»   » ‘జస్టిస్ చౌదరి’కథ తో సంబంధం లేదు

‘జస్టిస్ చౌదరి’కథ తో సంబంధం లేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ''ఇందులో నేను డ్యూయిల్ రోల్ లో కనిపిస్తాను. సిగార్ పైప్ తాగుతూ దర్పాన్ని ప్రదర్శించే శంకర్ నారాయణ్ పాత్ర ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. చాలామంది జస్టిస్ చౌదరి గెటప్‌లా ఉందంటున్నారు. ఆ సినిమాతో ఎటువంటి సంబంధం లేదు. నేను బాలీవుడ్ నటుడు సంజీవ్ కుమార్ అభిమానిని. 'త్రిశూల్' సినిమాలో ఆయన గెటప్ అంటే చాలా ఇష్టం. ఆ సినిమా స్ఫూర్తితోనే ఈ గెటప్ వేశాను'' అని రాజ్‌కుమార్ చెప్పారు. ఆయన ద్విపాత్రాభినయంతో తెరకెక్కిన చిత్రం 'బారిష్టర్‌ శంకర్‌ నారాయణ్‌'. ఎన్‌.ఎ. తార దర్శకురాలు. ఈ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకొస్తోంది.


అలాగే ...''సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్నాకే బుల్లితెరపై అడుగుపెట్టాను. టీవీ సీరియల్స్ ల్లో నటిస్తున్నా.. సినిమా మీద మమకారం పోలేదు. అందుకే ఎలాగైనా మళ్లీ సినిమాలు చేయాలని తిరిగొచ్చేశాను. అయితే అవకాశాలివ్వడానికి ఎవరూ సిద్ధంగా లేరని తెలిసింది. అందుకే నాకు నేనుగా ఓ కథ సిద్ధం చేసుకొని సినిమా చేశాను''అన్నారు రాజ్‌కుమార్‌.

Barrister Shankar Narayan release on Sept 21

ఇక ''నేను మళ్లీ సినిమాల్లోకి వస్తున్నానంటే ఎలాంటి పాత్రలకు సరిపోతానా అనేది దర్శక నిర్మాతలకు అర్థం కావడం లేదు. అందుకే నాలోని నటుణ్ని తెరపై ఆవిష్కరించేందుకు ఈ సినిమా చేశాను. ఈ సినిమా రాజ్‌కుమార్‌ ఎలాంటి పాత్రలకైనా నప్పుతాడు అని నిరూపించేలా ఉంటుంది. ఈ సినిమా చేస్తున్నానంటే వద్దని అన్నవారే.. ఇప్పుడు ప్రచార చిత్రాలు చూసి చాలా బాగున్నాయని మెచ్చుకుంటున్నారు''అని చెప్పారు.

కథ గురించి చెబుతూ ''ఈ సినిమా మామా అల్లుళ్ల మధ్య జరిగే కథతో తెరకెక్కింది. ఇందులో అన్ని రకాల అంశాలుంటాయ''న్నారు. శంకర్‌నారాయణ్‌ పాత్ర గురించి చెబుతూ ''ఈ పాత్ర జస్టిస్‌ చౌదరిని పోలి ఉందని అందరూ అంటున్నారు. అయితే దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది. 'త్రిశూల్‌' సినిమాలో సంజయ్‌ కుమార్‌ పాత్ర స్ఫూర్తిగా ఈ పాత్రను తీర్చిదిద్దుకున్నాను''అన్నారు.

English summary
Popular television actor Raj Kumar is coming back to big screen as hero with Barrister Shankar Narayan movie. He is playing the lead role in Barrister Shankar Narayan movie. Raj Kumar says that his portrayal as lawyer will impress audience. Already Raj Kumar is creating hulchul with a ferocious getup on posters. This role will show the other side of the actor in Raj Kumar. Alankrita is acting as heroine opposite Raj Kumar in this movie. Popular choreographer Tara is turning director with this movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu