»   » ఔట్ రైట్ ఫన్నీ, ఆ సినిమా సూపర్ హిట్ అంటూ రాజమౌళి ట్వీట్

ఔట్ రైట్ ఫన్నీ, ఆ సినిమా సూపర్ హిట్ అంటూ రాజమౌళి ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఏదైనా సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో రాజమౌళి దాని గురించి తన సోషల్ నెట్వర్కింగ్ ద్వారా ప్రశంసలు గుప్పిస్తే ఆ సినిమాకు ఓపెనింగ్స్ అదిరిపోతాయి. అందుకు కారణం ఆయన జడ్జిమెంట్ సూపర్ గా ఉంటుందని సినీ జనాల నమ్మకం. ఇక సినిమా విడుదలైన తర్వాత సినిమా బావుందని చెబితే...ఇక ఆ సినిమా సూపర్ హిట్టే. గతంలో ఆయన ఇలా ప్రశంసలు గుప్పించిన సినిమాలు మంచి విజయం సాధించాయి.

BBM is out right funny: Rajamouli

తాజాగా నాని ‘భలే భలే మగాడివోయ్' సినిమా కూడా రాజమౌళి ప్రశంసించారు. సినిమా చాలా బావుందని, ఔట్ రైట్ ఫన్నీ సినిమా. నాని పెర్ఫార్మెన్స్ అదరగొట్టాడు. నానికి పోటీగా లావణ్య త్రిపాఠి కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. సినిమాలోని చాలా ఇన్సిడెంట్స్ లో నాని స్థానంలో నన్ను నేను చూసుకున్నట్లు ఉంది అంటూ రాజమౌళి ట్వీట్ చేసారు.

నాని, లావణ్య త్రిపాఠిలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'భలే భలే మగాడివోయ్‌'.మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లుఅరవింద్‌ సమర్పిస్తున్నారు. సెప్టెంబర్ 4న ఈ చిత్రం విడుదలైంది. గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నివాస్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రంలో నాని మతిమరుపు కుర్రాడిగా నటించాడు. ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్ తో పాటు యువతనూ అలరిస్తోంది. మురళిశర్మ, సితార, నరేష్, స్వప్నమాధురి, శ్రీనివాసరెడ్డి, వెన్నెలకిశోర్, ప్రవీణ్, షకలక శంకర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్: ఉద్ధవ్, కెమెరా: నిజార్ షఫీ, సంగీతం: గోపీ సుందర్, నిర్మాత: బన్నీవాసు, రచన, దర్శకత్వం: మారుతి.

English summary
BBM is out right funny. With an author backed role Nani stole the show with his performance. Equally adorable is lavanya. Personally there. Are so many incidents in the entire film where I was watching myself instead of Nani...:) Congrats to the whole team. Well deserved success!
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu