For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bangarraju: అరుదైన రికార్డు క్రియేట్ చేసిన బంగార్రాజు.. టాలీవుడ్‌లో నెంబర్ వన్ మూవీ

  |

  చాలా కాలంగా విజయాలను అందుకోవడంలో ఇబ్బంది పడుతున్నా.. వరుస పెట్టి సినిమాలు చేస్తూనే వస్తున్నాడు టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున. ఫలితాలతో సంబంధం లేకుండా వరుస పెట్టి ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తోన్న అతడు.. హిట్ ట్రాక్ మాత్రం ఎక్కలేకపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో తన కొడుకు యువ సామ్రాట్ నాగ చైతన్యతో కలిసి 'బంగార్రాజు' అనే సినిమాలో నటించాడు. క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతి బరిలో నిలిచింది.

  ఈ మూవీకి ఆరంభంలో మంచి టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్లు కూడా మంచిగానే వచ్చాయి. ఇలా బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసి హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో తాజాగా బంగార్రాజు మూవీ ఓ అరుదైన రికార్డును కొట్టింది. ఆ సంగతులు మీకోసం!

  సంక్రాంతికి బంగార్రాజు సందడి

  సంక్రాంతికి బంగార్రాజు సందడి

  అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలయికలో కల్యాణ్ కృష్ణ కురసాల తెరకెక్కించిన సినిమానే ‘బంగార్రాజు'. సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి ఇది సీక్వెల్‌గా తెరకెక్కింది. ఇందులో రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా చేశారు. దీన్ని అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై నాగార్జున నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ మూవీ సంక్రాంతికి విడుదలైంది.

  బుల్లి గౌనుతో రెచ్చిపోయిన యాంకర్ వర్షిణి: వామ్మో ఈ హాట్ షో మామూలుగా లేదుగా!

  మంచి టాక్.. ఆ పరిస్థితుల వల్ల

  మంచి టాక్.. ఆ పరిస్థితుల వల్ల

  క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన ‘బంగార్రాజు' మూవీకి ఆరంభం నుంచే మంచి టాక్ వచ్చింది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్ల ఇష్యూ, నైట్ కర్ఫ్యూతో పాటు యాభై శాతం ఆక్యూపెన్సీ ఉండడంతో ఇది కలెక్షన్లపై తీవ్ర స్థాయిలో ప్రభావాన్ని చూపించింది. దీంతో నైజాంలో మంచిగా వసూళ్లను సాధించినా.. ఆంధ్రాలో మాత్రం గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది.

  టార్గెట్ పూర్తి చేసిన బంగార్రాజు

  టార్గెట్ పూర్తి చేసిన బంగార్రాజు

  నాగార్జున కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘బంగార్రాజు' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.15 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 39 కోట్లుగా నమోదైంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నా నెల రోజుల ప్రయాణం తర్వాత ఈ మూవీ టార్గెట్ చేరుకుని హిట్ అయింది.

  హాట్ వీడియోతో షాకిచ్చిన యాంకర్ మంజూష: ఆమెను ఇలా చూస్తే తట్టుకోలేరు!

  2022లో మొట్టమొదటి విజయం

  2022లో మొట్టమొదటి విజయం

  గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం సంక్రాంతికి పెద్దగా సినిమాలు రాలేదు. వచ్చిన వాటిలో ‘బంగార్రాజు' మాత్రమే భారీ చిత్రం. అందుకే ఈ చిత్రానికి బిజినెస్ కూడా అనుకున్న దానికంటే ఎక్కువగానే జరిగింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా టార్గెట్‌ను ఫినీష్ చేసి సత్తా చాటింది. దీంతో 2022వ సంవత్సరంలో హిట్ అయిన మొదటి చిత్రంగా ఇది ఘనతను అందుకుంది.

  ఓటీటీలో విడుదల.. రెస్పాన్స్‌తో

  ఓటీటీలో విడుదల.. రెస్పాన్స్‌తో

  సంక్రాంతి బరిలో నిలిచిన ‘బంగార్రాజు' మూవీ థియేటర్లలో చాలా రోజుల పాటు సందడి చేసింది. ఎన్నో అంచనాలతో వచ్చి థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 సంస్థ సొంతం చేసుకుంది. ఇక, ఇటీవలే ఈ సినిమా సదరు సంస్థలో డిజిటల్ స్ట్రీమింగ్ ప్రారంభం అయింది. అక్కడ కూడా ఈ చిత్రానికి మంచి స్పందనే దక్కింది.

  బాత్‌టబ్‌లో నగ్నంగా హీరోయిన్ రచ్చ: అందాలన్నీ చూపిస్తూ హద్దు దాటిన బ్యూటీ

  Recommended Video

  Bangarraju పట్టిందల్లా బంగారమే.. Break Even దిశగా Sankranthi Winner| Filmibeat Telugu
   రికార్డు క్రియేట్ చేసిన సినిమా

  రికార్డు క్రియేట్ చేసిన సినిమా

  ప్రతికూల పరిస్థితుల్లోనూ విడుదలైన ‘బంగార్రాజు' మూవీ ప్రపంచ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్‌ను అందుకుని విజయాన్ని సొంతం చేసుకుంది. అదే సమయంలో జీ5లోనూ దీనికి భారీ స్పందనే దక్కుతోంది. దీంతో 24 గంటల వ్యవధిలోనే ఎక్కువ వ్యూస్‌ను అందుకుంది. తద్వారా అందులో ఎక్కువ క్లిక్స్ సంపాదించుకున్న ఏకైక సినిమా అరుదైన రికార్డును నమోదు చేసింది.

  English summary
  Akkineni Nagarjuna and Naga Chaitanya Did Bangarraju Movie Under Kalyan Krishna Direction. Now This Movie Movie Creats Record on ZEE5.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X