చిరు హైదరాబాద్ లో చిందేస్తే...చరణ్ చెన్నైలో

దాంతో చెన్నై లోని షిప్ యార్డ్ లో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. ఇక గతంలో చిరంజీవి నటించిన 'ఘరానా మొగుడు' చిత్రంలోని బంగారు కోడిపెట్ట... పాటకు రీమిక్స్ ఇది. ఈ పాటలో రామ్‌చరణ్‌తో కలిసి ముమైత్ ఖాన్ ఆడిపాడనుంది. ఘరానా మొగుడులో డిస్కోశాంతి ఈ పాటకు డాన్స్ చేసింది. ఈ పాటకు ప్రేమ్‌రక్షిత్ నృత్యరీతుల్ని సమకూరుస్తున్నారు. విశేషం ఏమిటంటే.. కీరవాణినే ఈ రెండు పాటలకు ట్యూన్స్ సమకూర్చటం జరిగింది.
ఇక పునర్జన్మల నేపథ్యం ఉన్న ఈ కథను గీతా ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. కాజల్ హీరోయిన్ కాగా శ్రీహరి ప్రధాన పాత్రధారి. ధీరుడు అని వర్కింగ్ టైటిల్ గా అనుకుంటున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్‌ని ఖరారు చేయలేదు. ఈ చిత్రానికి కథ: విజయేంద్రప్రసాద్, మాటలు: ఎం.రత్నం, స్త్టెలింగ్: రమారాజమౌళి, కెమెరా: సెంథిల్, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, నిర్మాత: అల్లు అరవింద్.


Click it and Unblock the Notifications











