»   »  ఎన్నారై పాత్రలో సంగీత దర్శకుడు!

ఎన్నారై పాత్రలో సంగీత దర్శకుడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Bappi Lahiri
సంగీత దర్శకులు అడపాదడపా ప్రక్కకు వచ్చి సినిమాల్లో పాత్రలు వేసి రిలాక్స్ అవటం తెలిసిందే. అప్పట్లో గ్యాంగ్ లీడర్ వంటి చిత్రాలకు సంగీతం అందించిన బాలీవుడ్ సంగీత దర్శకుడు బప్పిలహరి ఇప్పుడు తన భారీ ఆకారంతో తెరపై కనపడనున్నారు. అయితే అది ఓ NRI పాత్రట. సొహైల్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న మై అవుర్ మిసెస్ ఖన్నా చిత్రంలో ఈ పాత్రను పోషిస్తున్నాడు. అలాగే ఈ సినిమాలో ఆయన రెండు పాటలు పాడనున్నారు. సాజిద్-వాజిద్ సంగీతం అందించే ఈ చిత్రం కోసం ఆయన ఆస్ట్రేలియా కూడా వెళ్ళనున్నారు. అయితే ఇలా తెరకెక్కటం ఆయనకు ఇష్టం లేదట. సల్మాన్ ఖాన్ ఫోన్ చేసి ఒప్పించాడుట. ఇంతకు ముందు నేను ఓం శాంతి ఓం లో వేసిన గెస్ట్ రోల్ బాగా క్లిక్ అయింది. అది గమనించే ఈ నిర్ణయం తీసుకున్నారేమో అంటున్నాడు.ఇక ఇదే ప్రేరణతో నేను మై లవ్...డిస్కో కింగ్ అనే మ్యూజిక్ ఆల్బమ్ ని రూపొందిస్తున్నా అంటున్నాడు. దాంతో మన లోకల్ బప్పీలహరీని అయిన చక్రీ అప్పుడెప్పుడూ తెరపై కనపడటం గమనించే ఈ నిర్ణయం తీసుకున్నాడని అంతా అనుకుంటున్నారు. కానీ అలా ఎందుకు జరుగుతుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X