»   » బాహుబలి2కు రిలీజ్‌కు ఎదురుదెబ్బ.. రాజమౌళి ఏం చేస్తాడో.. కట్టప్పపై ఆగ్రహం.. బంద్‌కు పిలుపు..

బాహుబలి2కు రిలీజ్‌కు ఎదురుదెబ్బ.. రాజమౌళి ఏం చేస్తాడో.. కట్టప్పపై ఆగ్రహం.. బంద్‌కు పిలుపు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి2 విడుదలను నిరసిస్తూ కన్నడ అనుకూల సంస్థలు ఏప్రిల్ 28న కర్ణాటక రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వడం సంచలనంగా మారింది. బాహుబలి2 చిత్ర ప్రదర్శనను అడ్డుకొంటామని కన్నడ వర్గాలు హెచ్చరించినట్టు సమాచారం. తొమ్మిదేళ్ల క్రితం కావేరి జలాలపై నటుడు సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలకు ప్రస్తుతం వివాదాస్పద రంగు పులుముకోవడం చర్చనీయాంశమైంది. బాహుబలి ది బిగినింగ్ రిలీజ్ అనంతరం రెండేళ్ల తర్వాత బాహుబలి ది కన్‌క్లూజన్ ఈ నెల 28న విడుదలకు ముస్తాబవుతున్న సంగతి తెలిసిందే.

కట్టప్ప వ్యాఖ్యలు..

కట్టప్ప వ్యాఖ్యలు..

కావేరి జలాల విషయంలో నటుడు, కట్టప్ప పాత్రధారి సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదమయ్యాయి. కట్టప్ప వ్యాఖ్యలపై కన్నడ వర్గాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బాహుబలి2 రిలీజ్‌ను అడ్డుకొంటామని వారు వార్నింగ్ ఇచ్చారు. బాహుబలి2 విడుదలను పురస్కరించుకొని ఏప్రిల్ 28న బంద్‌కు పిలుపునిచ్చాయి.


సత్యరాజ్ క్షమాపణ చెప్పాలి..

సత్యరాజ్ క్షమాపణ చెప్పాలి..

కావేరి అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సత్యరాజ్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి అని కన్నడ అనుకూల వర్గాలు డిమాండ్ చేశాయి. ఈ వివాదంపై దర్శకుడు రాజమౌళి స్పందించారు. బాహుబలి2 చిత్ర రిలీజ్‌ను అడ్డుకోవాలని నిర్ణయం తీసుకోవడం అత్యంత విషాదం. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను చూసి షాక్ గురయ్యాం అని ఆయన పేర్కొన్నారు.


ఇప్పుడెందుకు ఈ వివాదం

ఇప్పుడెందుకు ఈ వివాదం

సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలు తొమ్మిదేళ్ల నాటివి. ఆ తర్వాత కర్ణాటకలో దాదాపు 30 చిత్రాలు విడుదల అయ్యాయి. బాహుబలి1 కూడా విడుదలైంది. అప్పుడేమీ సమస్యలు రాలేదు. బాహుబలి2 రిలీజ్‌కు ముందు హఠాత్తుగా ఈ సమస్య రావడం అంతుపట్టడం లేదు. ఇప్పుడు పాత వివాదాన్ని తెరపైకి తీసుకురావడం సరికాదు అని రాజమౌళి అన్నారు.


తొమ్మిదేళ్ల క్రితం..

తొమ్మిదేళ్ల క్రితం..

2008లో కావేరి జలాల వివాదంపై, సూపర్‌స్టార్ రజినీకాంత్‌పై సత్యరాజ్ ఆగ్రహపూరితమైన ప్రసంగం చేశాడు. హోగెనక్కల్ సమీక‌ృత తాగునీటి ప్రాజెక్ట్‌ పునాది అంశం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య చిచ్చు రాజేసింది. ప్రాజెక్ట్ విషయంలో కర్నాటక ప్రభుత్వ తీరుపై తమిళ నటుల సంఘం నిరసన వ్యక్తం చేసింది.


రజనీకాంత్‌పై సత్యరాజ్ ఫైర్

రజనీకాంత్‌పై సత్యరాజ్ ఫైర్

ఓ నిరసన కార్యక్రమంలో కర్నాటక ప్రభుత్వ తీరును పలువురు హీరోలు ఎండగట్టారు. రజినీకాంత్ కూడా కన్నడ ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. అయితే సత్యరాజ్ చేసిన ప్రసంగం మాత్రం ఇప్పుడు అత్యంత వివాదాస్పదమైంది.


సత్యరాజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్

సత్యరాజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్

సత్యరాజ్ మాట్లాడిన వీడియో ఇటీవల ఇంటర్నెట్‌లో విస్తృతంగా ప్రచారమైంది. ఆ వీడియోలో రజనీకాంత్‌పై సత్యరాజ్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. కన్నడిగుల తీరుపై కట్టప్ప మండిపడ్డాడు. కన్నడ ఉద్యమ కారుడు వటల్ నాగరాజ్ ఓ కామెడీ క్యారక్టర్‌తో పోల్చడం కన్నడ వాసుల ఆగ్రహానికి గురైంది.


బాహుబలి2 టార్గెట్‌గా..

బాహుబలి2 టార్గెట్‌గా..

సత్యరాజ్ వ్యాఖ్యలు వివాదస్పదమైనప్పటికీ దానిని అంతగా పట్టించుకోలేదు. బాహుబలి తర్వాత కట్టప్ప పాత్రను ధరించిన సత్యరాజ్‌కు దేశవ్యాప్తంగా పేరు వచ్చింది. ఈ నేపథ్యాన్ని ఆసరాగా చేసుకొని సత్యరాజ్ టార్గెట్ చేసుకొన్నారు. సత్యరాజ్ క్షమాపణలు చెప్పాలని కన్నడవాసులు డిమాండ్ చేస్తున్నారు.


ఎక్కడికెళ్తుందో ఈ వివాదం..

ఎక్కడికెళ్తుందో ఈ వివాదం..

కట్టప్ప సత్యరాజ్ కారణంగా బాహుబలి2 చిత్రం వివాదాస్పదమైంది. ఈ చిత్రం విడుదల కాకుండా అడ్డుకోవడం ద్వారా మళ్లీ ఈ వివాదం రాజుకొంటుందా అనే సందేహం వ్యక్తమవుతున్నది. అయితే ఈ వివాదాన్ని సద్దుమణిగేలా చేయడం కోసం చిత్ర నిర్మాతలు ఉద్యమ నాయకులతో సంప్రదింపులు చేపట్టినట్టు సమాచారం.


English summary
Prabhas and Rana Daggubati's Baahubali 2 is facing the wrath of Kannada groups in Karnataka. An objectionable speech made by Sathyaraj, (in 2008), who plays an important role in the film, is now haunting the team as the protesters are demanding an unconditional apology from the Tamil actor. Interestingly, Sathyaraj's speech at the meet was largely ignored at that time as the heat was on Rajinikanth. The video of the speech took the internet by storm only in the recent times after Baahubali was released. Pro-Kannada groups have called for a Karnataka bandh on the release date of Baahubali 2, April 28, to protest the screening of the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more