»   » చార్మీ మెసేజ్ వెనుక ఉద్దేశ్యం ఏమిటి?: ఆ ట్విట్టర్ పోస్ట్ తర్వాత ఆన్ లైన్ కి రాని చార్మి

చార్మీ మెసేజ్ వెనుక ఉద్దేశ్యం ఏమిటి?: ఆ ట్విట్టర్ పోస్ట్ తర్వాత ఆన్ లైన్ కి రాని చార్మి

Posted By:
Subscribe to Filmibeat Telugu

మత్తుమందుల వ్యాపారంలో ఆరితేరిన కెల్విన్‌ చెబుతున్న వివరాలు పోలీస్ అధికారులకు విస్మయం కలిగిస్తున్నాయి. ప్రధానంగా ఒక మాజీ హీరోయిన్‌ ఎల్‌ఎస్డీకి పూర్తిగా బానిసైందని చెప్పిన కెల్విన్‌ 'ఆమె నేను పిలిస్తే ఎక్కడికంటే అక్కడికి వస్తుంది. ఇప్పుడు పిలిపించమంటారా?' అనడంతో అధికారులు షాక్ తిన్నరట. ఆ హెరోయిన్ ఎవరన్నది ఇప్పటికి పక్కా సమాచారం లేదు గానీ.. ఛార్మి డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకోవడం ఆమె అభిమానులను షాక్‌కు గురిచేసే అంశం.

జ్యోతిలక్ష్మీ

జ్యోతిలక్ష్మీ

13 ఏళ్లకే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఛార్మి సొంత ఇమేజ్ తెచ్చుకుంది.. హీరోయిన్ ఓరియంటెడ్ రోల్స్‌లో ప్రతిభ చాటిన ఛార్మి జ్యోతిలక్ష్మీ తర్వాత నటించటం ఆపేసింది. దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో కలిసే ఈ సినిమా తీసిన ఛార్మి మొత్తానికి నిర్మాతగా మారిందనుకున్నారు, ప్రొడక్షన్ వర్క్‌లో ఉండడంవల్ల కావాలనే సినిమాలకు దూరంగా ఉందని బావించారు.

ఒక షాక్ అనే అనుకోవాలి

ఒక షాక్ అనే అనుకోవాలి

అలాంటి ఛార్మి హఠాత్తుగా డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకోవటం ఒక షాక్ అనే అనుకోవాలి. గతంలో డ్రగ్స్ కేసులో ఛార్మి పేరు ఎప్పుడూ బయటకు రాలేదు. క్లీన్ ఇమేజ్ ఉన్నఛార్మి మత్తువలలో చిక్కారంటే ఇండస్ట్రీలో అసలు కింద వర్గాలలో ఈ జాడ్యం ఎక్కడిదాకా వెళ్ళిందో అన్న దాని పైకి దృష్టి మళ్ళుతోంది.

ఇంస్టాగ్రామ్లో ఒక పోస్ట్

ఇంస్టాగ్రామ్లో ఒక పోస్ట్

ఛార్మి ఇప్పుడు తన ఇంస్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేసింది. ఛార్మి ఏమి అన్నది అంటే "నీ చుట్టూ ఉన్నవారు నిన్ను హేళన చేసి చిన్నబుచ్చినా.. నువ్వు ఏమీ బాధ పడవలిసిన అవసరం లేదు. అలా వాళ్ళు చేస్తున్నారు అంటే అది కేవలం నీ దైర్యంను దెబ్బ తీయడానికే. నువ్వు వాళ్ళకన్నా గొప్పగా ఆలోచిస్తేనే నిన్ను ఇలా అవమానపరుస్తారు'' అంటూ మెసేజ్ ఇచ్చింది అమ్మడు.

Balakrishna to romance with Charmi Kaur - Filmibeat Telugu
పైసా వసూల్

పైసా వసూల్

ప్రస్తుతానికి రాబోతున్న బాలకృష్ణ పూరీ జగన్నాధ్ కాంబినేషన్లో వస్తున్న ‘పైసా వసూల్' సినిమాకు ఆమె ప్రొడక్షన్ సైడ్ వర్క్ చేస్తోంది. సినిమాలు ఏమీ చేయకపోయాన సోషల్ మీడియాలో ఛార్మికి మంచి ఫాలోయింగే ఉంది మరి. ఇంతకీ ఈ కేసులో చార్మీ నిజంగానే ఇరికించబడిందా? లేక తానే ఇరుక్కుందా అన్నది ఇప్పుడప్పుడే తేలే వ్యవహారం గా కనిపించటం లేదు.

English summary
It is shocking to see the Name of Charmi kaur in Drugs List, she Leaves a message in her Twitter
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu