు బండ్ల గణేష్ రిప్లై ఇచ్చారు.
Recommended Video

పవన్ కల్యాణ్‌తో సినిమా ప్లాన్
ఇదిలా ఉండగా, బండ్ల గణేష్ రెండుసార్లు కరోనా బారిన పడి ఇప్పడిప్పుడే కోలుకొంటున్నారు. ప్రస్తుత పరిస్థితులను ఆచితూచి బేరీజు వేస్తున్నారు. త్వరలోనే పవన్ కల్యాణ్‌తో మరో సెన్సేషనల్ ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. త్వరలోనే అధికారికంగా తన తదుపరి ప్రాజెక్టుపై ప్రకటన చేసే అవకాశం ఉంది.