అనారోగ్యం నుంచి కోలుకున్న బాపు
బాపును పరీక్షించిన వైద్యులు రక్తపోటు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు హృద్రోగ నిపుణులు డాక్టర్ రమేష్ ఆయనకు ప్రత్యేక వైద్యసేవలు అందించారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యవర్గాలు తెలిపాయి. ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ఆయనను డిశ్చార్జి చేశారు. అనంతరం ఆయన ఫ్లైట్లో చెన్నయ్ వెళ్లారు.
కేంద్రం పద్మశ్రీ అవార్డు ప్రకటించిన తర్వాత బాపుకు కంగ్రాట్స్ చెప్పడానికి చాలా మంది ఆయన నివాసానికి చేరుకున్నారు. అయితే అస్వస్థత కారణంగా ఆయన ఎవరితోనూ మాట్లాడ లేక పోయారు. ఆ తర్వాత బాపును ఆసుపత్రిలో చేర్పించారు. బాపు ఆసుపత్రి పాలయ్యారనే విషయం తెలిసి పలువురు అభిమానులు ఆందోళనకు గురయ్యారు. బాపు ఆసుపత్రిలో చేరిన విషయాన్ని తెలుసుకుని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, అల్లు అరవింద్ ఆసుపత్రికి వచ్చి ఆయన్ను పరామర్శించారు.
చిత్రకారుడు అయిన బాపు 1967 నుంచి సినిమాలకు దర్శకత్వం మొదలు పెట్టారు. ఆయన తెలుగులో 'సాక్షి' అనే సినిమాను తొలిసారిగా సూపర్ స్టార్ కృష్ణతో తీసారు. ఆయన దర్శకత్వం వహించిన ముత్యాల ముగ్గు, బాలరాజు కథ, అందాల రాముడు, పెళ్లి పుస్తకం, మిస్టర్ పెళ్లాం, శ్రీరామ రాజ్యం చిత్రాలు పలు జాతీయ అవార్డులు దక్కించుకున్నాయి.


Click it and Unblock the Notifications












