For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తెర వెనుక :‘శ్రీమంతుడు’ షూటింగ్ టైమ్ లో (ఫన్ వీడియో)

  By Srikanya
  |

  హైదరాబాద్ :మహేష్ బాబు, శృతిహాసన్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శ్రీమంతుడు'. మైత్రి మూవీ మేకర్స్‌, ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. బ్యానర్స్‌‌పై తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 7న విడుదలై హిట్ టాక్‌తో వెళ్తన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో చిత్రం నిర్మాతలు బిహైండ్ సీన్స్ ని వీడియోని విడుదల చేసారు. ఈ వీడియో చాలా సరదాగా ఫన్నీగా ఉంది. మీరూ ఓ లుక్కేయండి.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  ఇక ‘శ్రీమంతుడు' ట్రైలర్‌లోని రాజేంద్రప్రసాద్, శ‌ృతిహాసన్, ఊరి జనం నడుచుకుంటూ వచ్చే సన్నివేశం సినిమాలో లేదు. ఆ సీన్‌ని ఈనెల 28నుంచి జత చేసి వదిలారు. ఈ సీన్స్ కు మంచి అప్లాజ్ వస్తోంది.

  దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ "ఈ సినిమా మూడవవారం కూడా హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో రన్ అవుతోంది. ఈ చిత్రాన్ని మేం కష్టపడిన దానికంటే ఎక్కువ సక్సెస్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంత పెద్ద హిట్ చేసిన ఫ్యాన్స్‌కి మా టీమ్ తరఫున స్పెషల్ థ్యాంక్స్. ట్రైలర్‌లో ఉన్న రెండు ముఖ్యమైన సీన్లను లెంగ్త్ ఎక్కువైన కారణంగా తొలగించాం.. అయితే ఆ సీన్లు ఉంటే బాగుండేది అని చాలామంది చెప్పారు. దీంతో ఆ సీన్లకు సెన్సార్ చేయించి 28వ తేదీ సాయంత్రం నుంచి ‘శ్రీమంతుడు' ప్రదర్శింపబడుతున్న అన్ని థియేటర్లలో ఈ రెండు సీన్లను జత చేస్తున్నాం'' అన్నారు.

  Behind the Scenes : Srimanthudu Movie Bloopers

  నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ "మా బ్యానర్‌లో నిర్మించిన మొదటి సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సెకండ్ బిగ్గెస్ట్ హిట్ ఇది. మహేశ్, కొరటాల శివ గారికి స్పెష్ థాంక్స్. రాజకీయనాయకులు, స్పోర్ట్స్ పర్సన్స్, స్టార్స్ అందరూ ఈ చిత్రాన్ని చూశారు. ఈ వారంలో సచిన్ టెండూల్కర్ కూడా చూస్తానన్నారు. ఈ చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియన్స్‌కు చాలా చాలా థ్యాంక్స్'' అని అన్నారు.

  జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, అలీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్‌, శివాజీ రాజా, కాదంబరి, ముకేష్‌ రుషి, సంపత్‌, హరీష్‌, ఏడిద శ్రీరాం, తులసి, సుకన్య, సీతారాం, సన ఇతర తారాగణం. ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్యశాస్త్రి, డ్యాన్స్‌: రాజుసుందరం, దినేష్‌, బాస్కో సీజర్‌, థ్రిల్స్‌: అనల్‌ అరసు, అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌: త్రివేది, అసోసియేట్‌ డైరెక్టర్స్‌: శేషు, జయరాం రవి, కో డైరెక్టర్స్‌: వాసు, తులసి, చీఫ్‌ కో డైరెక్టర్స్‌: పి.వి.వి. సోమరాజు, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌: ఎ.యస్‌.ప్రకాష్‌, కెమెరా: మది, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చంద్రశేఖర్‌ రావిపాటి, నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సి.వి.ఎమ్‌), కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కొరటాల శివ.

  English summary
  Srimanthudu Movie Bloopers, behind the scenes featuring Mahesh Babu, Shruti Haasan exclusively on Mythri Movie Makers. Srimanthudu also features Jagapathi Babu, Brahmanandam, Rajendra Prasad, Sukanya, Sampath Raj, Harish Uthaman, Rahul Ravindran. While the movie continuing its successful stint at Box Office, makers add two new scenes to the film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X