»   » ఎన్టీఆర్‌కు బండ్ల గణేష్ క్రీమ్ బిస్కెట్.. వర్కవుట్ అవుతుందా!

ఎన్టీఆర్‌కు బండ్ల గణేష్ క్రీమ్ బిస్కెట్.. వర్కవుట్ అవుతుందా!

Written By:
Subscribe to Filmibeat Telugu

ఒకప్పుడు పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రవితేజ లాంటి అగ్రహీరోలతో భారీ చిత్రాలను నిర్మించిన నిర్మాత బండ్ల గణేష్ పరిస్థితి ఇప్పుడు ఆశాజనకంగా కనిపించడం లేదు. చాలా రోజులుగా బండ్ల గణేష్ సినిమాలు తీసిన దాఖలాలు లేవు. టెంపర్ సమయంలో ఎన్టీఆర్‌తో విభేదాలు తలెత్తాయనే సినీ వర్గాలో ఓ రూమర్ ప్రచారమైంది. అప్పటి నుంచి ఎన్టీఆర్‌కు దూరంగా ఉన్నారు. తాజాగా బండ్ల గణేష్ ఎన్టీఆర్ గురించి చేసిన కామెంట్లు ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

పవన్, ఎన్టీఆర్ ఇబ్బంది..

పవన్, ఎన్టీఆర్ ఇబ్బంది..

సాధారణంగా తాను తీసే సినిమా సమయంలో ఆడియో ఫంక్షన్లు, ఇతర కార్యక్రమాలలో తన హీరోలను ఆకాశానికి ఎత్తేస్తుంటాడు. కొన్ని సందర్భాల్లో బండ్ల గణేష్ చేసిన పొగడ్తలకు పవన్ కల్యాణ్, ఎన్టీఆర్ లాంటి వాళ్లు ఇబ్బంది పడిన సందర్బాలు ఉన్నాయి.

బండ్ల గణేష్ పూనకం వచ్చినట్టు

బండ్ల గణేష్ పూనకం వచ్చినట్టు

తాజాగా ఎన్టీఆర్ నటించిన జై లవకుశ విడుదలైన నేపథ్యంలో బండ్ల గణేష్ మరోసారి పూనకం వచ్చినట్టుగా ట్విట్టర్‌లో వ్యాఖ్యలు చేశారు. జై లవకుశ సినిమా రాత్రి చూశాను. నిద్ర పట్టలేదు. ఎన్‌టీఆర్, ఎస్వీఆర్‌ల తర్వాత టాలీవుడ్‌లో ఎన్టీఆర్ మాత్రమే అంటూ రెచ్చిపోయారు.

ఎన్టీఆర్‌పై ప్రశంసల జల్లు

ఎన్టీఆర్‌పై ప్రశంసల జల్లు

జై లవకుశలో అద్భుత నటనను ప్రదర్శించిన ఎన్టీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. దిగ్గజ నటుల స్థాయిలో నటించిన మా బాద్‌షాకు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. ఇలా యంగ్ టైగర్‌పై ప్రశంసల జల్లు కురిపించడం ఆశ్చర్యం కలిగించింది.

బండ్ల భజన వెనుక

బండ్ల భజన వెనుక

బండ్ల గణేష్ ఉన్నట్టుండి భజన చేయడం వెనుక కారణం ఏమిటా అని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి. గత కొద్ది కాలంగా బడా హీరోలతో మళ్లీ సినిమాలు చేయాలని బండ్ల గణేష్ ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే జై లవకుశ గురించి కామెంట్ చేశాడనే వాదన వినిపిస్తున్నది.

యంగ్ టైగర్‌కు చేరువయ్యేందుకు..

యంగ్ టైగర్‌కు చేరువయ్యేందుకు..

ఎన్టీఆర్‌కు మళ్లీ చేరువ కావడానికి ప్రయత్నిస్తున్న బండ్ల గణేష్ జై లవకుశను ఆసరాగా చేసుకొని యంగ్ టైగర్ క్రీమ్ బిస్కెట్ విసిరారని పలువురు గుసగుసలాడుతున్నారు. ఏది ఏమైనా బండ్ల గణేష్ జాదు పనిచేస్తుందా లేదా కొన్ని రోజులు ఆగితే తెలియడం ఖాయం.

English summary
Young Tiger NTR's Jai Lava Kusa going good at Box office. NTR getting appreciation for Ravana role from all the corner. In this occasion Producer Bandla Ganesh sensational tweets. His comment become talk of the industry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu