»   » వేశ్యలతో దేశానికి మేలు.. కించపరుచొద్దు.. నా భార్యకు గుండెపోటు..

వేశ్యలతో దేశానికి మేలు.. కించపరుచొద్దు.. నా భార్యకు గుండెపోటు..

Written By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  తేజాబ్ చిత్రం నుంచి మొదలు ఆఖరీ పాస్తా వరకు చంకీ పాండే పోషించిన పాత్రలు ప్రేక్షకులను వెంటాడుతుంటాయి. చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత తాజాగా శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వంలో విద్యాబాలన్ నటించిన బేగంజాన్ చిత్రంలో చంకీ మరోసారి గుర్తుండి పోయే పాత్రను పోషించారు.

  Chunky Pandey

  చిత్ర ట్రైలర్‌లో ఆ పాత్ర తప్ప కనీసం చంకీని గుర్తుపట్టకపోవడం నటన పట్ల ఆయనకు ఉన్న అంకితభావం కనిపించింది. బేగంజాన్ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో చంకీపాండే మీడియాతో ముచ్చటించారు. బేగంజాన్‌లో పాత్ర దక్కిన విషయం దగ్గర నుంచి వేశ్యల స్థితిగతులను విపులంగా చర్చించారు.

  బేగంజాన్ ట్రైలర్ స్పందన అద్భుతం

  బేగంజాన్ ట్రైలర్ స్పందన అద్భుతం

  బేగంజాన్ ట్రైలర్ విడుదలైన తర్వాత వచ్చిన స్పందన అద్భుతంగా ఉంది. సోషల్ మీడియా ద్వారా వచ్చిన సందేశాలు చాలా సంతోషం కలిగింది. బేగంజాన్‌లో నేనే పోషించే పాత్ర చాలా కీలకమైంది. తన చుట్టుూ ఉన్న పరిస్థితులను మార్చివేసే పాత్ర అని చంకీ తెలిపారు.

  దేశానికి వారు మేలు చేస్తున్నారు..

  దేశానికి వారు మేలు చేస్తున్నారు..

  వేశ్యవృతి నేపథ్యంగా సాగే బేగంజాన్ చిత్రం గురించి మాట్లాడుతూ.. దేశానికి వేశ్యలు మేలు చేస్తున్నారు అని చంకీ అన్నారు. బెంగాలీలో రూపొందిన రాజ్‌కహీని చిత్రం టైలర్ చూసిన తర్వాత మొట్టమొదటగా వచ్చిన ఆలోచన ఏమిటంటే విద్యబాలన్ తప్ప ఎవరూ ఆ పాత్రను చేయలేరు అనిపించింది. ఈ చిత్రంలో అశ్లీలం అనే మచ్చుకైనా కనిపించదు. చాలా సామాజిక అంశాలను సృశిస్తుంది.

  వేశ్యవృత్తిలోని మహిళల శక్తి గురించి

  వేశ్యవృత్తిలోని మహిళల శక్తి గురించి

  సినిమా మహిళా చైతన్యం గురించి కాదు. వేశ్యవృత్తిలో కొనసాగుతున్న మహిళల శక్తియుక్తుల గురించి చాటిచెప్పే చిత్రం. దురదృష్టవశాత్తూ వేశ్యవృత్తిని కించపరిచేలా చూస్తున్నాం. వారంతా దేశానికి మేలు చేస్తున్నారు. వేశ్యవృత్తిని చట్టబద్దం చేయాలి. దాంతో దేశంలో ఇక లైంగిక దాడుల ఘటనలు చాలా తగ్గుముఖం పడుతాయి అని అన్నారు.

  నన్ను చూసి కుక్క తరిమింది

  నన్ను చూసి కుక్క తరిమింది

  బేగంజాన్‌లో నా పాత్ర కోసం మార్చుకొన్న నా వేషధారణ చూసి నా భార్య దిగ్భ్రాంతికి గురైంది. నేను ఇంటికి వెళ్లే సరికి నా పెంపుడు కుక్క తరిమింది. ఎవరో దొంగ ఇంట్లోకి జొరబడిందనే కారణంతో నాపై దాడికి ప్రయత్నించింది. నన్ను చూసి నా పనిమనిషి బెదిరిపోయింది.

  నా వేషం చూసి భార్యకు గుండెపోటు..

  నా వేషం చూసి భార్యకు గుండెపోటు..

  నా భార్య గదిలోకి వెళ్లిన నన్ను చూసి ఆమెకు గుండెపోటు వచ్చినంత పనైంది. నన్ను గుర్తు పట్టకపోగా ఎవరో దోపిడిదొంగ అనుకొని కేకలు పెట్టింది. ఆ తర్వాత నన్ను గుర్తుపట్టి తర్వాత జుట్టుపెరిగే వరకు నీవు నా భర్తవు కావు. మన మధ్య సంబంధమే లేదు అని భార్య పేర్కొన్నదని తెలిపింది.

  టాయిలెట్‌లో ఉండగా సినిమా అవకాశం..

  టాయిలెట్‌లో ఉండగా సినిమా అవకాశం..

  నేను ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లోని టాయ్‌లెట్‌ ఉండగా నా మొదటి సినిమా అవకాశం లభించింది. ఆ సమయంలో టెలివిజన్ సీరియల్స్‌లో నటించేందుకు ఆడిషన్స్‌కు హాజరవుతున్నాను. ఓ రోజు హోటల్ టాయ్‌లెట్‌లో ఉండగా (ప్రస్తుత సెన్సార్ బోర్డు అధ్యక్షుడు) పహ్లాజ్ నిహ్లానీ నుంచి ఫోన్ వచ్చింది. నా నంబర్ నోట్ చేసుకొని రేపు వచ్చి కలువు అని ఆయన చెప్పారు. మరుసటి రోజు పహ్లాజ్ నిహ్లానిని కలువగా ఆగ్ హీ ఆగ్ అనే సినిమాలో తొలి అవకాశం లభించింది.

  తేజాబ్‌లో అవకాశం అలా..

  తేజాబ్‌లో అవకాశం అలా..

  హిందీలో రూపొందిస్తున్న ప్రతిఘాత్ చిత్రంలో అవకాశం కోసం ప్రముఖ దర్శకుడు ఎన్ చంద్రను కలిశాను. అయితే ఆ చిత్రంలో తనకు సరిపోయే పాత్ర లేదని, వచ్చే ఏడాది అనిల్ కపూర్‌తో సినిమా చేస్తున్నాను. అప్పుడు వచ్చి కలిస్తే అవకాశం ఇస్తాను అని చెప్పాడు. అదే తేజాబ్ సినిమా అని, ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో తనకు మంచి పేరు, అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి అని చంకీ తెలిపారు.

  English summary
  Begum Jaan actor Chunky Pandey opened up about why he feels that prostitution should be legalised in the country. There's no vulgarity in Begam Jaan. It's bold and shameless. The film is not about women empowerment, it's about powerful women who are in the oldest profession in the world: Prostitution.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more