»   » రాశీఖన్నా నిర్మాతగా మారి ఏం తీసిందో తెలుసా? శభాష్ అంటారు

రాశీఖన్నా నిర్మాతగా మారి ఏం తీసిందో తెలుసా? శభాష్ అంటారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: హీరోయిన్ రాశీఖన్నా తాజాగా నిర్మాత అవతారం ఎత్తింది. ఆమె సొంత ప్రొడక్షన్‌లో ఓ ప్రత్యేకమైన ప్రాజెక్టుతో ముందుకు రానుంది. అయితే నిర్మాత, ప్రాజెకుటు అనగానే భారీగా ఏ సినిమా తీసేస్తోందో అని ఊహించుకుకోండి. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 'బిలీవ్‌ ఇన్‌ యూ' అనే వీడియోను విడుదల చేయనుంది. ఇందుకు సంబంధించిన టీజర్ లాంటి మేకింగ్‌ వీడియోను ఫేస్‌బుక్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది.

ఇక ఈ వీడియోకు వాయిస్‌ఓవర్‌ కూడా రాశీఖన్నానే ఇవ్వనుండటం గమనార్హం. "నా మసుసుకు ఎంతో నచ్చిన ఓ సబ్జెక్టును మహిళా దినోత్సవం సందర్భంగా మీకు అందిస్తూ ప్రొడక్షన్ లో కూడా అడుగు పెడుతున్నా. ఇది ఒక చిన్న అతి చిన్న విప్లవం అధారంగా నిర్మితమైంది" అంటూ టీజ్ చేసింది రాశి ఖన్నా.

ఈ సందర్భంగా రాశీ మాట్లాడుతూ.. 'మహిళా దినోత్సవం నా హృదయానికి చాలా దగ్గరైన రోజు. ఇందుకోసం నా వంతు కృషిగా ఏమైనా చేయాలనుకున్నా. అందుకే నా ప్రొడక్షన్‌లో ఈ వీడియోను తీసుకొస్తున్నా. తమను తాము విశ్వసిస్తే ఎలాంటి విజయాలు సాధించవచ్చో దీని ద్వారా చూపిస్తా. ఇది అందరికీ స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నా' అని అన్నారు. అంతేకాకుండా ఆమె సొంతంగా రాసిన ఓ పద్యాన్ని కూడా అభిమానులతో పంచుకున్నారు.

ఇక ఈ స్పెషల్ వీడియో గురించి చెబుతూ.. "ఇప్పుడు కాకపోతే మరెప్పుడు.. నేను కాకపోతే మరెవ్వరు" అంటూ ఓ మెసేజ్ ను కూడా పోస్ట్ చేసిన రాశి ఖన్నా.. దానితో పాటే ఓ లెటర్ లో తను రాసిన కవితను కూడా అందించింది.

'వూహలు గుసగుసలాడే' చిత్రంతో తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టిన రాశీఖన్నా తనదైన స్టైల్ లో వరస చిత్రాలను చేస్తూ ముందుకు దూసుకుపోతోంది. వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు . ప్రస్తుతం రాశీ ఖన్నా పలు సినిమాలతో బిజీగా ఉండగా ఉన్ని కృష్ణన్-మోహన్ లాల్ ప్రాజెక్ట్ తో మలయాళం ఎంట్రీ కూడా ఇచ్చింది. ఇందులో ఈ సుప్రీమ్ బ్యూటీ ఆ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తుందట.

ఇక తెలుగులో గోపిచంద్ సరసన ఆక్సీజన్ మూవీలో నటించిన రాశి , రవితేజ టచ్ చేసి చూడు, జూనియర్ ఎన్టీఆర్ 27వ చిత్రాలలో హీరోయిన్ గా నటించనుంది. తమిళంలో సైతాన్ కా బచ్చా చిత్రం ఈ అమ్మడికి డెబ్యూ మూవీ కాగా ప్రస్తుతం ఈ చిత్రంతోను బిజీగా ఉంది రాశీ. ఇమైక్క నోడీగల్ అనే మరో తమిళ చిత్రంలో కూడా రాశీ నటిస్తుంది.

English summary
As Women's Day is fast approaching Rasi Khanna has penned a poem on women. A video will be releasing on this shortly as well. She will soon be releasing the video ‘Believe in You’ on March 8, 2017, on the eve of International Women’s Day.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu