»   »  ముగ్గురితో సమంత: నాగ చైతన్య, ఆర్య, సిద్దార్థ్ కాంబినేషన్

ముగ్గురితో సమంత: నాగ చైతన్య, ఆర్య, సిద్దార్థ్ కాంబినేషన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మళయాలం సూపర్ హిట్ మూవీ 'బెంగుళూరు డేస్' చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈచిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు ప్రసాద్ వి పొట్లూరి, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించనున్నారు. మూడు బాషల్లో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తారని టాక్.

ఈ సినిమాలో ఎవరు నటిస్తారు? అనే దానిపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రధాన తారగణం ఖరారైనట్లు తెలుస్తోంది. తెలుగు హీరో నాగ చైతన్య, తమిళ యాక్టర్ ఆర్య, సిద్ధార్థ కాంబినేషన్లో ఈచిత్రాన్ని తెరకెక్కించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట.

Bangalore Days with Samantha, Naga Chaitanya, Arya and Siddharth

తెలుగు, తమిళం వెర్షన్లో సమంతను హీరోయిన్‌గా నటించబోతోందని.....హిందీ వెర్షన్లో వేరే హీరోయిన్‌ను ఎంపిక చేయాలనే ఆలోచనలో ఉన్నారట ఫిల్మ్ మేకర్స్. మళయాలం వెర్షన్ 'బెంగుళూరు డేస్'లో దుల్కార్‌ సల్మాన్‌, పహద్‌ఫాజిల్‌, నివిన్‌. నజ్రియా నజీమ్‌ తదితరులు నటించారు. అంజలి మీనన్‌దర్శకత్వం వహించారు.

English summary

 Malayalam super hit film, 'Bangalore Days', will be remade in Telugu, Tamil and Hindi. Naga Chaitanya, Tamil actor Arya and Siddharth will act in the lead roles and Samantha reprises Nazriya Nazim's role in Telugu and Tamil versions.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu