twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగచైతన్య ‘బెజవాడ రౌడీలు’వివాదంపై వర్మ వివరణ

    By Srikanya
    |

    మే 12న ప్రారంభమైన 'బెజవాడ రౌడీలు" అనుకున్న ప్రకారం షూటింగ్ జరుపుకుంటోంది. విజయవాడలో ఈ చిత్రం షూటింగ్ కోసం పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదని, దాంతో చిత్రం ఆగిపోయిందని పలు రకాలుగా వస్తున్న వార్తలలో నిజం లేదు. ఆగస్టు వరకు జరిగే మూడు షెడ్యూల్స్‌తో చిత్రం పూర్తవుతుంది. విజయదశమి కానుకగా చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ క్లారిటీ ఇచ్చారు.

    నాగచైతన్య కథానాయకుడిగా శ్రేయా ప్రొడక్షన్స్ పతాకంపై వివేక్ కృష్ణ దర్శకత్వంలో రామ్‌ గోపాల్ ‌వర్మ, కిరణ్ ‌కుమార్ కోనేరు నిర్మిస్తున్న చిత్రం 'బెజవాడ రౌడీలు". ప్రస్తుతం ఈ చిత్రం విజయవాడలో షెడ్యూల్ పూర్తి చేసుకుని హైదరాబాద్‌లో మరో షెడ్యూల్ జరుపుకుంటోంది. ఈ చిత్రం ఆగిపోయిందనీ, షూటింగ్ జరగడంలేదని అవాస్తవ ప్రచారం జరుగుతోందని దర్శకుడు రామ్ ‌గోపాల్‌ వర్మ ఈ విషయంపై వివరణ ఇవ్వడానికి ముందుకు వచ్చారు.

    కోట శ్రీనివాసరావు, అభిమన్యు సింగ్, ఆహుతి ప్రసాద్, శుభలేఖ సుధాకర్, ముకుల్‌దేవ్, అజయ్, అశోక్‌ కుమార్, ఫణి, భరత్, శ్రావణ్ తదితరులు నటిస్త్తున్న ఈ చిత్రానికి సంగీతం: అమర్ మోహ్లే, ప్రేమ్, ధరమ్ సందీప్, విశాల్, నిర్మాతలు: రామ్‌ గోపాల్ వర్మ, కిరణ్ కుమార్ కోనేరు. కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వివేక్ కృష్ణ.

    English summary
    We have completed schedule in the city already and moved to Hyderabad city for fresh shoot as per plan. By August we will finish the entire Bejawada Rowdilu movie and planning to release on Dussera," RGV said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X