»   » సంపెంగ నూనె అనుకోండి: బాహుబలి టీంకు బెస్ట్ గిఫ్టు!

సంపెంగ నూనె అనుకోండి: బాహుబలి టీంకు బెస్ట్ గిఫ్టు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పూర్వం మన దేశంలో మీసాలు, గడ్డాలు బాగా వృద్ధి చెందేందుకు సంపెంగ నూనె పట్టించేవారట. అయితే ఈ కాలంలో సంపెంగ నూనె దొరకడం కష్టమే. అయితే గడ్డాలు, మీసాలు అందంగా తీర్చు దిద్దుకునేందుకు మార్కెట్లో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి బియర్డో! మీసాలు, గడ్డాలు అందంగా కనిపించడానికి వాడే....ఈ తరం సంపెంగ నూనె.

బాహుబలి సినిమాలో హీరో ప్రభాస్ తో పాటు, విలన్ రానా.....కట్టప్ప పాత్రధారి సత్యరాజ్ లతో పాటు సినిమాలో కనిపించే చాలా మంది భారీ, మీసాలతో కనిపిస్తారు. బాహుబలి షూటింగ్ సమయంలో దర్శకుడు రాజమౌళి కూడా భారీ గడ్డంతో కనిపించారు. సెకండ్ పార్టులో యాక్టర్స్ గడ్డాలు, మీసాలు మరింత అందంగా కనిపించాలని, బాహుబలి టీం సెకండ్ పార్టుతో మరో సక్సెస్ కొట్టాలని ఆకాంక్షిస్తూ.... బియర్డో కంపెనీ నుండి గిఫ్టు అందింది. సదరు గిఫ్ట్ కిట్ ఫోటోను బాహుబలి టీం సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసింది.

Beardo kit for Baahubali team

'బాహుబలి: ది కన్‌క్లూజన్‌'షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. పార్ట్ 1 'బాహుబలి-ది బిగినింగ్' చూసిన ప్రతి ఒక్కరూ.... పార్ట్ 2 'బాహుబలి-ది కంక్లూజన్' ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనే ప్రశ్నకు సమాధానం తెలసుకోవడానికైనా చాలా మంది ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

2016 లోనే పార్ట్ 2 విడుదల కావాల్సిన ఉన్న షూటింగ్ షెడ్యూల్ అనుకున్న సమయానికి మొదలు కాక పోవడంతో వాయిదా పడింది. 2017లోనే సినిమా రిలీజ్ చేయాలని డిసైడ్ చేసారు. తాజాగా బాహుబలి-2 రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ విషయాన్ని బాలీవుడ్ పాపులర్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఏప్రిల్ 14, 2017లో బాహుబలి సెకండ్ పార్ట్ రిలీజ్ చేస్తున్నట్లు ఆయన ఖరారు చేసారు.

English summary
"Thank you for the lovely gesture, Beardo! Awesome kit. Team Baahubali Kush hua!" Team Baahubali tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu