»   » రజనీకాంత్‌కు ఊహించని షాక్.. తమిళుల ఫైర్

రజనీకాంత్‌కు ఊహించని షాక్.. తమిళుల ఫైర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇటీవల కాలంలో తనకు సంబంధం లేకున్నా కొన్ని వివాదాలు సూపర్ స్టార్ రజనీకాంత్‌ను చుట్టుముడుతున్నాయి. త్వరలో శ్రీలంకలో పర్యటించనున్న రజనీకాంత్‌పై తమిళులు భగ్గుమంటున్నారు. ఆయన పర్యటనపై తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తమిళనాడు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థిని రజనీ కలవడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దాంతో ఆయన స్వయంగా బీజేపీకి మద్దతు ఇవ్వడం లేదని చెప్పుకోవాల్సి వచ్చింది.

వచ్చే నెల 10న జాఫ్నాకు రజనీ

వచ్చే నెల 10న జాఫ్నాకు రజనీ

జాఫ్నాలో తమిళ శరణార్థుల కోసం జ్నానం ఫౌండేషన్ నిర్మించిన గృహాల ప్రారంభోత్సవం కోసం ఏప్రిల్ 10న జాఫ్నాకు వెళ్లేందుకు రజనీకాంత్ పర్యటన ఖారారైంది. అయితే ఆయన పర్యటనను విదుథలై చిరుథైగల్ కచ్చి (వీసీకే), మరుమర్లర్చి ద్రావిడ మున్నేత్ర కజగం (డీఎండీకే) గ్రూపులకు చెందిన తమిళ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

తమిళ ఈలం సంస్థల నిరసన

తమిళ ఈలం సంస్థల నిరసన

లైకా గ్రూప్ శ్రీలంకకు చెందినది కావడంతోనే ప్రత్యేక ఈలం కోసం ఉద్యమిస్తున్న తమిళ సంస్థలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. 2014లో లైకా గ్రూప్ నిర్మించిన కత్తి చిత్రాన్ని శ్రీలంక తమిళ సంస్థలు నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విజయ్ హీరోగా నటించారు.

లైకా నిర్మిస్తున్న రోబో 2.0లో రజనీ

లైకా నిర్మిస్తున్న రోబో 2.0లో రజనీ

ప్రస్తుతం లైకా గ్రూప్ నిర్మిస్తున్న రోబో 2.0 చిత్రంలో రజనీకాంత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీలంక పర్యటనలో భాగంగా జఫ్నాలో నిర్వహించే బహిరంగ సభలో రజనీ పాల్గొంటారు. ఆయా గృహాల సముదాయంలో మొక్కల నాటే కార్యక్రమంలో పాల్గొంటారు.

కా ఫౌండేషన్‌పై గుర్రు

కా ఫౌండేషన్‌పై గుర్రు

లైకా గ్రూప్ చైర్మన్ శుభకరన్ అల్లిరాజా తల్లి పేరున ఏర్పాటు చేసిన ఫౌండేషన్ దాదాపు రూ.22 కోట్ల వ్యయంతో గృహ నిర్మాణాలను చేపడుతున్నది. జాఫ్నాలోని నిరాశ్రుయులైన తమిళుల కోసం చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ఏడాదిన్నర క్రితమే పూర్తయినప్పటీకి కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతు వస్తున్నది.

 రోబో 2.0 నిర్మిస్తున్న లైకా

రోబో 2.0 నిర్మిస్తున్న లైకా

ప్రస్తుతం రజనీకాంత్ నటిస్తున్న రోబో 2.0 చిత్రాన్ని లైకా గ్రూప్ నిర్మిస్తున్నది. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది దీపావళీకి విడుదల కానున్నది.

English summary
Pro-Tamil groups are protesting against superstar Rajinikanth for his visit to Jaffna on April 10. The homes have been built by Lyca for displaced Tamils in Sri Lanka. Thalaivar's much-anticipated 2.0, which is bankrolled by Lyca for a whopping Rs 400 crore.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu