»   » బండ్ల గణేష్‌కు శతృత్వం ఎవరితో..?

బండ్ల గణేష్‌కు శతృత్వం ఎవరితో..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నా విజయాన్ని చూడటానికైనా నా శత్రువులు సుధీర్ఘకాలం జీవించాలన్నది నా కోరిక.... అంటూ ప్రముఖ తెలుగు నిర్మాత బండ్ల గణేష్ ట్వీట్ చేసారు. మరి ఆయన ఎందుకు ఈ ట్వీట్ చేసారో? ఆయనకు సినీ పరిశ్రమలో శత్రువులు ఉన్నారా? బయట ఎవరైనా ఉన్నారా? అనేది హాట్ టాపిక్ అయింది.

బండ్ల గణేష్ సినిమాల విషయానికొస్తే..కెరీర్లో గబ్బర్ సింగ్, బాద్ షా, టెంపర్ లాంటి హిట్ చిత్రాలను నిర్మించిన బండ్ల గణేష్ ప్రస్తుతం సినిమాలేవీ చేయడం లేదు. త్వరలో ఓ అగ్ర హీరోతో భారీ ప్రాజెక్టు చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.

Bandla Ganesh tweet in talk

కోర్టు వివాదం..
‘నీజతగా నేనుండాలి' సినిమా విషయంలో బండ్ల గణేష్ తమను మోసం చేసాడని సినీ నటుడు సచిన్ జోషి‌కి సంబంధించిన వైకింగ్ మీడియా సంస్థ ఈ కేసు పెట్టింది. హిందీలో సూపర్ హిట్ అయిన ‘ఆషికి 2' చిత్రాన్ని సచిన్ జోషి హీరోగా తెలుగులో ‘నీజతగా నేనుండాలి' పేరుతో రీమేక్ చేసారు. నజియా హీరోయిన్ గా నటించింది. పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై జయ రవీంద్ర దర్శకత్వంలో ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మించారు. ఈ చిత్రానికి గణేష్ నిర్మాతగా ఉన్నప్పటికీ పెట్టుబడి పెట్టింది మాత్రం సచిన్ జోషికి చెందిన వైకింగ్ మీడియా సంస్థనే. డబ్బులు తిరిగి ఇచ్చే విషయంలో గణేష్ మోసం చేసాడని, నష్టాలు వచ్చాయని తప్పుడు లెక్కలు చూపాడని ఆ సంస్థ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో ఉంది.

English summary
Bandla Ganesh tweet in talk.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu