»   » బతుకమ్మ సాక్షిగా తెలంగాణా ఫిల్మోత్సవం- అక్టోబర్ మూడున ప్రారంభం కానున్న "బతుకమ్మ ఫిల్మోత్సవ్-2"

బతుకమ్మ సాక్షిగా తెలంగాణా ఫిల్మోత్సవం- అక్టోబర్ మూడున ప్రారంభం కానున్న "బతుకమ్మ ఫిల్మోత్సవ్-2"

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమా రంగం లో తెలంగాణా ప్రాంత ఔత్సాహిక కళాకారులనూ, దర్షకత్వం లో ప్రతిభ ఉన్న యువకులనూ ప్రోత్సహించటానికి తెలంగాణా ప్రభుత్వం ఆద్వర్యం లో బతుకమ్మ పండుగ సందర్భంగా "ఫిల్మోత్సవం" నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తమ చిత్రాలను ప్రదర్శించుకోవటానికి పెద్ద పెదా హాల్లు ఏర్పాటు చేసుకోలేని యువకులకు ఈ వేదిక ఒక మంచి అవకాశం అవనుంది. 2015 నుంచీ ఈ కార్యక్రమం మొదలయ్యింది.

ఈ సంవత్సరం కూడా మెరికల్లాంటి యువదర్శకులూ, కళాకారులూ, నిపుణులు కలిసి తెలంగణా భాషా సాంస్కృఇక శాఖ ఆద్వర్యం లోనిర్మించిన లఘుచిత్రాలూ, డాక్యుమెంటరీల ప్రదర్శన జరగనున్నట్టు. భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తెలిపారు. అంతరించి పోతున్న కొన్ని కళలా రూపాలను దృశ్య రూపం లో భద్ర పరిచే ప్రయత్నంలో భాగంగా. ఇప్పటికే సినీ పరిశ్రమలో ఉన్న ఔత్సాహిక యువకులను భాగస్వాములను చేసినట్టు తెలిపారు.

పేరిణీ వంటి కళారూపాలను కాపాడి ముందు తరాలకి అందించేందుకు తపన ఉన్న వారే తమతో కలిసి పని చేయటానికి ముందుకు వచ్చారని చెప్పారు. "గత సంవత్సరం విజయవంతంగా జరిగిన "బతుకమ్మ ఫిల్మోత్సవం" ఈ సారి రెండో సెషన్ జరుపుకుంటుంది. రవీంద్ర భారతి మొదటి అంతస్తు "పైడి జయరాజు మినీ హాల్' లో అక్టోబర్ 3 నుండి 7 వరకు ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు నిర్వహించనున్నారు.

Batukamma Filmotsav will be Held from October 3rd to 7th

ఫిల్మోత్సవం ప్రారంభ చిత్రంగా మొదటిరోజు "మట్టి మనుషులు" ప్రదర్షణ జరగుతుంది. ప్రదర్షన పూర్తయిన వెంటనే ఈ చిత్ర దర్శకులు బీ. నర్సింగ రావు గారు "మీట్ ద మేకర్" కార్యక్రమం లో పాల్గొంటారు. చివరి రోజు వివిధ టి‌వి మరియు వెబ్ చానల్స్ తీసిన బతుకమ్మ వీడియో పాటలను ప్రదర్శించటం జరుగుతుంది. ఆ తర్వాత వరుసగా రోజూ మిగతా సినిమాల ప్రదర్శన, మిగిలిన సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని ఆయన తెలిపారు.

తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పటికే చిత్ర నిర్మాణ రంగంలో ఉన్న అనేకమంది యువదర్శకులూ, రచయితలూ, ఫిలిం మెరకర్లకోసమే ఈ వేదిక ఉపయోగపడనుందనీ, దీనికోసం తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు ప్రత్యేక శ్రద్దతో పూర్తి సహకారం అందించటం తో ఎలాంటి ఆటంకాలూ జరగకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించగలుగుతున్నామనీ చెప్పారు.

వారు నిర్మించిన చిత్రాలను ప్రదర్శించుకోవటానికి ఈ వేదిక అవకాశం ఇవ్వనుందనీ చెబుతూ మొత్తం అయిదు రోజుల పాటు జరిగే ఈ ఫిల్మోత్సవం లో చివరి రోజు వివిధ టి‌వి మరియు వెబ్ చానల్స్ తీసిన బతుకమ్మ వీడియో పాటలను ప్రదర్శించటం జరుగుతుంది. మిగతా రోజుల్లో ప్రభుత్వం నిర్మించిన డాక్యుమెంటరీ లు సినిమాలూ ప్రదర్శిస్తారు.

Batukamma Filmotsav will be Held from October 3rd to 7th

రాష్ట్ర గిరిజన పర్యాతక శాఖా మత్రి అజ్మీర చందూలాల్, రాష్ట్ర పర్యాటక & సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఎంతో శ్రమకోర్చి మరీ ఈ కార్యక్రమం కోసం సమయం కేటాయించుకొని పనులని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండగా.. ప్రభుత్వ సలహా దారు శ్రీ కేవీ వీ రమణా చార్యులు, తెలంగాణ సంస్కృతిక సారధి రసమయి బాల కిషన్ లు తమ పూర్థి సహకారాన్ని అందిస్తూ.. ఫిల్మోత్సవం విజవంతం చేయటం కోసం తలమునకలు గా పనిచేస్తూనే ఉన్నారు.

అయిదు రోజుల ఫిల్మోత్సవ్ కార్యక్రమ వివరాలు:
అక్టోబర్ 3- మట్టిమనుషులు - దర్శకులు బీ. నర్సింగ రావు గారి ముఖాముఖీ
అక్టోబర్ 4 - కాకి పడగల కథ డాక్యుమెంటరీ - అక్షర కుమార్, సాధనా శూరులు డాక్యుమెంటరీ - ఐ. శివ
అక్టోబర్ 5 - బొమ్మలొల్లు - అజిత్ నాగ్ , ఒగ్గు చుక్క - KVR మహేంద్ర
అక్టోబర్ 6 - కోలాటం బై హుమాయూన్ సంఘీర్ , పేరిణి వీడియో - యెన్నెన్జీ (NNG-నరేందర్ గౌడ్ నగులూరి)
అక్టోబర్ 7 - వివిధ చానల్స్ నిర్మించిన బతుకమ్మ పాటల ప్రదర్శన లు జరుగనున్నాయి. ప్రవేశ రుసుము లేకుండానే ఈ ప్రదర్శనలన్నీ చూసే అవకాసం కల్పిస్తున్నట్టు మామిడి హరి కృష్ణ తెలిపారు.

English summary
Batukamma Filmotsav will be Held from October 3rd to 7th says telangana cultural dipartment Director Mamidi Harikrishna
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu