»   »  2007 చివరి పుటలో బంగారుకొండ

2007 చివరి పుటలో బంగారుకొండ

Posted By:
Subscribe to Filmibeat Telugu
Navneet Kaur

రిషీ, నవనీత్ కౌర్ హీరోహీరోయిన్లుగా రూపొందిన బంగారుకొండ(పక్కా 420) ఈ సంవత్సరం విడుదల అయిన సినిమాలలో ఒక ప్రత్యేకతను సాధించబోతోంది. ఈ సంవత్సరం విడుదల కాబోతోన్న చివరి చిత్రంగా 2007 సినిమా సంవత్సరంలో నిలవబోతోంది. ఈ నెల 28న విడుదల కాబోతోంది. ఈ సినిమాతోపాటు ... ఓ చిన్నారి కోరిక... సినిమా కూడా విడుదల కాబోతోంది.

ఎస్ ఆర్ ఫిల్మ్స్ పతాకంపై వైవిధ్యమైన మాస్ కథతో ఈ చిత్రం రూపొందింది. వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటలను సోమవారంనాడు ఫిల్మ్ చాంబర్ లో ప్రదర్శించారు.

అచ్యుత లక్ష్మీ ఆర్ట్స్ పతాకంపై నాగేంద్ర కుమార్ వేపూరి దర్శకత్వంలో రూపొందిన ఓ చిన్నారి కోరిక సినిమాకు సంబంధించిన వివరాలను ఫిల్మ్ చాంబర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరించారు. ఆధునిక భార్యాభర్తలు తమ బిజీలైఫ్ తో సంపాదన మీదే దృష్టి సారించడంతో చిన్నారులు ఎలా నిర్లక్ష్యానికి గురవుతున్నారో అనే కథాంశంతో సినిమా రూపొందింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X