»   » ఆక్రమణ కేసులో నోటీసులు అందుకున్న స్టార్ హీరో

ఆక్రమణ కేసులో నోటీసులు అందుకున్న స్టార్ హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు : కన్నడ హీరో దర్శన్ కు బెంగళూరు నగర పాలక సంస్ద అధికారులు ఆక్రమణ విషయంలో నోటీసులు జారి చేసారు. ఏడు రోజులు లోపు ఈ నోటీసులకు వివరణ ఇవ్వాల్సి ఉంటుందని తెలియచేసారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజ కాలువ ఆక్రమణకు సంబంధించి నటుడు దర్శన్‌కు బెంగుళూరు జిల్లా అధికార యంత్రాంగం నోటీసులు జారీచేసింది. అదే విధంగా ఎస్‌ఎస్ ఆస్పత్రి యాజమాన్యంతో పాటు మొత్తం 69 మందికి నోటీసులు అందజేశారు.

అలాగే హలగేవడరహళ్లి గ్రామ సర్వే నెంబరు 38 నుంచి 46 వరకు, సర్వే నెంబరు 51 నుంచి 56 వరకు ఉన్న 7 ఎకరాల 31 గుంటల ప్రభుత్వ భూమి. ఇందులో ఐడియల్‌హోమ్స్ సహకార సంఘం పేరుతో కొందరు ప్రైవేటు వ్యక్తులు అనధికారికంగా లేఔట్ వేశారు.

BBMP serves notice to Sandalwood star Darshan

అందులో 3 ఎకరాల 20 గుంటల స్ధలంలో మొత్తం 32 ఖాళీ స్థలాలు ఉండగా, ఎకరా 38 గుంటల స్థలంలో ఇళ్లు, భవనాలు నిర్మించారు. 22 గుంటల స్థలంలో ఎస్.ఎస్ ఆసుపత్రిని నిర్మించగా ఎకరా 24 గుంటల స్థలం రోడ్డుకు వినియోగిస్తున్నారు.

7 గుంటల స్థలంలో బీబీఎంపీ వాటర్ ట్యాంకు నిర్మించినట్లు జాయింట్ కలెక్టర్ జిల్లా యంత్రాంగానికి నివేదిక అందజేశారు. నోటీసులు జారీ చేసిన వారంలోగా సమాధానం ఇవ్వాలని కలెక్టర్ వీ శంకర్ తెలిపారు.

English summary
Kannada actor Darshan and former minister Shamanur Shivashankarappa's family have been slapped with notices for alleged encroachment of storm water drains by structures owned by them in Rajarajeswhari Nagar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu