twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భయాన్ని కలిగిస్తున్న ఓమిక్రాన్ వేరియంట్ కరోనా వైరస్‌.. పుష్ప నుంచి RRR వరకు మళ్ళీ కొత్త డేట్స్.. ఎందుకంటే?

    |

    సినిమా చరిత్రలో మొదటిసారి కరోనా వైరస్ కారణంగా భారీ స్థాయిలో సినిమా ఇండస్ట్రీలు నష్టపోయాయి. కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా చాలా రంగాలలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో దెబ్బకొట్టింది. అయితే సినిమా పరిశ్రమలోనే ఆ ప్రభావం అందరికీ ఎక్కువగా కనిపించింది. ప్రస్తుతం కూడా వైరస్ తీవ్రత తగ్గినప్పటికీ అతి జాగ్రత్తలతో సినిమా హాల్స్ ను నడిపిస్తున్నారు. చాలా జాగ్రత్తలు పాటిస్తూనే ముందుకు సాగాలని ప్రస్తుతం ధైర్యంతో వెళుతున్నారు. కానీ ప్రస్తుతం కొత్తరకం వైరస్ ఇండస్ట్రీ లో భయాన్ని కలిగిస్తుంది. అందుకే ఇటీవల RRR సినిమా ట్రైలర్ ను కూడా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అందుకు ఒక బలమైన కారణం కూడా ఉంది.

    ఫెస్టివల్స్ లో ఎక్కువ టార్గెట్

    ఫెస్టివల్స్ లో ఎక్కువ టార్గెట్

    ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఫెస్టివల్ సీజన్ లోనే ప్రేక్షకుల ముందుకు రావాలని చూస్తున్నారు. ఎందుకంటే మిగతా రోజుల్లో కంటే కూడా ఫెస్టివల్స్ లోనే సినిమా కలెక్షన్స్ ఎక్కువగా వస్తాయి. కాబట్టి బ్రేక్ ఈవెన్ ని కూడా చాలా తొందరగా అందుకునే అవకాశం ఉంటుంది. సంక్రాంతి సీజన్లో అయితే ఒకేసారి మూడు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగిపోతున్నాయి.

    ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

    ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక


    కరోనా వైరస్ లో కొత్త వేరియంట్ భయాన్ని కలిగిస్తుంది. ఓమిక్రాన్ వేరియంట్ కోవిడ్ 19 ప్రపంచ దేశాలను మళ్లీ ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ కొత్తరకం వైరస్ పై హెచ్చరికలు కూడా జారీ చేసింది. రానున్న రోజుల్లో పరిస్థితులు ఏవిధంగా మారతాయో ఊహించడం కష్టమేనని వైద్య నిపుణులు అంచనాలు వేస్తున్నారు. వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) అగ్ర దేశాల ను కూడా హెచ్చరించింది.

    RRR ట్రైలర్ వాయిదా

    RRR ట్రైలర్ వాయిదా

    ఇక కొన్ని సినిమాల విడుదల విషయంలో నిర్మాతల్లో ఆలోచనలను మారినట్లుగా కనిపిస్తోంది. డిసెంబర్ 3వ తేదీన RRR సినిమా ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే అయితే ఇప్పుడు మాత్రం మళ్లీ ట్రైలర్ ను వాయిదా వేస్తున్నట్లు వివరణ ఇచ్చారు. అనుకోని కారణాల వల్లనే RRR ట్రైలర్ ను వాయిదా వేస్తున్నట్లు చెబుతున్నారు.

    ఓమిక్రాన్ వేరియంట్ భయంతో..

    ఓమిక్రాన్ వేరియంట్ భయంతో..

    టెక్నికల్ గా అయితే ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా తొందరగానే సాల్వ్ అవుతుంది. కానీ చిత్ర యూనిట్ వాయిదా వేయడానికి అసలు కారణం అదికాదు అని సోషల్ మీడియాలో చాలా రకాల కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఓమిక్రాన్ వేరియంట్ కరోనా వైరస్‌ ముంచుకొస్తున్న తరుణంలో మళ్లీ భయంతో థియేటర్స్ కు తెరవకపోతే మొదటికే మోసం వస్తుందని చిత్ర యూనిట్ సందిగ్ధంలో పడినట్లు గా రూమర్స్ వస్తున్నాయి.

    Recommended Video

    Choreographer Shiva Shankar Master శివైక్యం... ప్రముఖుల సంతాపం!! || Filmibeat Telugu
    తేడా వస్తే అవి కూడా వాయిదా?

    తేడా వస్తే అవి కూడా వాయిదా?


    ట్రైలర్ విడుదల చేయక పోవడానికి కారణం ఏమిటి అంటే సినిమా తప్పక అనుకున్న సమయానికి వస్తేనే ట్రైలర్ ను నెల ముందు విడుదల చేస్తే బాగుంటుంది. కానీ ఓమిక్రాన్ వేరియంట్ కరోనా వైరస్‌ హవా పెరుగుతున్న సమయంలో మళ్లీ విడుదల తేదీని మార్చి వేస్తే ట్రైలర్ వృధా అవుతుంది అని దర్శక ధీరుడు రాజమౌళి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. తేడా వస్తే డిసెంబర్ మిడ్ నుంచి వచ్చే సినిమాలన్ని కూడా మళ్లీ యధావిధిగా వాయిదా పడతాయని కామెంట్స్ వస్తున్నాయి. పుష్ప నుంచి రాధేశ్యామ్ వరకు అన్ని సినిమాలు కూడా వాయిదా పడవచ్చు అని కూడా అంటున్నారు. మరి ఆ కొత్త వైరస్ ఎంతవరకు ప్రభావం చూపిస్తుందో కాలమే సమాధానం ఇవ్వాలి.

    English summary
    Behind the reason on RRR trailer release date and omicron variant effect
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X