twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వర్మ సినిమాకి సెన్సార్ తిప్పలు..రివైజింగ్ కమిటీకి పంపిన ‘బెజవాడ’...?

    By Sindhu
    |

    నాగచైతన్య, అమలాపాల్ జంటగా వివేక్ కృష్ణ దర్శకత్వంలో రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న 'బెజవాడ" చిత్రానికి సెన్సార్ బోర్ట్ షాక్ ఇచ్చిందని తెలుస్తోంది. ఈ సినిమాని చూసిన సెన్సార్ సభ్యలు 20కట్లు ఇచ్చారని సమాచారం. ఇంతటితో ఆగకుండా ఈ సినిమాలో కొన్ని సామాజిక వర్గాలను కించపరిచే విధంగా సీన్లు ఉన్నాయని చెబుతూ ఈ సినిమాని రివిజన్ కమిటీకి పంపించాలని డిసైడ్ అయ్యిందట సెన్సార్ బోర్డ్. నవంబర్ 25న విడుదలవ్వాల్సిన ఈ సినిమా డిసెంబర్ 2కి వాయిదా పడింది. ఇప్పుడు సెన్సార్ బోర్డ్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ సినిమా విడుదల వాయిదాపడుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

    రామ్ గోపాల్ వర్మ మరియు కిరణ్ కోనేరు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. నాగ చైతన్య సరసన అమలా పాల్ నటించగా వివేక్ కృష్ణ దర్శకత్వం వహించారు. రాముగారి నుంచి వస్తున్న మరో డిఫరెంట్‌ మూవీ ఇది. నాగచైతన్య పెర్‌ఫార్మెన్స్‌ హైలైట్‌గా నిలుస్తుంది. నాగార్జునగారికి 'శివ"లాంటి ట్రెండ్‌ సెట్టర్‌ మూవీ అందించిన రామ్‌ గోపాల్‌ వర్మ నాగచైతన్య కెరీర్‌లో ఓ బెస్ట్‌ మూవీగా 'బెజవాడ"ని అందిస్తున్నారు. బెజవాడ డిసెంబరు 2న విడుదల కానుంది. విజయవాడ పట్టణంలో 90లలో జరిగిన కుల రాజకీయాల నేపధ్యంగా తెరకెక్కింది. షూటింగ్ ప్రారంభమైన మొదటి రోజు నుండి వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమౌతోంది.

    English summary
    Ram Gopal Varma produced 'Bejawada' Movie was slated for release on 2nd of December month. However, unexpectedly the film has now landed in trouble as the censor board isn’t willing to give clearance to the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X