»   » కంగ్రాట్స్ :'బాహుబలి' కి అంతర్జాతీయ గౌరవం

కంగ్రాట్స్ :'బాహుబలి' కి అంతర్జాతీయ గౌరవం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'బాహుబలి'. రానా ముఖ్యభూమిక పోషిస్తున్నారు. అనుష్క, తమన్నా హీరోయిన్స్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పుడు అంతర్జాతీయ గౌరవాన్ని పొందబోతోంది. బీబిసిలో ఈ చిత్రానికి సంభందించిన ఇంటర్వూలు రానున్నాయి. ఈ మేరకు రీసెంట్ గా రాజమౌళి, రానా ఇంటర్వూలు, టీమ్ లో కొందరి తీసుకున్నారు. ఇలా నిర్మాణంలో ఉన్న ఓ తెలుగు సినిమాకు ఇలాంటి అరుదైన గౌరవం దక్కటం విశేషమే.

ఇండియన్ సినిమా వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా బిబీసి తరుపున సంజీవ్ భాస్కర్ ఓ డాక్యుమెంట్ తీస్తున్నారు. ఇందులో బాహుబలికి సైతం స్ధానం ఇచ్చారు. ఇంకా రిలీజ్ కాని ఓ చిత్రానికి ఇలాంటి స్ధానం లభించటం గొప్ప విషయం అని టాలీవుడ్ అంటోంది. ఈ ఇంటర్వూ ద్వారా అంతర్జాతీయ గౌరవం లభిస్తుందంటున్నారు. అంతేకాదు ఈ చిత్రాన్ని అంతర్జాతీయంగా విడుదల చేస్తారు కాబట్టి బిజినెస్ కు సైతం ప్లస్ అయ్యే అవకాసం ఉంది.

BBC interviews cast and crew of Bahubali

ఇక మొన్నటివరకూ ఈ చిత్రం రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ సాగింది. కొన్ని నెలలుగా అక్కడ యుద్ధం నేపథ్యంలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. అయితే ప్రభాస్ చేతికి సర్జరీ జరగటంతో గ్యాప్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా సంస్థ నిర్మిస్తోంది. మరో నెల రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది.

ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. అనంతరం ఇతర భాషల్లో అనువదించి ఒకేసారి విడుదల చేస్తారు. ఈ సినిమాకోసం ఇప్పటికే ప్రధాన తారాగణమంతా కత్తి యుద్ధాలు, గుర్రపుస్వారీ నేర్చుకొంది.

English summary

 Rajamouli Said.... "Glad to interact with Sanjeev Bhasker of the BBC's "The Kumars at No. 42" & "Goodness Gracious Me" fame, is shooting a documentary on the 100 Years of Indian Cinema. They have interviewed many members of our Baahubali cast & crew!"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu