»   » హీరోయిన్ దియా మీర్జా ఎంగేజ్మెంట్ (ఫోటో)

హీరోయిన్ దియా మీర్జా ఎంగేజ్మెంట్ (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ నటి దియా మీర్జా నిశ్చితార్థం అధికారికంగా జరిగింది. తన బాయ్ ఫ్రెండ్, వ్యాపార భాగస్వామి అయిన సాహిల్ సంగాతో న్యూయార్కులో ఈ వేడుక జరిగింది. ఈ విషయాన్ని దియా మీర్జా తన ట్విట్టర్ పేజీలో వెల్లడించడంతో పాటు ఫోటోను కూడా పోస్టు చేసారు.

'అఫీషియల్లీ ఎంగేజ్డ్' అనే క్యాప్షన్ పెట్టడంతో పాటు తను, సాహిల్ సంగా కలిసి దిగిన ఫోటోను ట్విట్ చేసారు. దీనికి న్యూయార్క్ నగరం పేరును హాష్ ట్యాగ్ గా ఇవ్వడం ద్వారా అక్కడే తమ నిశ్చితార్థం జరిగిందనే సంకేతాలు పంపారు. ఇటీవలే దియా మీర్జా ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనడానికి అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడే తమ బాలీవుడ్ సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్నారు.

Beautiful Dia Mirza Gets Officially Engaged!

దియా మీర్జా గురించిన వివరాల్లోకి వెళితే...ఆమె మన హైదరాబాద్ ప్రాంతానికి చెందిన అమ్మాయే. సికింద్రాబాద్ స్టాన్లీ కాలేజీలో చదివింది. మిస్ ఇండియా కిరీటం గెలుచుకున్న తర్వాత బాలీవుడ్ సినిమా రంగంలో అడుగు పెట్టింది.

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కొంతకాలం నటిగా తన ప్రస్తానం సాగించిన దియా మీర్జా...ఆ తర్వాత సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. దియా మీర్జా, సాహిల్ సంగా కలిసి 'బోర్న్ ఫ్రీ ఎంటర్టెన్మెంట్స్' అనే సినీ నిర్మాణ సంస్థను 2011లో స్థాపించారు.

English summary
Bollywood actress-producer Dia Mirza has officially got engaged with her long time businessman beau Sahil Sangha.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu