»   » పోలీసుల అదుపులో నాగచైతన్య నిర్మాత

పోలీసుల అదుపులో నాగచైతన్య నిర్మాత

Posted By:
Subscribe to Filmibeat Telugu
Kiran Kumar Koneru
హైదరాబాద్ : న్యాయస్థానం ఆదేశాలతో సినీ నిర్మాత కోనేరు కిరణ్‌కుమార్‌ను బంజారాహిల్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిరణ్‌కుమార్‌ శ్రీయ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై నాగచైతన్య హీరోగా 'బెజవాడ' అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్ర నిర్మాణం కోసం 2011లో ప్రసాద్‌ ల్యాబ్స్‌ ఫైనాన్స్‌ సంస్థ నుంచి రూ.కోటి అప్పుగా తీసుకున్నారు.

సకాలంలో తిరిగి చెల్లించకపోవడంతో ఫైనాన్స్‌ నిర్వాహకులు గతేడాది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రెండుసార్లు న్యాయస్థానంలో హాజరు కావాలన్న నోటీసులకు కిరణ్‌కుమార్‌ స్పందించకపోవడంతో బెయిలుకు వీలుకాని వారెంట్‌ జారీ అయింది. ఈ నేపథ్యంలో శనివారం పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆరోగ్యం బాగాలేదని చెప్పడంతో వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రిలో చేర్చారు.

నాగచైతన్య హీరోగా, వివేక్ కృష్ణ అనే నూతన దర్శకుడుని పరిచయం చేస్తూ బెజవాడ చిత్రం రూపొందింది. ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ఫలితాన్ని చవిచూసింది. కథ, కథనాలు సరిగ్గా లేకపోవటం, టెక్నికల్ గా నాశిరకంగా ఉండటంతో మొదటి రోజే బాక్స్ లు వెనక్కి వెళ్లిపోయే పరిస్దితి వచ్చింది. దానికి తోడు వర్మ .. బెజవాడ టైటిల్ ని టార్గెట్ చేస్తూ విపరీతమైన హైప్ క్రియేట్ చేసారు. ఆ హైప్ కి తగ్గట్లు సినిమా లేకపోవటం చాలా మందిని నిరాశపరిచింది.

నాగచైతన్యను సైతం ఈ చిత్రం బాగా దెబ్బతినటంతో యాక్షన్ హీరోగా ఎదుగుదామనే ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. అందరికన్నా ఎక్కువ నష్టపోయింది మాత్రం అమలా పౌల్ మాత్రమే. విక్రమ్ తో చేసిన నాన్న చిత్రం చూసిన వాళ్లు ఆమెకు వరసగా ఆఫర్స్ ఆఫర్ చేసారు. అయితే ఆమె వెంటనే వర్మ సినిమా ఒప్పుకుని వాటిని రిజెక్టు చేసింది. దాంతో బెజవాడ రిజల్టు చూసిన వాళ్ళు ఆమెతో సినిమా చేయటానికి ఆసక్తి చూపటం లేదు.


బెజవాడ సినిమాలు ప్లాపవ్వడం నాగచైతన్యకు గుణపాఠం నేర్పిస్తాయని, ఇలాంటి దెబ్బలు తగిలితేనే కెరీర్ లో మంచి స్థాయికి పోతారని వ్యాఖ్యానించారు నాగార్జున. ఆయన మాట్లాడుతూ...చైతన్య ఇంకా యువకుడే, సినీరంగంలో అతనికి ఉన్న అనుభవం చాలా తక్కువ, నేను కూడా కెరీర్ తొలినాళ్లలో చాలా ప్లాపులు ఫేస్ చేశాను. అంతెందుకు నేను నటించిన చిత్రం కూడా ప్లాపు. కొన్నిసార్లు అలా జరుగుతుంటాయి. అంచనాలు తప్పుతుంటాయి అని చెప్పకొచ్చారు.

English summary
News is that Kiran Kumar Koneru who has produced films for Ramu like 'KSD Appalaraju' 'Bejawada' etc has under Police custody.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu