»   » ముక్కలుగా నరికేస్తాను.. సాలా.. కోటలో రాణిగా చస్తా.. గర్జించిన విద్యాబాలన్

ముక్కలుగా నరికేస్తాను.. సాలా.. కోటలో రాణిగా చస్తా.. గర్జించిన విద్యాబాలన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆగస్టు 1947లో లార్డ్ మౌంట్ బ్యాటన్ పర్యవేక్షణలో అఖండ భారతం భారత్, పాకిస్థాన్‌గా రెండు ముక్కలైంది. దేశ విభజన‌లో ఓ వేశ్య ఇంటిని మాత్రం రెండుగా చీల్చే విషయంలో తలెత్తిన వివాదం కథా నేపథ్యమే బేగం జాన్ చిత్రం.

దేహాన్ని ముక్కలు చేస్తాను..

రెండు దేశాల సరిహద్దులో ఉన్న వేశ్యగ‌‌ృహాన్ని మధ్య విభజన రేఖ వెళ్తున్నందున ఇంటిని ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు ఇస్తారు. అందుకు జవాబుగా ఇంటిని, నన్ను ఖాళీ చేస్తున్నారు. ఇది నా ఇళ్లు, నా దేశం.. విభజనను నేను ఒప్పుకొను. ఒకవేళ మమ్మల్ని ఇక్కడి నుంచి తరలించాలని ప్రయత్నిస్తే వారి చేతులను, కాళ్లను, దేహాన్ని ముక్కలు ముక్కలుగా విభజిస్తాం (పార్టీసన్).

కోటలో రాణిగా మరణిస్తాను..

కోటలో రాణిగా మరణిస్తాను..

అధికారుల మాటవిని కోటను ఖాళీచేసి వెళ్లు. లేదా కుక్కచావు చస్తావు అని బెదిరిస్తారు. అందుకు జవాబుగా నన్నే బెదిరిస్తారా? ఒకవేళ చావాల్సి వస్తే ఈ కోట రాణిగా మరణిస్తాను అని బేగం జాన్ హెచ్చరిస్తుంది.

నెలలు లెక్కించడం మాకు వస్తుంది..

నెలలు లెక్కించడం మాకు వస్తుంది..

నెలరోజుల్లో కోటను ఖాళీ చేయాలని బెదిరిస్తే.. నెలరోజులు లెక్కించడం మాకు వస్తుంది. ప్రతి ఒక్క వెధవ (సాలా) మాలో ఏదో రకంగా రక్తం కళ్లజూస్తారు అని ఆగ్రహంతో చెప్పిన డైలాగ్స్ అదరగొట్టాయి. కేవలం దేహం మాత్రమే మనసు కూడా చాలా విలువైనదేననేది బేగం జాన్ భావన అంటూ చెప్పించిన సంభాషణలు హైలెట్‌గా నిలిచాయి.

బేగం జాన్‌గా విద్యాబాలన్ అదుర్స్

బేగం జాన్‌గా విద్యాబాలన్ అదుర్స్

వేశ్యాగృహం యజమానిగా బేగం జాన్ అలియాస్ విద్యాబాలన్ నటన ట్రైలర్‌లో దేశవ్యాప్తంగా పలువురిని విశేషంగా ఆకట్టుకొంటున్నది. ఈ కథ పంజాబ్ సరిహద్దు ప్రాంతంలో జరిగింది. హుక్కా చేతిలో పట్టుకొని పొగపీల్చుతూ విద్యాబాలన్ పలికించిన హావభావాలపై బాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

బిగ్ బీ వాయిస్ ఓవర్ సూపర్బ్

బిగ్ బీ వాయిస్ ఓవర్ సూపర్బ్

ట్రైలర్‌లో అమితాబ్ చెప్పిన వాయిస్ ఓవర్ అద్భుతంగా ఉంది. బిగ్ బీ చేత కథను చెప్పే విధానం దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టింది. అమితాబ్ గొంతు ఈ ట్రైలర్‌కు అదనపు ఆకర్షణగా నిలిచింది.

ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు బేగం జాన్

ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు బేగం జాన్

ఏప్రిల్ 14న విడుదల అవుతున్న ఈ చిత్రంలో నసీరుద్దీన్ షా, రజిత్ కపూర్, గౌహర్ ఖాన్, ఆశీష్ విద్యార్థి తదితరులు నటించారు.

English summary
The first look of new trailer of Begum Jaan is the so impressive. All actors look impressive in their parts. Begum Jaan aka hookah-smoking Vidya owns it as the bold owner of a brothel in the period drama.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu